స్విమ్స్ డైరెక్టర్‌గా డా.రవికుమార్ నియామకం
తిరుపతి: తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ రవికుమార్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం రవికుమార్ ఇన్చార్జ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.