breaking news
Devnarayan Patel
-
జగ్దల్పూర్ ఎస్పీ ఆత్మహత్య
చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) దేవ్‌నారాయణ్ పటేల్ (40) మంగళవారం తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి ముందు భార్య, ఇద్దరు పిల్లలపై కూడా ఆయన కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భార్య, భర్త మృతిచెందగా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. తనను సస్పెండ్ చేశారనే మానసిక వేదనతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఎస్పీ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. వివరాలు.. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రెండు రోజుల కిందట ఎస్సీ దేవ్‌నారాయణ్, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి టోపోల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో జడ్జి టోపోపై ఎస్పీ చేయి చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి సోమవారం ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. తనపై సస్పెన్షన్ వేటు పడడాన్ని జీర్ణించుకోలేని దేవ్‌నారాయణ్ సర్వీసు రివాల్వర్‌తో భార్య ప్రతిమా పటేల్, కూతురు పూనమ్(11), కుమారుడు ఆయుష్(6)లను కాల్చి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు భార్య ప్రతిమ అక్కడికక్కడే మృతిచెందారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చికిత్స నిమిత్తం రాయ్‌పూర్ తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన ఎస్పీ దేవ్‌నారాయణ్ ఇంట్లో పోలీసులు మంగళవారం ఓ సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఉదంతంపై ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. -
'కుటుంబంపై కాల్పులు జరిపి...తానూ ఆత్మహత్య'
-
'కుటుంబంపై కాల్పులు జరిపి...తానూ ఆత్మహత్య'
ఛత్తీస్‌గఢ్ : కుటుంబసభ్యులపై కాల్పులు జరిపి అనంతరం ఓ పోలీసు ఉన్నత అధికారి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈరోజు తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన జగదల్పూర్ ఎస్పీ దేవ్ నారాయణ్ పాటిల్ కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపి ఆ తర్వాత తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ సంఘటనలో ఎస్పీ, ఆయన భార్య ప్రతిమా మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ఆర్యన్ (6), పూజ (11) ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ చిన్నారులు రాయ్‌పూర్‌లోని రామకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న విధులు నుంచి సస్పెండ్ కావటంతో మనస్తాపం చెందిన దేవ్ నారాయణ ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి లేఖ లభించలేదని బస్తర్ రేంజ్ ఐజీ అరుణ్ దేవ్ గౌతమ్ తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరుతామని ఆయన పేర్కొన్నారు.