5న అండర్–12 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
                  
	అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–12  జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ఈ నెల 5న అనంత క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. సెప్టెంబర్ 1, 2004 తరువాత పుట్టిన వారు, 7వ తరగతి లోపు చదువుతున్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి 15 వరకు వైఎస్సార్ కడప జిల్లాలో కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రీడా మైదానంలో జరిగే ఆంధ్ర సౌత్‌జోన్ అండర్–12 బాలుర అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ(ఫ్యూచర్ కప్)లో పాల్గొంటుందన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఒరిజినల్ కులధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలన్నారు.
	 
	మ్యాచుల వివరాలు
	10–02–2017     వైఎస్సార్ కడప -అనంతపురం
	10–02–2017     నెల్లూరు       - కర్నూలు
	11–02–2017     వైఎస్సార్ కడప -నెల్లూరు
	11–02–2017     చిత్తూరు       - వైఎస్సార్ కడప
	12–02–2017     కర్నూలు        - అనంతపురం
	12–02–2017     వైఎస్సార్ కడప - చిత్తూరు
	13–02–2017   =================
	14–02–2017     కర్నూలు      - చిత్తూరు
	14–02–2017     అనంతపురం    - నెల్లూరు
	15–02–2017     నెల్లూరు         -చిత్తూరు
	15–02–2017     వైఎస్సార్ కడప   - కర్నూలు