breaking news
Deepshika
-
మార్క్ క్వీన్.. ఎంట్రీయే స్టార్ హీరోతో..
నటి దీప్శిఖ 'మార్క్ మూవీ'తో కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ నేడు (డిసెంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్తో కలిసి స్క్రీన్‌ను పంచుకుంది. ఇది దీప్శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అరంగేట్రానికి ముందే సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోతోంది. సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్లో దీప్శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా..దీంతో అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు. ఇక దీప్శిఖ మాట్లాడుతూ.. కిచ్చా సుదీప్తో కలిసి పనిచేయడం వల్ల నా కల నెరవేరింది. ఆయన దగ్గరి నుంచి క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను. ఇవి నా నటనను మరింత మెరుగుపర్చేందుకు ప్రోత్సహించాయి. అలాగే ప్రతిష్టాత్మక సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్లో పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో ప్రేమ ఇలాంటి గొప్ప నిర్మాణ సంస్థతోనే నా కన్నడ ప్రయాణం ప్రారంభం కావడం నా కెరీర్‌కు మరింత విలువ, ధైర్యాన్ని ఇచ్చింది. ఈ అవకాశం లభించడం నా అదృష్టం. సినిమా విడుదలకంటే ముందే నాపై ఎంతో ప్రేమ చూపించారు. మీ ప్రేమే నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుంది అని పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, సిబ్బంది, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. -
‘రవికుల రఘురామ’ ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది: విజయ్ సేతుపతి
యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటించిన తాజా చిత్రం 'రవికుల రఘురామ'. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన అందరూ ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. -
Ravikula Raghurama: ఆకట్టుకుంటున్న ‘ప్రాణాలే’ సాంగ్
యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటించిన తాజా చిత్రం 'రవికుల రఘురామ'. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'చందమామే' అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ "ప్రాణాలే"రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో సాంగ్ ను డైరెక్టర్ రాధాకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ...ప్రాణాలే సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా వినసొంపుగా ఉన్నాయి. ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ సాంగ్ ఆకట్టుకోవడంతో రవికుల రఘురామ చిత్ర రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తారని చెప్పడంలో సందేహం లేదని, మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.


