కమెడియన్ తో డేటింగ్ చేయట్లేదన్న హీరోయిన్ | Kate Beckinsale denies dating David Walliams | Sakshi
Sakshi News home page

కమెడియన్ తో డేటింగ్ చేయట్లేదన్న హీరోయిన్

Jul 25 2016 10:07 AM | Updated on Sep 4 2017 6:14 AM

కమెడియన్ తో డేటింగ్ చేయట్లేదన్న హీరోయిన్

కమెడియన్ తో డేటింగ్ చేయట్లేదన్న హీరోయిన్

తన క్లోజ్ ఫ్రెండ్, కమెడియన్ డేవిడ్ విలియమ్స్ తో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ తోసిపుచ్చింది.

లండన్: తన క్లోజ్ ఫ్రెండ్, కమెడియన్ డేవిడ్ విలియమ్స్ తో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ తోసిపుచ్చింది. విలియమ్స్ తనకు స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. గతవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసిన ఫొటోలు వెలుగులోకి రావడంతో కేట్, డేవిడ్ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె ఘాటుగా స్పందించింది.

'విలియమ్స్ తో డిన్నర్ కు వెళ్లినంతమాత్రానా ప్రేమించుకుంటున్నామని రాసేస్తారా? మీమిద్దరం స్నేహితులం మాత్రమే. మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప ఏంలేదు. గత 16 ఏళ్లుగా మేము స్నేహం కొనసాగిస్తున్నాం. అతడి కోసం నేను టాటూ వేయించుకోలేద'ని 42 ఏళ్ల కేట్ బెకిన్ సేల్ పేర్కొంది. 2010లో డచ్ మోడల్ లారా స్టోన్ ను పెళ్లాడిన డేవిడ్ 2015లో ఆమె నుంచి విడిపోయాడు. డేవిడ్ కు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. 2004లో దర్శకుడు లెన్ వైజ్మన్ ను పెళ్లాడిన కేట్ పదేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కూతురు ఉంది.

Advertisement
Advertisement