breaking news
Diageo brands
-
ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..
ప్రపంచంలోని అతిపెద్ద స్పిరిట్స్ తయారీదారు డియాజియో (Diageo) కంపెనీకి త్వరలో ఒక మహిళ నాయకత్వం వహించనుంది. ఈమె పేరు 'డెబ్రా క్రూ'. ఏప్రిల్ 01 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవి నుంచి CEOగా పదోన్నతి కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. జానీ వాకర్ స్కాచ్ విస్కీ, గిన్నిస్, బెయిలీస్ వంటి ప్రముఖ బ్రాండ్లను తయారు చేసే కంపెనీకి సర్ ఇవాన్ మెనెజెస్ గత పది సంవత్సరాల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా స్థానంలో కొనసాగారు. అయితే ఈ పదవికి త్వరలోనే ఒక కొత్త బాస్ రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా డియాజియో 28,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు సమాచారం. డియాజియో కంపెనీ 180 కంటే ఎక్కువ మార్కెట్లలో 200 కంటే ఎక్కువ బ్రాండ్లను విక్రయిస్తోంది. ఇందులో స్కాచ్, కెనడియన్ విస్కీ, వోడ్కా, జిన్, రమ్, లిక్కర్స్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద అమ్మకాల పరంగా ఇది అతి పెద్ద కంపెనీ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు UKలోని టాప్ 100 లిస్టెడ్ కంపెనీలలో ఎనిమిది మంది మాత్రమే మహిళా సీఈఓలు ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు డెబ్రా క్రూ కూడా చేరనుంది. (ఇదీ చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు) 1970 డిసెంబర్ 20న జన్మించిన 'క్రూ' కొలరాడో యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ & చికాగో విశ్వవిద్యాలయం బూత్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి MBA పూర్తి చేసి.. పెప్సీ, క్రాఫ్ట్ ఫుడ్స్, నెస్లే, మార్స్ వంటి సంస్థల్లో పనిచేసింది. ఆ తరువాత పొగాకు సంస్థ రేనాల్డ్స్ అమెరికన్‌కు నాయకత్వం వహించింది. 2019లో డియాజియో కంపెనీలో అడుగుపెట్టిన డెబ్రా క్రూ 2022 అక్టోబర్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్థానం పొందింది. ఆ తరువాత 2020లో డియాజియో అతిపెద్ద మార్కెట్ అయిన ఉత్తర అమెరికా వ్యాపారానికి నాయకత్వం వహించింది. కాగా ఇప్పుడు ఆ కంపెనీకి త్వరలోనే సీఈఓ పగ్గాలను చేతపట్టనుంది. -
ప్రపంచ టాప్ బ్రాండ్లలో ‘టాటా’ ల్యాండ్‌రోవర్
భారత్ కంపెనీకి చెందిన ఏకైక బ్రాండ్ లండన్: ప్రపంచంలో అత్యంత విలువైన 100 బ్రాండ్లలో టాటా గ్రూప్‌నకు చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ కార్ల బ్రాండ్ ల్యాండ్ రోవర్ చోటు దక్కించుకుంది. టాప్-100లో భారత్ కంపెనీకి చెందిన ఏకైక బ్రాండ్ ఇదే కావడం గమనార్హం. ఇంటర్‌బ్రాండ్ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొం దించిన 2014 వార్షిక జాబితాలో ల్యాండ్ రోవర్ 4.47 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 91వ స్థానంలో నిలిచింది. కాగా, ప్రపంచ టాప్ బ్రాండ్‌గా యాపిల్ తన స్థానాన్ని నిలుపుకుంది. దీని బ్రాండ్ విలువ 119 బిలియన్ డాలర్లుగా అంచనా. 107 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో గూగుల్ రెండో స్థానంలో ఉంది. భారత్‌కు చెందిన సీఈఓల సారథ్యంలోని 6 కంపెనీలు/బ్రాండ్లు జాబితాలో ఉన్నాయి. సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 5వ ర్యాంకు(61 బిలియన్ డాలర్లు)లో ఉంది. ఇంద్రా నూయి సీఈఓగా ఉన్న పెప్సికో(24వ స్థానం-19 బిలి యన్ డాలర్లు), శాంతను నారాయణ్ సీఈఓ గా ఉన్న అడోబ్(77వ స్థానం-5.3 బిలియన్ డాల ర్లు), అజయ్ బంగా సారథ్యంలోని మాస్టర్ కార్డ్(88వ స్థానం-4.7 బిలియన్ డాలర్లు) దీనిలో ఉన్నాయి. ఇవాన్ మెనెజెస్ సీఈఓగా ఉన్న డియాజియో బ్రాండ్లు స్మిర్నాఫ్(34 ర్యాంకు-13 బిలియన్ డాలర్లు), జానీ వాకర్(86 ర్యాంకు-4.8 బిలియన్ డాలర్లు) కూడా జాబితాలో ఉన్నాయి.