విత్ లవ్ ఫ్రమ్ రష్యా...
ఫ్రాన్స్‌కు పప్పీ కానుక
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గత వారం దాడులు చేసిన ఉగ్రవాదులను పట్టుకొనే క్రమంలో బుధవారం ప్రాణాలు కోల్పోయిన శునకం డీజిల్ స్థానాన్ని రష్యా కుక్కపిల్ల దోబ్రిన్యా భ ర్తీ చేయనుంది. ఫ్రాన్స్‌కు రెండు నెలల వయసున్న ఆల్ట్సేనియా కుక్కపిల్లను పంపడానికి రష్యా తన సంసిద్ధతను వెల్లడించింది. ఈమేరకు శనివారం రష్యా అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి ఫ్రాన్స్ మంత్రికి లేఖ రాశారు. ముద్దుముద్దుగా ఉన్న డోబ్రిన్యా పప్పి చిత్రాలు శుక్రవారం https://mvd.ru/news/item/6802710 వెబ్సైట్లో పెట్టింది. అంతేకాకుండా బంతితోఆడుతున్న వీడియోనూ పోస్ట్ చేసింది.