breaking news
dcm van overturned
-
మొరాదాబాద్‌లో అదుపు తప్పి కారుపై పడ్డ వ్యాన్
-
పంజాగుట్టలో డీసీఎం బీభత్సం
హైదరాబాద్: పంజాగుట్టలో శనివారం డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను ఢీకొట్టింది. అనంతరం వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారులు పవన్ (45). ప్రసాద్ (26)లకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రహదారిపై వ్యాన్ బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై నుంచి వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్ ను పునరుద్దరించారు. డీసీఎం ఓవర్ లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.