breaking news
Degree first year
-
ఓయూకు దసరా సెలవులు.. ఉద్యోగులకు రెండు రోజులే
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి గురువారం(అక్టోబర్ 13) నుంచి ఈ నెల 19 వరకు ఆరు రోజులపాటు దసరా సెలవులను ప్రకటించారు. క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని పీఆర్వో డాక్టర్ సుజాత తెలిపారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్, పాలన భవనం కార్యాలయం, ఇతర కార్యాలయాలకు 14, 15 తేదీలలో (రెండు రోజులు) మాత్రమే దసరా సెలవులు వర్తిస్తాయన్నారు. ఈ నెల 20 నుంచి తిరిగి ఓయూ తెరుచుకోనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఓయూలో ఈ–ఆఫీస్ సిస్టమ్ ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వ కాలేజియోట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ చేతుల మీదుగా ఈ– ఆఫీస్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రారంభమయ్యాయి. మంగళవారం పాలన భవనంలో వీసీ ప్రొఫెసర్ రవీందర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ–ఆఫీస్‌తో పనులు తొందరగా జరుగుతాయని, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగుల పూర్తి వివరాలతో పాటు వివిధ కార్యాలయాల సమాచారం అందుబాటులో ఉంటుందని పీఆర్వో డాక్టర్ సుజాత వివరించారు. 18న ఓయూ పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు సీపీజీఈటీ– 2021లో భాగంగా నిర్వహించిన వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. వాల్యూయేషన్ల జాప్యంతో పాటు దసరా సెలవుల కారణంగా ఫలితాలను 18కి వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. ఓయూ డిగ్రీ ఫస్టియర్ ఫలితాలు విడుదల ఓయూ పరిధిలో డిగ్రీ రెగ్యులర్ కోర్సుల ఫస్టియర్ (సీబీఎస్సీ) మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు. (చదవండి: నీట్ రద్దు.. మంత్రి కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ) -
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో నివాసం ఉంటున్న రసమోని మీనాక్షి(19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈనెల 11న మీనాక్షి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి వెంకటయ్య తన కూతురు కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకి తెలిసిన వారు 81858 55212, 9346249416 లలో తెలియజేయాలని పోలీసులు కోరారు. (చదవండి: భూ వ్యవహారంలో రూ.2కోట్ల మోసం) -
థామస్ బ్రిడ్జిపై ప్రమాదం.. విద్యార్థిని మృతి
పశ్చిమగోదావరి(నర్సాపురం): నర్సాపురం మండలంలోని థామస్ బ్రిడ్జిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న లక్కవరపు శిరీష(18) అనే డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వెనక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శిరీష అక్కడికక్కడే మృతిచెందింది. మృతిచెందిన శిరీష స్వగ్రామం మొగల్తూరు మండలం కేపీపాలెం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.