breaking news
The defections
-
ఏపీలో వైఎస్సార్సీపీ బలమైన శక్తి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై కొన్ని చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు పథకం ప్రకారమే మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. కొన్ని ఛానళ్లు టీడీపీకి వత్తాసు పలుకుతూ దుష్ప్రచారం చేయడంపై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయమన్నారు. తమ ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ఆర్ సీపీలోనే ఉంటామన్నారు. తాము పదవుకో, మరోదాని కోసమో ఆశపడలేదని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన ఘటన చంద్రబాబు నాయుడిది అన్నారు. చిత్తూరు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని నారాయణస్వామి ధ్వజమెత్తారు. -
జనవరిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి నెల వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని స్పీకరు సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలో కరువు సమస్యపై చర్చించడం జరుగుతుందన్నారు. పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే అంశం తన పరిధిలో ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభాపతిగా నియమించబడి నేటికి 550 రోజులు అవుతున్నదని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం రోజుకు 15 గంటలు కష్టపడుతున్నట్లు ఆయన చెప్పారు. తన నియోజకవర్గంలో 18 గ్రామాల్లోని 1200 చెంచు కుటుంబాలను చేరదీసి వారిని కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నాని స్పీకరు పేర్కొన్నారు.