breaking news
discard
-
Viral video:పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!
Helicopter Made From Discarded Car Parts: చాలా మంది తాము జీవితంలో ఎప్పటికైన విమానంలో ప్రయాణించాలి అని అనుకుంటుంటారు. బాగా చదువుకుని మంచి స్థాయికి వచ్చినప్పుడో లేక బాగా డబ్బులు సంపాదించినప్పుడో విమానంలో ప్రయాణించడం చేస్తుంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి అందుకు భిన్నంగా తాను ఏవిధంగానైనా విమానంలో ప్రయాణించాలి, పైగా తనకొక ప్రత్యేక విమానం ఉండాలనే కోరికతో ఏం చేశాడో చూడండి!. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) మాములుగా పూర్తి స్థాయిలో విమానాన్ని తయారు చేయాలంటే చాలా ఎక్కువ పరికరాలు తోపాటు కాస్త ఖర్చుతో కూడిన పని. కానీ బ్రెజిల్‌లోని జోయో డయాస్ నగరానికి చెందిన విమానయన నిపుణుడు జెనెసిస్ గోమ్స్ కేవలం మోటార్‌సైకిళ్లు, ట్రక్కులు, కార్లు, సైకిళ్లకు సంబంధించిన విడిభాగాలతో విమానాన్ని తయారు చేశాడు. అంతేకాదు పాత వాహనాలను కొనుగోలు చేసే షాపు నుంచి ఈ విడిభాగాలను కొనుగోలు చేసి ఈ విమానాన్ని తయారు చేశాడు. అంతేకాదు గోమ్స్ పరైబా నగరంలో జరుగుతున్న ఏవియేషన్ ఈవెంట్ సందర్భంగా తాను తయారు చేసిన విమానంలో తన స్నేహితుడితో కలిసి ట్రైల్ నిర్వహించాడు. ఈ మేరకు ఈ విమానాన్ని చూసేందుకు జోయో డయాస్ నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తనకు విమానం ఎక్కే అవకాశం రాకపోడంతోనే తనకంటూ ఒక విమానం ఉండాలని నిర్ణయించుకునే ఈ విమానాన్ని రూపొందించానని చెప్పాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!) -
ఇక రైల్వే బడ్జెట్ కనుమరుగేనా!
న్యూఢిల్లీ: బ్రిటీష్ పరిపాలన కాలం నుంచి ఉన్న రైల్వే బడ్జెట్ ఇక కనుమరుగవనుందా! సాధరణ బడ్జెట్లో కలిపే రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడతారా? లేక వేరే ఏదైన కొత్త తరహా వ్యవస్థను తీసుకొస్తారా? ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్‌కు ఇక చరమ గీతం పాడుతున్నట్లేనే? ఇప్పుడు ఈ అనుమానాలు, ప్రశ్నలను నీతి ఆయోగ్ ప్యానెల్ తీసుకున్న ఓ కొత్త నిర్ణయం రేకెత్తిస్తోంది. ఆంగ్లేయుల పాలన కాలంలో నుంచి ఉన్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ విధానానికి ఇక స్వస్తి పలకాలని నీతి ఆయోగ్ ప్యానెల్ సభ్యుడు బిబేక్ దెబ్రే ప్రతిపాదించినట్లు సమాచారం. సాధారణ బడ్జెట్లోనే కలిపి రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశ పెట్టేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షుడిగా ఉన్న నీతి ఆయోగ్‌కు ప్రధాని మంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దెబ్రీ రైల్వే వ్యవస్థ మార్పులపై పలు ప్రతిపాదనలు చేస్తూ ఇందులోనే ప్రత్యేక రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టే విధానానికి స్వస్తి పలకాలని చెప్పినట్లు తెలుస్తోంది.