-
వార్నర్ ఆట ఒక ఎత్తు అయితే మిగతా..
2014లో 528 పరుగులు ...2015లో 562...2016లో 848...2017లో 641...సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున గత నాలుగేళ్లు డేవిడ్ వార్నర్ ప్రదర్శన ఇది. ఒంటి చేత్తో అతను మ్యాచ్‌లు గెలిపించాడు. 2014 నుంచి 59 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 52.63 సగటు, 147.71 స్ట్రైక్ రేట్‌తో 2,579 పరుగులు చేశాడు. ఇందులో 26 అర్ధ శతకాలు, ఒక శతకం ఉన్నాయి. ఇదే సమయంలో జట్టంతా చేసిన పరుగులు 6,292. సగటు23.74 కాగా, స్ట్రైక్ రేట్ 123.98 మాత్రమే. వీటిలో 28 అర్ధ శతకాలున్నాయి. ఇప్పటివరకు సన్‌రైజర్స్ జట్టులో వార్నర్ ఆట ఒక ఎత్తు అయితే మిగతా ఆటగాళ్ల ఆట అంతా ఒక ఎత్తు. 2016లో విశ్వరూపం చూపించిన వార్నర్ ఏకంగా 848 పరుగులు చేసి ఫ్రాంచైజీని విజేతగా నిలిపాడు. 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా తన హార్డ్ హిట్టింగ్తో మెరుపు ఆరంభం దక్కేది. చివరకు జట్టుకు గౌరవప్రద స్కోరు అందేది. బ్యాటింగ్‌లో వార్నర్ వేసిన పునాదిపై భువనేశ్వర్, రషీద్‌ఖాన్ వంటి బౌలర్లు గెలుపు మేడ కట్టేవారు. అతడి చురుకైన ఫీల్డింగ్ కూడా ఎంతో మేలు చేసేది. నిలకడ లేమితో సతమతం అవుతున్న శిఖర్ ధావన్ వార్నర్ సహచర్యంతోనే తిరిగి గాడిన పడ్డాడని చెప్పొచ్చు. ఇలాంటి ఆటగాడు ఇప్పుడు ఐపీఎల్‌కు దూరం కావడం ఫ్రాంచైజీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. కొత్త సీజన్లో భారమంతా ధావన్, మనీశ్ పాండేలపై పడనుంది. వార్నర్ స్థానంలో మంచి హిట్టర్లయిన గప్టిల్, కుశాల్ పెరీరా, హేల్స్, మోర్గాన్, లెండిల్ సిమ్మన్స్, క్లాసెన్లలో ఒకరిని ఎంచుకుంటే సన్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండవచ్చు. విలియమ్సన్ ఏం చేస్తాడో! వార్నర్ స్థానంలో కెప్టెన్ ఎవరా..? అని ఆలోచిస్తున్న అభిమానులకు విలియమ్సన్ నియామకం ఆశ్చర్యపర్చింది. జట్టులో చోటే కష్టమైన అతడికి ఏకంగా సారథ్యం అప్పగించడం సాహసమే అని చెప్పాలి. గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్‌కు 15 మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 411 పరుగులే చేశాడు. ఇందులో మూడే అర్ధ శతకాలు. స్వదేశంలో ఇటీవలి ముక్కోణపు టి20 టోర్నీ సందర్భంగానూ పొట్టి ఫార్మాట్లో అతడి ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. అయితే... తర్వాతి మ్యాచ్‌లో అతడు 46 బంతుల్లో 72 పరుగులు చేసి వాటికి జవాబిచ్చాడు. సాంకేతికతలో తిరుగులేని ఈ కివీస్ సారథి మూడేళ్ల ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 129.24. దీనిని అతడు మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో ధావన్, మనీశ్ పాండే వంటివారితో మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాలి. చివర్లో యూసుఫ్ పఠాన్, హుడా వంటి హిట్టర్లు చెలరేగితే జట్టు భారీ స్కోరు చేయగలుగుతుంది. ఇక వైస్ కెప్టెన్ హోదా దక్కిన పేసర్ భువనేశ్వర్పైన కూడా పెద్ద బాధ్యత ఉంది. తక్కువ స్కోరు చేసిన మ్యాచ్‌లో భువీ, రషీద్‌ఖాన్, షకిబ్‌ల బౌలింగ్ ప్రతిభే గట్టెక్కించగలుగుతుంది. వనరులను వినియోగించుకోవడం, వ్యూహాలు పన్నడం వంటివి కెప్టెన్‌గా విలియమ్సన్ సామర్థ్యానికి పరీక్షే. సన్‌రైజర్స్: విలియమ్సన్ (కెప్టెన్), ధావన్, మనీశ్ పాండే, రికీ భుయ్, సచిన్ బేబీ, తన్మయ్ అగర్వాల్, భువనేశ్వర్, రషీద్‌ఖాన్, థంపి, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, నటరాజన్, సందీప్‌శర్మ, స్టాన్లేక్, షకీబ్, హుడా, కార్లోస్ బ్రాత్‌వైట్, యూసుఫ్ పఠాన్, నబీ, జోర్డాన్, బిపుల్ శర్మ, మెహదీ హసన్, వద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి. – సాక్షి క్రీడా విభాగం -
కమెడియన్ తో డేటింగ్ చేయట్లేదన్న హీరోయిన్
లండన్: తన క్లోజ్ ఫ్రెండ్, కమెడియన్ డేవిడ్ విలియమ్స్ తో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ తోసిపుచ్చింది. విలియమ్స్ తనకు స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. గతవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసిన ఫొటోలు వెలుగులోకి రావడంతో కేట్, డేవిడ్ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె ఘాటుగా స్పందించింది. 'విలియమ్స్ తో డిన్నర్ కు వెళ్లినంతమాత్రానా ప్రేమించుకుంటున్నామని రాసేస్తారా? మీమిద్దరం స్నేహితులం మాత్రమే. మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప ఏంలేదు. గత 16 ఏళ్లుగా మేము స్నేహం కొనసాగిస్తున్నాం. అతడి కోసం నేను టాటూ వేయించుకోలేద'ని 42 ఏళ్ల కేట్ బెకిన్ సేల్ పేర్కొంది. 2010లో డచ్ మోడల్ లారా స్టోన్ ను పెళ్లాడిన డేవిడ్ 2015లో ఆమె నుంచి విడిపోయాడు. డేవిడ్ కు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. 2004లో దర్శకుడు లెన్ వైజ్మన్ ను పెళ్లాడిన కేట్ పదేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కూతురు ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement