breaking news
def and dumb
-
బధిర చైతన్యం..!
అద్దంకి రూరల్: పూనూరి ఆరోగ్యం అనే మహిళ తన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితుల పిల్లల్లో ఉన్న వికలత్వాన్ని చూసి చలించారు. వారికి విద్యను అందించి సమాజంలో భాగస్వాములను చేయాలనే తపనతో 2000 సంవత్సరంలో అద్దంకి పట్టణంలోని పాత కోర్టు భవనాల వద్ద అద్దె గృహంలో 30 మంది విద్యార్ధులతో చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాల ప్రారంభించారు. మొక్క పెరిగి వృక్షం అయినట్లు 10 సంవత్సరాల అనంతరం అంటే 2010లో ప్రభుత్వం చేయూత, దాతల సహకారంతో సింగరకొండ వెళ్లే రహదారిలోని కాకానిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో సొంత భవనం సమకూర్చారు. ప్రస్తుతం 100 మంది చిన్నారులకు ఆశ్రయం కల్పించారు. 18 వసంతాలుగా ఎందరో బధిరులు, మానసిక వికలాంగులను ఈ విద్యాలయం అక్కున చేర్చుకుంది. పాఠశాలలోని బధిర విద్యార్థులందరికీ విద్యతో పాటు ఉచితంగా భోజనం, ఉదయం టిఫిన్, సాయంత్ర స్నాక్స్, పాలు, బాలబాలికలకు వేర్వేరుగా వసతి, యూనిఫాం అందజేస్తున్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో బోధన ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం మేళవించి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక విద్యతో పాటు స్పీచ్ థెరపీ, గ్రూప్ హియరింగ్ పరికరాలు సమకూర్చి మాటలు రాని వారికి శిక్షణ ఇస్తూ ప్రత్యేక బోధనతో ముందుకు సాగుతున్నారు. వృత్తివిద్య కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి చదివిన విద్యార్థులు ఇప్పుడు ఇంటర్మీడియెట్‌లో 20 మంది, డిగ్రీలో 10 మంది, పాలిటెక్నిక్‌లో 5 గురు విద్యాభ్యాసం చేస్తుండటం తోటి విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది. సృజనకు దర్పణం బధిరుల విద్యార్థులు తమలోని కళాహృదయంతో పనికి రాని చిత్తు కాగితాలతో మానవుడి మెదడు, నౌకా, జాతీయ జెండా, గుండె, సైకిల్ వంటి కళాకృతులు నిర్మించారు. పాఠశాలకు వచ్చినవారు చిన్నారులను అభినందిస్తున్నప్పుడు వారిలో మరింత ఉత్సాహం కలుగుతోంది. ఇక్కడి వారు ప్రభుత్వ ఉద్యోగులుగా.. ఇక్కడ విద్యను అభ్యసించిన వారిలో ఇద్దరు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారిలో ఒకరు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో, మరొకరు పొదిలి మార్కెట్ యార్డులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 80 శాతం నిధులు అందజేస్తుండగా.. మిగిలిన 20 శాతం దాతల ద్వారా సమకూరుతోంది. 10 మంది బోధన సిబ్బంది ఉన్నారు. -
బధిరుల ప్రతిభ అభినందనీయం
నన్నయ వీసీ ముత్యాలునాయుడు ముగిసిన బధిరుల వారోత్సవాలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : బ«ధిరులు అసమాన ప్రతిభ కలిగి ఉన్నారని, ఎవరికీ తీసిపోని విధంగా ముందుకు దూసుకెళ్తున్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ముర్రు ముత్యాలునాయుడు అన్నారు. స్థానిక ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో ఆదివారం రాత్రి ప్రపంచ బధిరుల వారోత్సవాల ముగింపు వేడుక జరిగింది. ముఖ్యఅతిథి వీసీ ముత్యాలునాయుడు మాట్లాడుతూ బధిరులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఆశ్రమ పాఠశాల కరస్పాండెంట్ స్వప్న అభినందనీయురాలన్నారు. త్రీటౌన్ సీఐ రామకోటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం బధిర విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. యోగా టీచర్ అన్నపూర్ణ నేతృత్వంలో బధిరులు చేసిన యోగా విన్యాసాలు అబ్బురపరిచాయి. అతిథులు ఉపన్యాసాన్ని ప్రత్యేక ఉపాధ్యాయురాలు ఆశాలత.. బధిర విద్యార్థులకు మూగభాషలో(సైన్లాంగ్వేజ్) వివరించారు. రామ్‌సాయి కనస్ట్ర„ý న్స్ అధినేత గోకులం రవి, రమాదేవి, ఎలిషా రాజ్‌కుమార్, శాంతి, నాగలక్ష్మీ, ప్రేమలత, బాలు, నిర్మలపాల్గొన్నారు.