breaking news
disaster defeat
-
మారిన విధానం
భువనేశ్వర్: రాష్ట్రంలో కరువు అంచనాకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమలు జేస్తుంది. పంట కోతల ఆధారంగా కాకుండా వర్షపాతం కొరత ఆధారంగా కరువు ప్రభావాన్ని సమీక్షించి ఖరారు చేసేందుకు విభాగం నిర్ణయించినట్టు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి మహేశ్వర మహంతి ప్రకటించారు. ఆయన అధ్యక్షతన రాజధానిలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు పొంచి ఉన్నట్టు సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం ఆశాజనకంగా లేనందున ఈ పరిస్థితి తాండవిస్తుంది. వాతావరణ పరిస్థితుల విశ్లేషణ నేపథ్యంలో ఈ ఏడాది కరువు అనివార్యంగా భావిస్తున్నారు. కరువు కోరల నుంచి రైతు వర్గాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం కనబరుస్తుంది. ఏటా పంటల కోత ముగిసిన తర్వాత ఖరారు చేసిన నివేదిక ఆధారంగా కరువు ప్రభావిత పంట నష్టం ధ్రువీకరించడం మనుగడలో ఉంది. పంట నష్టం అనుపాతంలో పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ విధానానికి తెర దించి ఈ ఏడాది కొత్త విధానంలో రైతులకు పరిహారం చెల్లించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి ప్రకటించారు. పంటల కోత నివేదిక కోసం నిరీక్షించి కాలయాపన చేసేది లేదు. 50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో కరువు పొంచి ఉన్నట్టు ఖరారు చేసేందుకు విభాగం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్లో రుతుపవనాల ప్రభావంతో వరుసగా 3 వారాల సగటు వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తక్కువ నమోదైతే ఆ ప్రాంతాన్ని కరువు సంకట ప్రాంతంగా(డ్రై స్పెల్ ఏరియా) ప్రకటిస్తామని మంత్రి మహేశ్వర మహంతి ప్రకటించారు. పరిస్థితి సర్దుకుంటుంది రాష్ట్రంలో స్వల్ప వృష్టిపాతం పరిస్థితి క్రమంగా సర్దుకుంటుంది. వర్షపాతం లోటు అంచెలంచెలుగా భర్తీ అవుతుంది. ఇటీవల కురిసిన వర్షపాతం గణాంకాలు ఈ మేరకు సంకేతాలు జారీ చేస్తున్నాయి. లోగడ 103 సమితులు స్వల్ప వృష్టిపాతం కోరల్లో చిక్కుకున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఇటీవల వర్షపాతం మెరుగుపడడంతో ఈ స్వల్ప వృష్టి ప్రభావిత సమితుల సంఖ్య 96కి తగ్గినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి.ఈ నెల 22వ తేదీ(శుక్రవారం) నాటికి 73 సమితుల్లో 19 నుంచి 39 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదు అయింది. 22 సమితుల్లో 39 నుంచి 59 శాతం వరకు సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. ఒక సమితిలో మాత్రం సాధారణం కంటే 59 శాతం తక్కువగా వర్షం కురిసి ఆందోళన కలిగిస్తుంది. అరకొరగా కలెక్టర్ల స్పందన రాష్ట్రంలో కరువు ప్రభావం అంచనా వేసేందుకు క్షేత్రస్థాయి నివేదిక కోసం రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. పంచాయతీవారీగా వర్షపాతం నివేదికతో కరువు ప్రభావం అంచనాల్ని దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కేటా యించింది. శుక్రవారంతో ఈ గడువు ముగిసిన కలెక్టర్లు అరకొరగా స్పందించారు. విభాగం చేతికి సమగ్ర నివేదిక అందనట్లు విభాగం మంత్రి మహేశ్వర మహంతి తెలిపారు. తదుపరి సమావేశం అక్టోబర్ 10వ తేదీన నిర్వహించనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈలోగా వర్షపాతం తాజా ముఖచిత్రం కూడా స్పష్టం అయితే కరువు నేపథ్యంలో పంట నష్టం ఖరారు చేసేందుకు వీలవుతుందని మంత్రి ఆశాభాం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఎఫెక్ట్! ఇటీవల ముగిసిన అసెంబ్లీ వర్షా కాలం సమావేశాలు పురస్కరించుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిపట్ల విరుచుకుపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతో రైతాంగం విలవిలాడుతుంది. సకాలంలో నివేదిక దాఖలు కానందున పీడిత రైతాంగానికి సముచిత పరిహారం సకాలంలో లభించడం లేదు. ఈ పరిస్థితులు రైతు ఆత్మ హత్యల్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరి మారకుంటే వైపరీత్యం అనివార్యంగా దాడికి దిగాయి. మరో వైపు రాష్ట్ర కాంగ్రెసు వ్యవసాయ శాఖ ప్రతినిథి బృందం రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ డాక్టరు ఎస్.సి.జమీర్‌కు శుక్రవారం స్మారక ప్రతం సమర్పించింది. భారతీయ జనతా పార్టీ, అధికార పక్షం బిజూ జనతా దళ్ వర్గాల మధ్య బేదాభిప్రాయాల నడుమ రాష్ట్ర రైతాంగం నలిగిపోతుంది. పంట నష్టం పరిహారం చెల్లింపులో జాప్యం నివారించడం అనివార్యం. పంట నష్టం సంభవించిన ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా పరిగణించాలనే అభ్యర్థనతో గవర్నర్‌కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవసాయ శాఖ స్మారక ప్రతం అందజేసింది. నువాపడా, బొలంగీరు, బర్గడ్, సువర్ణపూర్, బౌధ్, ఢెంకనాల్ జిల్లాల్లో కరువు నివారించే పరిస్థితులే లేనట్టు ఈ ప్రతినిథి బృందం రాష్ట్ర గవర్నర్‌కు వివరించింది. -
కాంగ్రెస్‌వి ప్రతీకార రాజకీయాలు
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు - అందుకే పార్లమెంటును అడ్డుకుంటున్నారు.. - ఇదే తీరు కొనసాగితే.. భవిష్యత్తులో ఒక్క సీటూ గెలవలేరు - ప్రధాన విపక్షంపై ప్రధాని మోదీ ధ్వజం రుషీకేశ్/చండీగఢ్: పార్లమెంట్ కార్యక్రమాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో చవిచూసిన ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతూ దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్లడాన్ని అడ్డుకుంటోందన్నారు. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు వారిని ఘోరంగా ఓడించారు. అందుకు వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. పార్లమెంటును సాగనివ్వడం లేదు. దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు గమనించాలి. రానున్నరోజుల్లోనూ వారికి తగిన గుణపాఠం నేర్పించాలి’ అన్నారు. చండీగఢ్, రుషికేశ్‌లలో జరిగిన బహిరంగ సభల్లో శుక్రవారం మోదీ పాల్గొన్నారు. 40 మంది ఎంపీలు కుట్రపూరితంగా పార్లమెంట్లో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకుంటూ, ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారని మోదీ కాంగ్రెస్ ఎంపీలపై మండిపడ్డారు. వారు చేసేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ‘లోక్‌సభ పైన ప్రజా జనసభ ఉంటుంది. అందుకే నా అభిప్రాయాల్ని ఇక్కడ ఈ జనసభలో వ్యక్తం చేస్తున్నా’నన్నారు. ‘ప్రతికూల రాజకీయాలకు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడానికి తేడా ఉంది. ప్రతిపక్షంగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం మంచిదే. కానీ ప్రతీకారాత్మక రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ తేడాను కాంగ్రెస్ గుర్తించాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోవాలి’ అని హితవు చెప్పారు. గతంలో బీజేపీ కూడా రెండే స్థానాలు గెలుచుకున్న సందర్భముందని, అయితే, బీజేపీ ఏనాడు ఇలా ప్రతీకార రాజకీయాలకు పాల్పడలేదని, సమస్యలపై పోరాడి ప్రజల హృదయం గెలుచుకుందని అన్నారు. ‘ప్రతిపక్షంలో కూర్చోవడానికి వారు(కాంగ్రెస్) ఇంకా అలవాటు పడలేదు. బీజేపీ ఇలా సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారం మా కుటుంబ ఆస్తి. దాన్ని ఒక చాయ్‌వాలా.. ఒక పేదవాడి కొడుకు.. ఒక సామాన్యుడు మా నుంచి లాక్కోవడం ఏంటి..? అని వారు అసహనంతో ఉన్నారు. ఈ వైఖరి వారి పేదల వ్యతిరేక మనస్తత్వానికి అద్దం పడుతోంది’ అని కాంగ్రెస్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. గతంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా ఇప్పుడెక్కడా కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. చండీగఢ్ హౌసింగ్ బోర్డ్వారి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ.. 2022 నాటికి దేశంలోని నిరుపేదలకు కూడా గృహ వసతి కల్పించడం తన స్వప్నమన్నారు. ఈ సందర్భంగా ఒక మొబైల్ యాప్‌ను, వెబ్‌సైట్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇలాంటివాటి వల్ల సామాన్యులకు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లభిస్తుందన్నారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభం చండీగఢ్ విమానాశ్రయంలో అధునాతన టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ప్రజలకు, ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడ్తుందన్నారు. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌ల్లో ఈ విమానాశ్రయం ఎవరికి చెందుతుందన్న వివాదాన్ని ఆయన కొట్టేశారు.ఇథనాల్ ఉత్పత్తికి అనుమతి ..మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేసేందుకు త్వరలో పంజాబ్ రైతులకు కేంద్రం తరఫున అనుమతినిస్తామని మోదీ ప్రకటించారు. మొక్కజొన్న అధికంగా పండే పంజాబ్‌కు ఇది ఆర్థికంగా ఎంతో ఉపయోగకరమన్నారు. ములాయంపై మరోసారి ప్రశంసలు పార్లమెంటు కార్యకలాపాలను కాంగ్రెస్ అడ్డుకోవడాన్ని తప్పుబట్టడం ద్వారా.. ప్రతిపక్ష నేత అయినప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సాధ్యమైనంత కృషి చేశారం’టూ సమాజ్‌వాదీ నేత ములాయంపై మోదీ మళ్లీ ప్రశంసలు గుప్పించారు. యూపీలో జరిగిన ఒక సభలో శుక్రవారం ప్రధాని పాల్గొన్నారు. ఇబ్బంది కలిగించాను.. సారీ! నగరంలో శుక్రవారం ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా జన జీవనం అస్తవ్యస్తం అయింది. ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసేయించారు. చనిపోయిన తమవారిని ఖననం చేసేందుకు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మోదీ.. తన పర్యటనతో నగర ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ ట్విటర్లో క్షమాపణలు కోరారు. దీనిపై విచారణ జరపాలని స్థానిక అధికారులను ఆదేశించారు.