breaking news
dmk member
-
‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యధికులు స్టాలిన్ మాటలను వ్యతిరేకిస్తుంటే కొందరు మాత్రమే సమర్థిస్తున్నారు. తాజాగా డీఎంకే మరో మంత్రి ఏ రాజా.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఏ రాజా మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ సున్నిత మనస్కులు కాబట్టి సున్నితంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోల్చారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులకు సమాజంలో ఎలాంటి బెరుకు ఉండదని సనాతన ధర్మాన్ని సమాజాన్ని భయపెట్టే హెచ్ఐవి, కుష్టు వంటి వ్యాధులతో పోల్చాలని అన్నారు. సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన రెండు వేర్వేరు కాదని రెండూ ఒక్కటేనని అన్నారు. ఈ అంశంపై డిబేట్ పెడితే చర్చలకు పెరియార్, అంబేద్కర్ పుస్తకాలను వెంటబెట్టుకుని ఢిల్లీ వస్తానని అన్నారు. నాపై రివార్డులు కూడా ప్రకటించనీ నేనైతే భయపడేది లేదని అన్నారు. ఒకవేళ ప్రధాన మంత్రి చర్చలకు రమ్మన్నా వెళతాను.. అనుమతిస్తే కేంద్ర కేబినెట్ మంత్రులతో కూడా దీనిపై చర్చకు సిద్ధమని సనాతన ధర్మం అంటే ఏమిటో చెబుతానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘బాలకృష్ణలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా? -
తుపాకితో కాల్చుకుని.. మాజీ ఎంపీ ఆత్మహత్య
రాజ్యసభ మాజీ సభ్యుడు ఎన్. రాజేంద్రన్ కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోవిల్పట్టిలో జరిగింది. కోవిల్పట్టి బస్టాండుకు సమీపంలోని ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఆయన కారు కనిపించింది. కారు ముందుసీట్లు రెండూ రక్తసిక్తమై ఉన్నాయి. పక్కనే రివాల్వర్ కూడా దొరికింది. ఆ దారిలో వెళ్లేవాళ్లకు రక్తసిక్తమైన కారు కనిపించడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, అక్కడ కారు అద్దాలు పగలగొట్టి రాజేంద్రన్ మృతదేహాన్ని కోవిల్పట్టి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజేంద్రన్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆయనకు ఒక ఫంక్షన్ హాలు, బస్సు సర్వీసు వ్యాపారాలున్నాయి. అయితే, కొడుకు కారణంగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, దాంతో కోడలి ఇంట్లో గొడవలు జరిగాయని చెబుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఆయన ఆందోళనగా కనిపిస్తున్నారని, ఇంట్లో దీపావళి పండగ కూడా చేసుకోలేదని స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల సమయంలో తన అసిస్టెంట్ గణేశన్‌తో ఫోన్లో మాట్లాడారని, తాను ఒంటరిగా కారులో వెళ్తున్నట్లు చెప్పారని, కొద్దిసేపటికే విగతజీవిగా మారారని అంటున్నారు. రాజేంద్రన్‌ది కచ్చితంగా ఆత్మహత్యేనని, ఇందులో వేరే కోణాఉల ఏవీ లేవని జిల్లా ఎస్పీ అశ్విన్ కొ ట్నిస్ తెలిపారు. కణతమీద రివాల్వర్ పెట్టుకుని కాల్చుకున్నారని, దాంతో రివాల్వర్ ఎడమవైపు నుంచి బయటకు వచ్చిందని వివరించారు. రాజేంద్రన్‌కు ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు ఆయన వైద్యుడు చెప్పారు. అన్నాడీఎంకే తరఫున 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజేంద్రన్.. తర్వాత డీఎంకేలో చేరారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.