-
పాన్ వరల్డ్ మేనియాకి సీక్వెల్ ప్రాణం పోస్తుందా..?
-
యువతరాన్ని ప్రతిబింబించే కథతో తిక్క తీశా!
సునీల్‌రెడ్డి సినిమా జర్నీ డీవోపీ (కెమేరామ్యాన్)గా మొదలైంది. ‘ఒకరికొకరు’తో ఆయన కెమెరాలో ఎంత బలముందో చూపించాడు. ఆ తర్వాత ఆయన మనసు దర్శకత్వంపైకి మళ్లింది. కళ్యాణ్‌రామ్‌తో ‘ఓం’ త్రీడీ సినిమాని తెరకెక్కించాడు. మరోసారి టెక్నికల్‌గా తానెంత స్ట్రాంగో ఆ సినిమాతో చాటి చెప్పాడు సునీల్‌రెడ్డి. కాస్త గ్యాప్ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో తిక్క తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి.రోహిన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శనివారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు సునీల్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు... అర్బన్ బేస్డ్ కామెడీ కథతో తెరకెక్కించిన చిత్రమే ‘తిక్క’. పేరులో ఉన్న మూడ్ తెరపై కూడా కనిపిస్తుంటుంది. బ్రేకప్ అయిన కుర్రాడి జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. నేటి యువతరాన్ని ప్రతిబింబించే ఈ కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. టైటిల్ కాస్త నెగిటివ్‌గా అనిపించినా కథకు తగ్గట్టుగా ఉందని అదే ఓకే చేశాం. ప్రతి సన్నివేశం కామెడీగా సాగుతుంది. సినిమా చూసినవాళ్లంతా బాగుందని మెచ్చుకొంటున్నారు. ముఖ్యంగా కామెడీ బాగా పండింది అంటున్నారు. పంచులు, ప్రాసలు కాకుండా కేవలం సన్నివేశాలతోనే వినోదాన్ని పండించే ప్రయత్నం చేసాం. అది ఫలించినందుకు ఆనందంగా ఉంది. అలాగే సాయిధరమ్ తేజ్ నటనలో ఓ కొత్త యాంగిల్‌ని చూపించారని చెబుతున్నారు. తమన్ , గుహన్ లాంటి సాంకేతిక బృందం ఈ సినిమాకి పనిచేసింది. రోహిన్ రెడ్డి నిర్మాణం పరంగా ఎక్కడా రాజీపడలేదు. అందుకే ఓ మంచి క్వాలిటీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగాం. నో కన్ఫ్యూజన్ నేనొక డీవోపీగానే ప్రయాణం మొదలు పెట్టినా దర్శకుణ్ణి కావాలనే కోరిక మొదట్నుంచీ ఉంది. అమెరికాలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకొన్నా. డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పరిధి పరిమితం అనేది నా భావన. ఏం చేయాలన్నా వేరొకరి ఆలోచనలకి తగ్గట్టుగానే చేయాల్సి ఉంటుంది. మనదైన అభిరుచికి తగ్గట్టుగా, మనదైన కోణంలో చేయాలను కొన్నది ఏదీ చేయలేం. అందుకే నా దృష్టి దర్శకత్వంవైపు మళ్లింది. ‘ఓం’ త్రీడీ అనుకొన్న ఫలితాన్నివ్వలేకపోయింది. నా అసలు ప్రతిభ ఏంటన్నది ‘తిక్క’లోనే కనిపిస్తుంది. ఒక డీవోపీగా నాకు టెక్నాలజీ పైన కూడా అవగాహన ఉంటుంది కాబట్టి అది దర్శకుడిగా నాకు చాలా సాయం చేస్తుంటుంది. ఏం చేస్తే ఎలాంటి ఔట్పుట్ వస్తుందో ముందుగానే తెలుస్తుంటుంది. ‘తిక్క’ విషయంలో ఎక్కడా ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా పనిచేశాం. రాజీపడను: ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేయడమే నాకు అలవాటు. చిత్రీకరణకి వెళ్లడానికి ఆర్నెల్ల ముందుగానే స్క్రిప్టుని నా టెక్నీషియన్లకి అందజేశాను. దానివల్ల అందరూ ఓ అవగాహనకొస్తుంటారు. అలాగే కొన్ని విషయాల్లో చాలా మొండిగా ఉంటా. అనుకొన్నది వచ్చేవరకు రాజీపడను. ‘తిక్క’లోని ఐదు పాటల కోసం తమన్ తో 50 బాణీలు సిద్ధం చేయించా. కథని క్యారీ చేసేలా బాణీ కుదరాలనే ఆ ప్రయత్నం. టీమంతా అలా పనిచేశాం కాబట్టే ఓ మంచి ఔట్పుట్ బయటికొచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement