breaking news
dependent job
-
వారసత్వ ఉద్యోగం కోసం హత్య?
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి బస్వాపురంలో రైలు పట్టాలపై యువకుడి మృతదేహం కలకలం రేపింది. కారేపల్లికి చెందిన అజ్మీరా హీరాలాల్(32) అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై శవమై పడి ఉన్నాడు. ఇది గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతుడి కుటుంబంలో గత కొన్ని రోజులుగా సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం వివాదం నడుస్తోంది. తండ్రీ, సోదరితో గొడవలు పడుతున్న హీరాలాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య, ఏడాది వయసున్న చిన్నారి ఉంది. -
వారసత్వ ఉద్యోగాలు ప్రకటించాలి
సింగరేణి కార్మిక బిడ్డల సంఘం, వీఆర్ఎస్ డిపెండెంట్ల ఫోరం నాయకులు శ్రీరాంపూర్ : ఈ నెల 15 లోగా వారసత్వ ఉద్యోగాలను ప్రకటించాలని సింగరేణి కార్మిక బిడ్డల సంఘం, వీఆర్ఎస్ డిపెండెంట్ల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. రెండు సంఘాల నేతలు సంయుక్తంగా శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిడ్డల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్ముల శ్రీనివాస్, అధ్యక్షుడు ఎర్రొళ్ల నరేశ్, వీఆర్ఎస్ డిపెండెంట్ల ఫోరం అధ్యక్షుడు రమణాచారీలు మాట్లాడారు. తెలంగాణ వస్తే వారసత్వ ఉద్యోగాలు, 1997–2001 మద్య ఉన్న వీఆర్ఎస్ డిపెండెంట్లకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడితే నిరాశే మిగిలిందన్నారు. అన్ని సంఘాలు కార్మికుల ఓట్ల కోసమే తప్ప చిత్తశుద్ధితో ఉద్యోగాల సాధన కోసం పని చేయడం లేదని విమర్శించారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె నోటీసు ఇచ్చి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 15 లోపు యాజమాన్యం నుంచి గాని ప్రభుత్వం నుంచి గాని స్పష్టమైన ప్రకటన రాకుంటే పెద్దయెత్తున ఆందోళణ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు కుమారస్వామి, సల్ల రవీందర్‌రెడ్డి, వెంకటకష్ణ, ముదాం శ్రీనివాస్, కిరణ్‌లు పాల్గొన్నారు.