breaking news
Dimensions
-
'ముందు అమలు చేసి, తర్వాత ఆలోచించండి': బీజేపీ నేత
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి చెందిన వరుణ్ గాంధీ కేంద్రం వైఖరిపై విరుచుకుపడ్డారు. ఈ పథకాన్ని పరిగణలోనికి తీసుకునే ముందే వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకులేదంటూ ఆరోపణలు చేశారు ఎటువంటి ముందుచూపు లేకుండా కొత్త పథకాన్ని తీసుకు వచ్చేసి...వ్వతిరేకత మొదలయ్యాక మళ్లీ పునరాలోచించడం వంటివి కొన్ని సున్నితమైన అంశాల్లో పనికి రాదంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు. సాయుధ బలగాలు, భద్రతకు సంబంధించి యువత విషయానికి వస్తే...సాయుధ దళాల్లోని యువకులకు సైనికులుగా స్వల్పకాలిక ఉపాధి కల్పించడమే ఈ పథకంలో తీసుకొచ్చిన సరికొత్త మార్పు అని చెప్పారు. ఐతే ఈ పథకం ద్వారా ముఖ్యంగా 75 శాతం మందినే రిక్రూట్ చేసుకుంటారని చెప్పారు.. పైగా నాలుగేళ్లు మాత్రమే పనిచేస్తారని, ఆ తర్వత సాధారణ సైనికుల మాదిరి ఎటువంటి ప్రయోజనాలను పొందలేరని తెలిపారు. దీంతో యువత ఆందోళనలు చేపట్టిందన్నారు. ఐతే యువత చేస్తున్న ఆందోళనలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగానే నిరసనలు హింసాత్మకంగా మారాయన్నారు. 'अग्निपथ योजना' को लाने के बाद महज कुछ घंटे के भीतर इसमें किए गए संशोधन यह दर्शाते हैं कि संभवतः योजना बनाते समय सभी बिंदुओं को ध्यान में नहीं रखा गया। जब देश की सेना, सुरक्षा और युवाओं के भविष्य का सवाल हो तो ‘पहले प्रहार फिर विचार’ करना एक संवेदनशील सरकार के लिए उचित नहीं। — Varun Gandhi (@varungandhi80) June 18, 2022 (చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య, రక్షణ శాఖ కూడా 10 శాతం రిజర్వేషన్) -
యాక్టింగ్‌లో మేటి.. యాసలో ఒకటే!
వెబ్‌డెస్క్: ఏరంగంలోనైనా పురుషులతో సమానంగా మహిళలు రాణించాలంటే అదనపు నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాల్సిందే. అలా తమదైన సొంత ప్రతిభతో పురుషులకు ధీటుగా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా సినీరంగంలో,అందులోనూ హాస్య పాత్రల్లో రాణించడమంటే కత్తిమీదే సామే. అలాంటి వారిలో అలనాటి సూర్యకాంతం, ఛాయాదేవి మొదలు, రమాప్రభ, శ్రీలక్ష్మి, 90ల దశకం నాటి తెలంగాణా శకుంతల, ఇంకా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న కోవై సరళ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పరభాషా నటి అయినా తెలుగులో అద్భుతంగా రాణించిన కోవై సరళ, ‘తెలంగాణా’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న తెలంగాణ శకుంతల మధ్య ఉన్న వివిధ సారూప్యతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణా శకుంతల, కోవై సరళ ఇద్దరూ తెలుగు తమిళ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్టులుగా రాణించారు. తెలుగు సినీరంగంలో వీరిద్దరి మధ్యా ఉన్న సారూప్యత కేవలం హాస్యాన్ని పండించడం ఒక్కటే కాదు. అద్భుతమైన నటన, విలక్షణమైన భాషతో వీరు తెరపైగా కనిపించిగానే థియేటర్లలో నవ్వులు పూయాల్సిందే. సీటీలు మారు మోగాల్సిందే. నటనా శైలి, భాష, యాస, పంచ్ డైలాగులు వీరికి తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అపహాస్యం, అసభ్యత లేని కామెడీ వీరి సొంతం.కుటుంబంలో ఆడపిల్లగా కుటుంబ బాధ్యత తనపై వేసుకుని నిబద్దతతో కుటుంబాన్నిపైకి తీసుకు రావడం మరో సారూప్యత. కడియాల శంకుతల (తెలంగాణా శకుంతల) మహారాష్ట్రలో పుట్టి పెరిగిన కడియాల శంకుతల 250కి పైగా చిత్రాల్లో నటనతో అజరామరంగా నిలిచిపోయారు. ముఖ్యంగా టాలీవుడ్లో తెలంగాణ యాస, రాయలసీమ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒంటి కాలిపరుగుతో రంగస్థల నటిగా తన నటనాప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ఆ తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిరు. అది మొదలు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఒకదశలో తన కోసమే పాత్రలను సృష్టించే స్థాయికి ఎదిగిన గొప్ప నటి ఆమె. రవీంద్ర భారతిలో ప్రదర్శించిన నాటకం ద్వారా నటన మొదలు పెట్టిన ఆమె చాలా నాటకాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆ తరువాత. గౌతమ్ ఘోస్ దర్శకత్వం వహించిన 1979 నాటి చిత్రం ‘మా భూమి’ ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ ‘నీ తల్లి..ఇంకోపాలి నా ఇలాకలో..’ డైలాగ్‌తో పాపులర్ అయిన ఆమె ఆ తరువాత ఎన్నో పంచ్ డైలాగులతో ప్రేక్షకుల మెప్పుపొందారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’లోని ఆమె నటన, ఆమె పలికన తీరు, నోట్లో లావుపాటి చుట్టతో ఆమె ఆహార్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అంతేనా లక్ష్మి సినిమాలో, మరో హాస్యనటుడు వేణు మాధవ్‌తో కలిసి నటించిన కామెడీ సీన్ గుర్తొస్తే పగలబడి నవ్వాల్సిందే. ‘‘తమ్మీ పైసలు దెస్తివా..మరి ఏమే.. పోవే.. శక్కూ.. అంటివి గదరా’‘ లాంటి ఎన్నో విలక్షణ డైలాగులతో శకుంతల ఎంతో ప్రాచుర్యం పొందారు. పెళ్లాంతో పనేంటి సినిమాలో కొండవలసకు జోడిగా ఆమె అమాయకపు నటన, ఆ తరువాత చూపించిన నట విశ్వరూపం, ఒరిజినల్ కారెక్టర్‌ను ప్రదర్శించిన తీరు అద్భుతం. అలాగే దివంగత దర్శకుడు దాసరి నారాయణ దర్శకత్వంలోవచ్చిన చిత్రం ఒసేయ్ రాములమ్మతోపాటు, కొమురం భీం, ఎర్ర సైన్యం లాంటి చిత్రాలు ఆమె కరియర్లో భాగం. అంతేకాదు పురుషులతో పోటీ పడి మరీ విలనిజాన్ని పండించిన ఘనత శకుంతల సొంతం. కుక్క సినిమాలో నటనకు నంది అవార్డును సొంతం చేసుకున్నారు. భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు, కష్టపడే మనస్తత్వంతోనే మహిళలు రాణిస్తారని నమ్మి ఆచరించిన ధీర మహిళ శకుంతల. రవి తేజ నటించిన వీడే మూవీలో ఆమె ఒక పాట పాడటం విశేషం. ‘‘భయం అనేదే నాకు తెలియదు..అమ్మకు నేనే అబ్బాయిని. నన్ను మగరాయుడిలా పెంచారు..నలుగురి అక్క చెలెళ్లకు నేను అన్న..నేనే తమ్ముడిని. డేరింగ్ అండ్ డేషింగ్ మహిళను’’ అని స్వయంగా శకుంతలగారే చెప్పుకున్నారు. తండ్రి చనిపోవడంతో నటననే వృత్తిగా ఎంచుకుని కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లి చేసిన తరువాత మాత్రమే ఆమె పెళ్లి చేసుకున్నారు. రెండుసార్లు భయంకరమైన యాక్సిడెంట్లు, రెండుకాళ్లు విరిగిపోయినా మృత్యుంజయురాలై, ఫీనిక్స్ పక్షిలా పడిలేచిన కెరటం శకుంతల. కానీ 2014, జూన్ 14న తీవ్ర గుండెపోటుతో కన్నుమూయడం విషాదం. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జన్మించిన కోవై సరళ తమిళం తెలుగు భాషల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. రెంటిలోనూ ఇప్పటి దాకా సుమారు 750 సినిమాల్లో నటించారు. కామెడీనీ పండించడంలో ఈమెకు ఈమే సాటి. ముఖ్యంగా కమల్ హాసన్‌కు జోడీగా ‘సతీ లీలావతి’, స్టైలిష్‌స్టార్ అర్జున్ నటించిన దేశముదురుమూవీలో కోవై సరళ నటనను ఎలా మర్చిపోతాం. అంతేకాదు బ్రహ్మానందానికి తోడుగా తిరుమల తిరుపతి వెంకటేశా, 2002లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా సందడే సందడి మూవీలో ఆమె చేసిన కామెడీ హైలెట్‌గా చెప్పొచ్చు. అలాగే లారెన్స్ మూవీ కాంచనలో కోవై సరళ అమాయక నటనకు జేజేలు చెప్పాల్సిందే. నాగార్జున నుంచి మొదలు ఈ తరం యంగ్ హీరోలు అందరి సినిమాల్లోను ఆమె నటించారు. ముఖ్యంగా కిక్-2 , గ్రీకు వీరుడు, హీరో, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ఎలా చెప్పను, శ్రీరామచంద్రులు, ఎంత బావుందో!, ఫూల్స్ , అక్కా బావెక్కడ సినిమాల్లోని పాత్రలతో తనదైన శైలితో ఆకట్టుకున్నారు. పదినేళ్ల వయసులోనే కేఆర్ విజయ సరసన వెల్లి రథం అనే తమిళ సినిమాలో నటించారు. ముంధనై ముడిచ్చు అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగాను, మరో రెండు సంవత్సరాల తరువాత చిన్నవీడు అనే సినిమాలో భాగ్యరాజా పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించిన మెప్పించిన ఘనత ఆమె సొంతం. కోవై సరళ కుటుంబ బాధ్యతల నిమిత్తం అవివాహితగానే మిగిలిపోయారు. నలుగురు అక్కచెల్లెళ్లున్న కుటుంబంలో పెద్ద కుమార్తె సరళ. వారి చదువు సంధ్యా వివాహాల సందడిలో పడి పెళ్లి అన్న మాటనే మర్చిపోయారామె. తనకు ఒంటరిగా ఉండడం ఇష్టమని, అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని ఒక సందర్భంగా ఆమె చెప్పుకున్నారు. ఓరి నీప్రేమ బంగారం కానూ (2003) సినిమాకు ఉత్తమ హాస్యనటి నంది పురస్కారాన్ని, తమిళనాడు ప్రభుత్వం నుంచి మూడుసార్లు ఉత్తమ హాస్యనటి అవార్డును సొంతం చేసుకున్నారు. తరతరాలకి ఎవర్గ్రీన్ కామెడీ క్వీన్ కోవై సరళ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఏమిటీ త్రీడీ ప్రింటింగ్..?
వస్తువులను త్రిమితీయ రూపం(త్రీ డైమన్షనల్)లో ముద్రించడమే 3డీ ప్రింటింగ్. మామూలుగా కాగితంపై అక్షరాలను ముద్రిస్తే.. వాటికి పొడవు, వెడల్పు అనే రెండు డైమన్షన్స్ మాత్రమే ఉంటాయి. వాటికి ఎత్తును కూడా జోడిస్తే.. అదే త్రిమితీయ రూపం. ఉదాహరణకు.. మనకు కావలసిన కీచైన్లు, బొమ్మలు, సెల్‌ఫోన్ కేస్లు, పెన్నులు ఒకటేమిటి.. ఏ వస్తువునైనా 3డీ ప్రింటర్ ద్వారా ముద్రించుకోవచ్చు. ముందుగా కంప్యూటర్లో త్రీడీ బొమ్మను డిజైన్ చేసుకుని లేదా ఎంపిక చేసుకుని.. ప్రింటర్లో ముడిపదార్థం పోసి బటన్ నొక్కితే చాలు.. ఆటోమేటిక్‌గా ముడిపదార్థాన్ని కరిగించి ప్రింటర్ పొరలుపొరలుగా పోస్తూ 3డీ రూపంలో వస్తువులను ముద్రిస్తుంది! విప్లవాత్మకమైన ఈ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది. -
కొలతలే వేరు
ప్రపంచంలో పుణ్యాత్ములకు కొదువలేదు కానీ నైపుణ్యాలకు మాత్రం కొదువే. మా ఊళ్లో ఒక టైలరుండేవాడు. ఆయన కొలతలే వేరుగా ఉండేవి. షర్ట్‌ని జాకెట్లా, ప్యాంట్‌ని నిక్కర్‌లా కుట్టేవాడు. డాక్టర్ స్టెతస్కోప్ మెడలో వేసుకున్నట్టు, టేప్‌ని మెడలో నాగుపాములా అటూ ఇటూ తిప్పేవాడు. కొలతలు తీసుకునేటప్పుడు కితకితలు పెట్టేవాడు. ప్రతిదీ లెక్కప్రకారం ఉండాలనేది ఆయన వాదన. కానీ లెక్కలు తప్పేవి. లోకంలో ఎవడి లెక్కలు వాడికుంటాయి. అవి మనకు మ్యాచ్ కాకపోతేనే ప్రాబ్లమ్. ఆ టైలర్కెంత ఆత్మవిశ్వాసమంటే తాను బొంబాయిలో ఉండాల్సినవాడినని (అప్పటికింకా బొంబాయే) బతికున్నంత కాలం నమ్మాడు. మనమెన్నడూ చూడనివాడికి పీకని అప్పగించడం ఒక్క బార్బర్ షాప్‌లోనే జరుగుతుంది. ఈ మధ్య ఒక షాపుకెళితే ఒక కుర్రాడు టీవీలోని సినిమా చూస్తూ నావైపు చూడకుండానే నా భుజానికి ఒక టవల్ కప్పాడు. టీవీని చూస్తూనే నా గడ్డాన్ని నిమిరాడు. మొక్కలకు నీళ్లు చిలకరించినట్టు ముఖానికి నీళ్లు కొట్టాడు. నేను తేరుకుని... వచ్చింది షేవింగ్‌కి కాదు, కటింగ్కని చెప్పాను. టీవీలో జోక్‌కి కిలకిల నవ్వుతూ, చేతినిండా నురగ తీసుకుని రెండు చెంపలూ టపా టపా వాయించాడు. నోరు తెరిచేలాగా పీకకి కత్తిపెట్టాడు. నోరు మూసుకున్నాను, కళ్లు మూసుకోడానికి భయమేసింది. స్క్రీన్‌పై బ్రహ్మానందం రాగానే గట్టిగా నవ్వుతూ కత్తిని పీకకి అదిమిపెట్టాడు. పీక నుంచి కత్తిని తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉండగా కరెంట్ పోయింది. అప్పుడు కుర్చీలో ఒక శాల్తీ ఉందని అతను గ్రహించి గడ్డాన్ని చదును చేస్తూ ఉండగా కరెంట్ వచ్చింది. చివరికి రక్తపు చారికలతో ఎలాగోలా బయటపడ్డాను. అప్పటినుంచి టీవీలు ఉన్న షాపులకు దూరంగా ఉంటూ, టీవీ లేని షాపుకి వెళ్లాను. అక్కడున్న ఆసామి శాలువాలాగా నాకో తెల్లటి వస్త్రాన్ని ఒళ్లంతా కప్పి చేతికి కత్తెర తీసుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. అవతలివాడితో గట్టిగా అరుస్తూ భరతనాట్యం, కూచిపూడి ఆడుతూ చివరికి ఏదో హరికథ చెప్పి వందన సమర్పణ చేస్తూనే కత్తెర టకటకలాడించాడు. క్రాఫు కాస్తా గుండైంది. తన నైపుణ్యాన్ని వెనుకాల ఒక అద్దం ద్వారా చూపించాడు. ఈ మధ్య స్కానింగ్ కోసం నెట్ సెంటర్కెళితే అక్కడున్న అమ్మాయి నా కాగితాలపై అనేక ప్రయోగాలు చేసి చివరికి తనకు స్కానింగ్ రాదని చెప్పింది. టికెట్ రిజర్వేషన్ కోసం వెళితే ఫేస్బుక్లో మునిగితేలుతున్న ఆ కుర్రాడు చెన్నైకి బుక్ చేశాడు. వాడిని ఫోన్లో నుంచి బయటకు లాగి నేను వెళ్లాల్సింది బెంగళూరుకని చెప్పేసరికి తాతలు దిగొచ్చారు. మా బంధువుకి ఆరోగ్యం బాగాలేక బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పిస్తే గ్లూకోమీటర్ ద్వారా షుగర్ పరీక్ష చేయడానికి అక్కడున్న నర్సుకి చేతకాక మూడు నాలుగుసార్లు రక్తాన్ని కళ్లజూసింది. మనకు మనుషులకు కొదువలేదు కానీ అందులో పనిమంతులెందరు అన్నదే ప్రశ్న. అరకొరగా పని తెలిసినవాళ్లు రోగ నిర్ధారణ కేంద్రాల్లో ఎందరికి ఎన్ని అనవసర జబ్బులు తెచ్చిపెడుతున్నారో డాక్టర్లకే ఎరుక.మనమెంత జాగ్రత్తగా ఉన్నా ఈ బ్యాడ్ ఎక్స్‌పర్ట్‌లు మనకు తగులుతూనే ఉంటారు. ఇది పుణ్యభూమి కానీ నిపుణుల భూమి కాదు. - జి.ఆర్.మహర్షి