breaking news
double crores
-
జ్యోతిష్యులకు బంపర్ ఆఫర్, వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ జ్యోతిష్య ప్లాట్‌ఫామ్ ఆస్ట్రోటాక్ స్థూల ఆదాయాన్ని ఏడాదిలో దాదాపు రూ. 400 కోట్లకు రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. 10వేల మంది జ్యోతిష్యులను తన ప్లాట్ఫామ్లో చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గుప్తా వెల్లడించారు. మార్కెటింగ్, సాంకేతికత, శిక్షణ, రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ బృందాలను పెంచడం ద్వారా కంపెనీ ఉద్యోగులను కూడా రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘మా కార్యకలాపాలను, ప్రస్తుత బృందాన్ని పెంచాలని చూస్తున్నాము. మా వద్ద ఉన్న జ్యోతిష్యుల సంఖ్యతో పోలిస్తే వినియోగదరులను (ట్రాఫిక్‌ను) ఆకర్షించడానికి మా మార్కెటింగ్ చాలా మెరుగ్గా ఉంది. మా వెబ్సైట్లో మేము పొందుతున్న ట్రాఫిక్‌ను ప్రస్తుత బృందం నిర్వహించలేకపోతోంది. ఇప్పటికే మా టెక్నాలజీ టీమ్‌లో వ్యక్తులను నియమించుకోవడం ప్రారంభించాము మేము 2022 చివరి నాటికి 10,000 మంది జ్యోతిష్యులతో భాగస్వామి కావాలని చూస్తున్నాము’’ అన్నారు. 3 కోట్ల మంది కస్టమర్లు నమోదు... సొంత వనరులతో అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన తన స్టార్టప్ ప్లాట్‌ఫారమ్, ఇప్పటి వరకు 3 కోట్ల కస్టమర్ సందర్శనలను నమోదు చేసిందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా తాము వ్యాపారం చేస్తున్నామని వెల్లడించారు. అయితే 3,500 కంటే ఎక్కువ జ్యోతిష్యుల సేవలను వినియోగించుకోలేకపోయినట్లు తెలిపిన ఆయన, ఇప్పుడు వీరిని భారీగా భాగస్వాములను చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ వార్షిక మార్కెటింగ్ బడ్జెట్ రూ.72 కోట్లు అయితే, సగటున నెలకు రూ.4 కోట్లు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని చెప్పారు. వార్షిక ప్రాతిపదికన దాదాపు రూ.200 కోట్లు అంటే రోజుకు దాదాపు రూ.55 లక్షల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నాన్-జ్యోతిష్యుల సంఖ్య దాదాపు 125గా ఉందని పేర్కొంటూ, మరింత మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. కంపెనీ నాన్-జ్యోతిష్యుల్లో రిక్రూటర్లు, జ్యోతిష్కుల శిక్షకులు, జ్యోతిష్య భాగస్వాములు, కస్టమర్ల కోసం రిలేషన్షిప్ మేనేజర్లు ఉన్నట్లు వెల్లడించారు. -
ఎన్నికల కసరత్తు షురూ
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రాబోయే సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియగా డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ నెల 21వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను వెల్లడించాలని మొదట్లో నిర్ణయించినా కొంత ఆల స్యంగా ఈ నెల 31వ తేదీన వెల్లడించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలలోని మౌలిక సదుపాయాలను సంబంధిత తహసీల్దార్లు, ఎస్ఐలు, బూత్ లెవల్ అధికారులు పరిశీలి స్తున్నారు. పోలింగ్ బూత్‌లలో మంచినీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సౌకర్యాలు ఉన్నాయో లేవో చూస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలలోని పోలింగ్ బూత్‌లను కూడా గుర్తించి ముందస్తుగానే ఎన్నికల అధికారులకు నివేదిక అందించేందుకు పరిశీలనలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3020 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2009 సాధారణ ఎన్నికలు, ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను గుర్తిస్తున్నారు. దీంతో పాటు ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండలాల వారీగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ నెల 24న రాష్ర్టస్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. 31న తుది జాబితా ప్రకటన నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార యంత్రాంగం తుది జాబితాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనుంది. నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2013 నవంబర్ 18వ తేదీ నుంచి 2013 డిసెంబర్ 23వ తేదీ వరకు చేపట్టారు. కాగా ప్రస్తుతం డబుల్ ఓట్ల తొలగింపు కార్యక్రమంతో పాటు తుది జాబితా ప్రకటనకు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన ఆర్డీఓ, తహసీల్దార్లు అన్ని పోలింగ్ స్టేషన్లలో తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. నియోజకవర్గానికి ఓ అధికారి ఓటర్ల నమోదుతో పాటు ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను చేపట్టడానికి నియోజకర్గానికి ఒక అధికారిని నియమించారు. గతంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నింటికీ ఆర్డీఓ ఎన్నికల అధికారిగా ఉండే వారు. కానీ ప్రస్తుతం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించారు. ఓటర్ల జాబితాలను సిద్ధం చేసే ప్రక్రియను వీరే చేపడుతున్నారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 12మంది డిప్యూటీ తహసీల్దార్లను నియోజకవర్గ ఎన్నికల అధికారులుగా నియమించారు. జిల్లాలో 3020 పోలింగ్ కేంద్రాలు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 3020 పోలింగ్ కేంద్రాలున్నాయి. 2013 నవంబర్ నాటికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో 25,19,559 ఓటర్లు ఉన్నారు. కాగా కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తికావడం వల్ల తుది జాబితా పూర్తయ్యే వరకు 2 నుంచి 4 శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉంది.