breaking news
dccb president election
-
డీసీసీబీ చైర్మన్ పీఠం మాదే:అమర్నాథ్ రెడ్డి
కడప : ఎర్రచందనం కేసులు పెడతామంటూ డీసీసీబీ చైర్మన్ ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ డైరెక్టర్లను టీడీపీ లాక్కునే ప్రయత్నం చేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఉన్న సొసైటీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా డీసీసీబీ చైర్మన్ పీఠం తామే దక్కించుకుంటామని అమర్నాథ్రెడ్డి స్పష్టం చేశారు. కాగా కోరం లేక డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక ఆదివారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. -
కడప డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక వాయిదా
కడప : అనుకున్నట్లుగానే అయ్యింది. డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. తగినంత కోరం లేకపోవటంతో ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. కాగా రేపు కోరం లేకున్నా చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుందని ఎన్నికల అధికారి శనివారమిక్కడ తెలిపారు. మొత్తం 21మంది డైరెక్టర్లు ఉండగా వారిలో 11మంది డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. వారిలో టీడీపీ శిబిరంలో ఏడుగురు, వైఎస్ఆర్ సీపీ శిబిరంలో ఎనిమిదిమంది ఉన్నట్లు సమాచారం. కాగా డీసీసీబీ చైర్మన్ ఐ.తిరుపేలురెడ్డి పదవి రద్దు కావడంతో వైస్ చైర్మన్ ఆంజనేయులు యాదవ్ ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈలోగా అతని డైరెక్టర్ పదవిని రద్దు చేస్తూ అధికార యంత్రాంగం నిర్ణయించిన విషయం తెలిసిందే.