breaking news
diversion of traffic
-
జయహో బీసీ మహాసభ: ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ ప్లేస్ వివరాలు ఇవే..
సాక్షి, విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ నెల ఏడో తేదీన జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా సోమవారం తెలిపారు. నగరంలో వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బెంజిసర్కిల్ నుంచి బందరు రోడ్డులోకి, పోలీస్ కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్ వైపు, ఐదో నంబర్ రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి బందరు రోడ్డుకు జయహో బీసీ మహా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై.. - హైదరాబాద్–విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే వాహనాలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ ద్వారా రాకపోకలు సాగించాలి. - విశాఖపట్నం–చెన్నై మార్గంలో ప్రయాణించే వాహనాలు హనుమాన్‌జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గంలో ప్రయాణించాలి. - గుంటూరు–విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించాలి. - చెన్నై–హైదరాబాద్ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా ప్రయాణించాలి. విజయవాడలో ఇలా.. - విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు రామవరప్పాడు రింగ్, మహానాడు జంక్షన్, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్ మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు చేరుకోవాలి. - పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులు పీసీఆర్ జంక్షన్, ప్రకాశం విగ్రహం జంక్షన్, పాత గవర్నమెంట్ ఆస్పత్రి, ఏలూరు లాకులు, జీఎస్ రాజురోడ్డు, సీతన్నపేట సిగ్నల్, బీఆర్టీఎస్ రోడ్డు, గుణదల, రామవరప్పాడు మార్గంలో ప్రయాణించాలి. - మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాల నుంచి పీఎన్‌బీఎస్‌కు వచ్చే బస్సులు తాడిగడప 100 అడుగుల రోడ్డు, ఎనికేపాడు, రామవరప్పాడురింగ్, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్, కృష్ణలంక మార్గాన్ని అనుసరించాలి. - బస్టాండ్ నుంచి మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పీసీఆర్, చల్లపల్లి బంగ్లా, ఏలూరు లాకులు, బీఆర్టీఎస్రోడ్డు, గుణదల, రామవరప్పాడురింగ్, ఎనికేపాడు, తాడిగడప 100 అడుగుల రోడ్డును అనుసరించాలి. - బెంజిసర్కిల్ వైపు నుంచి బందరు రోడ్డులో ప్రయాణించే వాహనాలు పకీరుగూడెం జంక్షన్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్ మార్గం ద్వారా పీఎన్‌బీఎస్‌కు చేరుకోవాలి. - పీఎన్బీఎస్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే బస్సులు బస్టాండ్‌లో మధ్యనున్న ఐదో నంబర్ గేటు ద్వారా బయటకు వచ్చి రాజీవ్‌గాంధీ పార్కు, కనకదుర్గ ఫ్లై ఓవర్, స్వాతిజంక్షన్ మార్గాన్ని అనుసరించాలి. పార్కింగ్ ప్రదేశాలు ఇలా.. - మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల వాహనాలను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్లో నిలపాలి. - ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను స్వరాజ్య మైదానంలో పార్కు చేయాలి. - గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నంద్యాల జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులకు సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానం కేటాయించారు. - కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో నిలపాలి. - పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను బీఆర్టీఎస్ రోడ్డులో నిలపాలి. - శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే బస్సులకు ఆంధ్రా లయోల కాలేజీ మైదానాలను కేటాయించారు. -
2న నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ నెల 2న నిర్వహించనున్న నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపుతో పాటు అవతరణ దినోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే వాహనాల కోసం వేర్వేరు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో సోమవారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. 1. ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి బేగంపేట వైపు వెళ్లే వాహనాలను ఎస్పీ రోడ్డు మీదుగా అనుమతించరు. ప్యాట్నీ- ఆర్పీరోడ్, ఎస్డీ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు ప్యాట్నీ- ప్యారడైజ్ మీదుగా, జేబీఎస్ మార్గం నుంచి వచ్చే వాహనాలు స్వీకార్ ఉపకార్- టివోలీ- బాలంరాయి మీదుగా సీఈఓ వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. 2. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలు... బాలంరాయి- స్వీకార్ ఉపకార్- ఎస్బీహెచ్ మార్గంలో లేదా ప్యారడైజ్- ఎస్డీ రోడ్-ప్యాట్నీ- క్లాక్‌టవర్- సంగీత్ చౌరస్తా మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. 3. టివోలీ మార్గంలో వచ్చే వాహనాలు టివోలీ జంక్షన్ నుంచి బాలంరాయి- సీటీఓ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. టివోలీ నుంచి ప్లాజా జంక్షన్ మార్గంలో వాహనాలను అనుమతించరు. 4. పార్క్ లేన్ నుంచి ప్లాజా చౌరస్తాకు వెళ్లే వాహనాలు సైతం ప్యారడైజ్- ప్యాట్నీ మార్గాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. 5. వైఎంసీఏ, సీటీఓ ఫై ్ల ఓవర్లపై వాహనాల రాకపోకల్ని అనుమతించరు. 6. ఇక రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ రహదారిలో సాధారణ ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. ఈ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. పార్కింగ్ ఏర్పాట్లు ఇక్కడే.. 1. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఉప్పల్, తార్నాక నుంచి వచ్చే వాహనాల కోసం రైల్ నిలయం సమీపంలోని రైల్వే రిక్రియేషన్ క్లబ్ (ఆర్ఆర్సీ) ఆవరణలో, బేగంపేటలోని వెస్లీ కాలేజీలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. 2. నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎన్‌హెచ్-7 (మేడ్చల్ మార్గం), ఎన్‌హెచ్-9 (బాలానగర్ మార్గం) గుండా వచ్చే వాహనాలను కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్ సమీపంలోని దోబీఘాట్, బాలంరాయి చౌరస్తా వద్ద ఉన్న ఇసుక లారీల అడ్డా, టివోలీ సమీపంలోని మిలీనియం గార్డెన్, పెర్ల్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఈద్గా ప్రాంతాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. 3. కరీంనగర్, సిద్ధిపేట, చేర్యాల తదితర ప్రాంతాల నుంచి రాజీవ్ రహదారి గుండా వచ్చే వాహనాల కోసం కేజేఆర్ గార్డెన్ సమీపంలోని ఖాళీ ప్రదేశం, ఇంపీరియల్ గార్డెన్ ముందు ఖాళీ స్థలం, స్వీకార్-ఉపకార్ చౌరస్తా సమీపంలోని సెంటినరీ స్కూల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 4. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల గుండా వచ్చే వాహనాలను సికింద్రాబాద్ పీజీ కాలేజీ, బేగంపే ఎయిర్‌పోర్టు, ఎయిర్ కార్గో, హైదరాబాద్ ఉత్తర ప్రాంతం మల్కాజిగిరి, కుషాయిగూడ, అడ్డగుట్ట మార్గాల్లో వచ్చే వాహనాలను లాంబా రోడ్డులో పార్క్ చేయాల్సి ఉంటుంది.