breaking news
diamond mines
-
అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!
తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని ఇది. భూమ్మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్ పేరిట గనిని ప్రారంభించింది. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది. తర్వాత కొన్నాళ్లు ఇది మూతబడింది. ఇది రష్యన్ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల (రెండువేల కిలోలు) వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది. -
ఈ మొక్క కనిపిస్తే పంట పండినట్లే!
నక్క తోక తొక్కితే లక్కు వస్తుందో లేదో తెలియదు గానీ.. ఈ మొక్కను చూస్తే మాత్రం కచ్చితంగా పంట పండుతుంది. ఎందుకంటే.. అతి విలువైన వజ్రాల గనులున్న ప్రాంతాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది మరి! ‘పాండనస్ కాండెల బ్రమ్’ అనే ఈ మొక్కను ఆఫ్రికన్ దేశం లైబీ రియాలో కనుగొన్నారు. సాధారణంగా ఎక్కడ కింబర్లైట్ శిలలు ఉంటాయో అక్కడ వజ్రాలు దొరుకుతాయి. అయితే, ఎక్కడ ఈ మొక్క కనిపిస్తుందో అక్కడ కింబర్లైట్ శిలలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం కింబర్లైట్ శిలల కోసం వెతికి, అవి ఉన్న చోటే వజ్రాల వేట మొదలుపెడుతుంటారు. ఇకపై ఈ మొక్కను వెతికి పట్టుకుంటే చాలు.. వజ్రాల గనులు దొరికినట్లేనని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ వర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ హ్యాగర్టీ అంటున్నారు. భూ ఉపరితలం కింద ఉండే మాంటిల్ పొర నుంచి లావా ఎగజిమ్మినప్పుడు దానితో పాటు వజ్రాలు పైకి వస్తుంటాయని అంచనా. లావా ఎగజిమ్మినప్పుడు ఉపరితలంలో వందల మీటర్ల మేరకు లావా(కింబర్లైట్) గొట్టా లు ఏర్పడుతుం టాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా 6 వేల కిం బర్ లైట్ గొట్టాలుండగా, వాటిలో సుమారు 60 గొట్టాల్లోనే విలువైన వజ్రాలు ఉండవచ్చని, అందువల్ల దట్టమైన అడవుల్లో ప్రయాస పడటం కంటే ఏరియల్ సర్వే ద్వారా ఈ మొక్క ను వెతికితే చాలని హ్యాగర్టీ చెబుతున్నారు.