breaking news
on demand
-
ఈ ఏడాది టాప్ 15 స్కిల్స్ ఇవే..
హైదరాబాద్: ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఆన్ డిమాండ్ స్కిల్స్ వేగంగా మారిపోతున్నాయి. ఉద్యోగం తెచ్చుకునేందుకు మాత్రమే కాదు.. ఆ ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే కూడా ఎప్పటికప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలు అవసరం. వీటిపై అగ్రగామి ప్రొఫెషనల్ నెట్వర్క్ సంస్థ లింక్డ్ఇన్.. ‘స్కిల్స్ ఆన్ ది రైజ్ 2025’ పేరుతో జాబితాను విడుదల చేసింది. వృత్తి నిపుణులు తమ ఉద్యోగ విధులలో ముందడుగు వేయడానికి నేర్చుకోవాల్సిన 15 నైపుణ్యాలను వెల్లడించింది.భారతదేశంలో 2030 నాటికి చాలా ఉద్యోగాలలో ప్రస్తుతం ఉపయోగించే 64% నైపుణ్యాలు మారుతాయని అంచనా. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్ పరిశోధన ప్రకారం.. 25% మంది వృత్తి నిపుణులు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు తమకు లేవని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లోని దాదాపు 10 మందిలో నలుగురు (46%) నిపుణులు ఉద్యోగానికి తాము సరిపోతామో లేదో నిర్ణయించుకోవడమే కష్టంగా భావిస్తున్నారు. 31% మందికి తమ నైపుణ్యాలలో ఏవి ఉద్యోగ అవసరాలకు సరిపోతాయో తెలియకపోవడంతో, ఏ నైపుణ్యాలు డిమాండ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవడం మరింత కష్టంగా మారింది.మరోవైపు, భారతదేశంలో 69% మంది రిక్రూటర్లు నిపుణులకు ఉన్న నైపుణ్యాలకు, కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు మధ్య నైపుణ్య అంతరాలను నివేదిస్తున్నారు. చాలా పనులను ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో మానవ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో సృజనాత్మకత, ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, వ్యూహాత్మక ఆలోచన వంటి స్కిల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగ విధుల్లో ఏఐ అక్షరాస్యత అనేది ఒక ప్రాథమిక అంచనాగా మారుతోంది.టాప్ 15 నైపుణ్యాలు1. సృజనాత్మకత, ఆవిష్కరణ2. కోడ్ సమీక్ష3. సమస్య పరిష్కారం4. ప్రీ-స్క్రీనింగ్5. వ్యూహాత్మక ఆలోచన6. కమ్యూనికేషన్7. అనుకూలత8. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM)9. ఏఐ అక్షరాస్యత10. డీబగ్గింగ్11. కస్టమర్ ఎంగేజ్మెంట్12. గణాంక డేటా విశ్లేషణ13. ప్రాంప్ట్ ఇంజనీరింగ్14. మార్కెట్ విశ్లేషణ15. స్టేక్‌హోల్డర్ నిర్వహణహైదరాబాద్లో కొత్త ఉద్యోగాల అన్వేషణలింక్డ్ఇన్ నుంచి వచ్చిన తాజా పరిశోధన ప్రకారం.. హైదరాబాద్‌లోని 82% మంది వృత్తి నిపుణులు ఈ సంవత్సరం కొత్త ఉద్యోగం కోసం వెతకాలని యోచిస్తున్నారు. అయితే నగరంలో 56% మంది నిపుణులు తాము గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నామని చెబుతున్నారు. కానీ స్పందన మాత్రం తక్కువగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్ తమ వార్షిక ‘జాబ్స్ ఆన్ ది రైజ్’ జాబితాలో భాగంగా గత మూడేళ్లలో ఎలాంటి ఉద్యోగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో కూడా వివరించింది.హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలు1. సేల్స్ డెవలప్మెంట్ ప్రతినిధి2. కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్3. సోర్సింగ్ మేనేజర్4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్5. సేల్స్ మేనేజర్6. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్7. సోషల్ మీడియా మేనేజర్8. హ్యూమన్ రిసోర్సెస్ ఆపరేషన్స్ మేనేజర్9. పైపింగ్ డిజైనర్10. కమర్షియల్ మేనేజర్ -
యూరప్‌కు కలంకారీ ఎగుమతి
జేఎస్టీ, ఆదిత్య బిర్లా గ్రూపు ఆధ్వర్యంలో యాంత్రీకరణ త్వరలోనే పెడనలో యూనిట్ ప్రారంభం మచిలీపట్నం : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెడన కలంకారీ వస్త్రాలకు మంచిరోజులు రానున్నాయి. కలంకారీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటి వరకు సహజసిద్ధమైన రంగులతో లినెన్ వస్త్రంపై చెక్క అచ్చుల(బ్లాక్స్) అద్దకంతో డిజైన్లు ముద్రించేవారు. కోల్‌కతాకు చెందిన ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్ గ్రూపులోని జయశ్రీ టెక్స్టైల్స్ (జేఎస్టీ) కలంకారీ వస్త్రాలను మరింత నాణ్యతతో వేగంగా తయారు చేసే అంశంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ నెల11న జేఎస్టీ ప్రతినిధులు పెడనలో పర్యటించారు. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు, ముద్రణకు ఉపయోగిస్తున్న పద్ధతులు, రంగుల తయారీ తదితర వివరాలను సేకరించారు. అనంతరం జేఎస్టీ మార్కెటింగ్ మేనేజర్ ఎస్.శ్రీనివాసన్, వీవర్స్ సర్వీస్ సెంటర్ (డబ్ల్యూఎస్సీ) డెప్యూటీ డెరైక్టర్ వినేష్ నటియాల్ పలు అంశాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే వీవర్స్ సర్వీస్ సెంటర్, జేఎస్టీ సంయుక్త ఆధ్వర్యంలో యంత్రాల సాయంతో కలంకారీ వస్త్రాలను త్వరితగతిన తయారు చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. పెడనకు చెందిన వ్యాపారి పిచ్చుక శ్రీనివాస్‌కు చెందిన తయారీ కేంద్రంలో తొలుత ఈ యంత్రాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ వస్త్రాలను జేఎస్టీ కంపెనీ ద్వారా యూరప్ దేశాలకు ఎగుమతులు చేస్తామని చెప్పారు. కలంకారీ వస్త్రాల తయారీలో ఉపయోగించే లినెన్ క్లాత్‌ను తమ కంపెనీయే సరఫరా చేస్తుందని జేఎస్టీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసన్ వివరించారు. -
ఆన్ డిమాండ్..?