breaking news
Death apple
-
డెత్ యాపిల్.. ఈ చెట్టు కింద నిలబడితే అంతే సంగతి!
ఫ్లోరిడా అడవుల్లో, కరేబియన్ బీచ్‌ల దగ్గర ఒక చెట్టు ఉంది. పేరు ‘మంచినీల్’. చూడ్డానికి పచ్చగా ఉండే కాయలు కాస్తుంది. కానీ దాని ఆకు, కాయ, బెరడు, పాలు... అన్నీ విషం. అందుకే కొలంబస్ దీనిని ‘డెత్ యాపిల్’ అని పిలిచాడు.ఈ చెట్టు 9 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. వాన పడుతుంటే ఈ చెట్టు కింద నిలబడితే... అంతే సంగతి. చెట్టు మీద నుంచి కారే వాననీళ్లు ఒంటి మీద పడితే చర్మం మంట పుట్టి దురద వస్తుంది. బొబ్బలు వస్తాయి. చెట్టు కింద కార్ పార్క్ చేస్తే, దాని పాలు కారు మీద పడి పెయింట్ ఊడిపోతుంది. అందుకే ఆ చెట్ల చుట్టూ ‘డేంజర్’ బోర్డులు పెడతారు. ఈ చెట్టులో ‘హిప్పోమేన్’ అనే విషం ఉంటుంది. చెట్టు మొత్తం విషమే. పొరపాటున ఈ చెట్టు కర్రని నరికినా, కాల్చినా వచ్చే పొడిని, పొగని పీల్చామంటే గొంతులో మంట, దగ్గు, జ్వరం వచ్చేస్తాయి. ఊపిరి ఆడదు. అందుకే ఈ చెట్టు జోలికి ఎవరూ వెళ్లరు.మంచినీల్ కాయలు చూడ్డానికి జామకాయల్లా, చిన్న యాపిల్స్‌లా ముద్దుగా ఉంటాయి. కానీ ఒక్క కాయ తిన్నా నోరు, గొంతు కాలిపోతుంది. కడుపులో మంట. ప్రాణానికే ప్రమాదం. అందుకే అడవికి వెళ్లినా, బీచ్‌కి వెళ్లినా తెలియని కాయలు, పళ్లు అస్సలు ముట్టుకోకూడదు. తినకూడదు. ‘డేంజర్’ బోర్డు ఉంటే దూరం నుంచే దండం పెట్టాలి. -
ఉసిరే అని తింటే.. ఉసురు తీస్తుంది
చూడ్డానికి ఉసిరి కాయలా కనిపిస్తోంది కదా అని దీన్ని తింటే.. ఉసురు తీస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టుగా పేరొందిన మాంచినీల్ చెట్టు పండు. చెట్టు పేరులో మంచి ఉంది గానీ.. ఇది మహా చెడ్డది. ఎందుకంటే.. పండు తినడం సంగతి సరే.. సమీపంలోకి వెళ్లినా.. ఒళ్లు మంటలు పుడతాయి. చెట్టు కొమ్మలు, ఆకుల నుంచి కారే తెల్లటిపాలు వంటిది చర్మంపై పడితే బొబ్బలు తేలతాయి. మంటల్లో మనల్ని ఫ్రై చేస్తున్నట్టు ఉంటుంది. చెట్టు బెరడును కాల్చిన పొగ కళ్లను తాకితే.. తాత్కాలికంగా.. ఒక్కోసారి శాశ్వతంగా అంధత్వం వచ్చే ప్రమాదముంది. అందుకే ఈ చెట్టు ఉన్న చోట్ల డేంజర్ బోర్డులు పెడతారు. ఇంతకీ ఈ చెట్టు ఏయే ప్రాంతాల్లో ఉందో చెప్పలేదు కదూ.. అమెరికాలోని ఫ్లోరిడా, కరేబియన్ దీవులు, బహమాస్. దీని చరిత్ర ఎంత గొప్పదంటే.. అమెరికాను కనుగొన్న కొలంబస్ ఈ చెట్టు పండుకు ‘డెత్ ఆపిల్’ అని పేరు పెట్టాడు. అప్పట్లో విషప్రయోగం ద్వారా పేరొందిన యుద్ధ వీరులను చంపడానికి ‘మాంచినీల్’ ఎంతో సహాయపడిందట!


