breaking news
Division fight
-
TS Election 2023: ఎన్నికలు సమీపిస్తుండగా.. డివిజన్ల పోరు!
మెదక్: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌లను రెవెన్యూ డివిజన్లు చేసి దుబ్బాకను డివిజన్ చేయకపోవడంతో సాధన సమితి నాయకులు పోరుబాట పట్టారు. రెవెన్యూ డివిజన్‌కు అన్ని విధాలుగా అర్హత ఉన్నప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో 2016లో దుబ్బాక పట్టణంలో 45 రోజుల పాటు ఉద్యమం తీవ్రంగా జరిగింది. జిల్లాల పునర్విభజన సమయంలో దుబ్బాక డివిజన్ ఆలోచన ఉన్నప్పటికీ చివరి నిమిషంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేట జిల్లా లో కలిపి హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేశారు. 6 మండలాలతో దుబ్బాక డివిజన్.. దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం 8 మండలాలు ఉన్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, భూంపల్లి–అక్బర్పేట మండలాలు సిద్దిపేట జిల్లా పరిధిలో, అలాగే.. చేగుంట, నార్సింగ్ మండలాలు మెదక్ జిల్లా పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి అక్బర్పేట మండలాలు సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో, దౌల్తాబాద్, రాయపోల్ మండలం గజ్వేల్ డివిజన్లో చేగుంట, నార్సింగ్ మండలాలు తూప్రాన్ డివిజన్లో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలోని మండలాలు రెండు జిల్లాల్లో మూడు డివిజన్లలో ఉండటంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన అక్బర్పేట–భూంపల్లి మండలాలను కలిపి ఆరు మండలాలతో దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని , అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉద్యమానాకి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ అంశం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు డివిజన్ సాధన సమితి నాయకులు యత్నిస్తున్నారు. -
ఆగని విభజన రగడ
నల్లగొండ: జిల్లాలు, మండలాల విభజన నేపథ్యంలో డిమాండ్ల సాధనకు పలు ప్రాంతాల్లో చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో కొత్తగా ఏర్పడిన మాడ్గులపల్లి మండలంలో కాకుండా పాత మండలమైన తిప్పర్తిలోనే కొనసాగించాలని కొత్తగూడెం గ్రామస్తులు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. గట్టుప్పల మండలాన్ని తుది జాబితా నుంచి తొలగించడంపై గ్రామస్తులు ఆందోళనలు ఉధృతం చేశారు. ఆత్మకూరు(ఎం) మండలం చాడ, ముత్తిరెడ్డిగూడెం గ్రామాలను మోటకొం డూరు మండలంలో కలపొద్దని ఆయా గ్రామస్తులు రాయిగిరి-మోత్కూరు మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. రామన్నపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దిలావర్పూర్, ఇక్కుర్తి గ్రామాలను కొత్తగా ఏర్పడే మోటకొండూర్‌లో కలపొద్దని ఆయా గ్రామస్తులు యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రామాయంపేటలో 48 గంటల బంద్ రామాయంపేట: రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మెదక్ జిల్లా రామాయంపేటలో ఉద్యమం తీవ్రస్థారుుకి చేరుకుంది. 48 గంటల బంద్‌లో భాగంగా గురువారం పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వందలాది మంది రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలు 44వ నంబర్ జాతీయ రహదారిపై అరగంటపాటు రాస్తారోకో చేశారు.