breaking news
Darling telugu movie
-
అందరినీ మెప్పించేలా 'డార్లింగ్'.. ఆసక్తిగా ట్రైలర్
ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. హనుమాన్ సినిమా తర్వాత ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై డార్లింగ్ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య విడుదల చేస్తున్నారు.ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రేమ కథతో 'డార్లింగ్' చిత్రాన్ని తెరకెక్కించినట్లు శ్రీమతి చైతన్య తెలిపారు. విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్ ఉన్న యువ జంట కథతో వస్తున్నందున ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని భావించారు.పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం పారిస్‌కు వెళ్లాలని ఏకైక లక్ష్యంతో హీరో ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యకు స్ల్పిట్ పర్సనాలిటీ అనే జబ్బు ఉందని తేలుతుంది. దీంతో ఆమె ఆపరిచితుడులోని విక్రమ్ మాదిరి పలు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీని గురించి అసలు విషయం తెలియక ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనేదే డార్లింగ్ చిత్రంలో చూపించనున్నారు. నభా నటేశ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. జులై 19న ఈ చిత్రం విడుదల కానుంది. -
ప్రభాస్ బాహుబలిగా డార్లింగ్
టాలీవుడ్లో విజయవంతమైన పలు చిత్రాలను తమిళంలోకి అనువదిస్తూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు భద్రకాళీ ఫిలింస్ అధినేతలు. అంతకు ముందు సెల్వందన్, ఇదుదాండా పోలీస్, బ్రూస్లీ-2, మగధీర, ఎవండా తదితర చిత్రాలను తమిళ ప్రేక్షకులకు అందించిన వీరు తాజాగా తెలుగులో సూపర్‌హిట్ అయిన డార్లింగ్ చిత్రాన్ని ప్రభాస్ బాహుబలి పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు. దక్షిణాదిలో తెరకెక్కి ప్రపంచస్థాయి రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం బాహుబలి. ఆ చిత్ర కథానాయకుడు నటించిన మరో సూపర్‌హిట్ చిత్రం డార్లింగ్. అందాల నటి కాజల్‌అగర్వాల్ ఆయనతో రొమాన్స్ చేసిన ఈ చిత్రంలో ప్రభు, ముఖేష్ రిషీ, తులసి, కోట శ్రీనివాసరావు, ఆహుతిప్రసాద్, చంద్రమోహన్, ఎంఎస్.నారాయణ, చంద్రబోస్ ముఖ్య పాత్రలు పోషించారు. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం తమిళంలో సత్య సిద్దాల, అడ్డాల వెంకట్రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్కే.రాజరాజా మాటలను అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ మంగళవారం సాయంత్రం చెన్నై, ఏవీఎం స్టూడియోలో జరిగింది. చిత్ర ఆడియోను ప్రముఖ స్టంట్‌మాస్టర్ జాగ్వుర్ తంగం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఆర్కే. రాజరాజా మట్లాడుతూ ఇందులో హీరో హీరోయిన్లు చిన్నతనం నుంచి కలిసి చదువుకుంటారన్నారు. పెద్దయిన తరువాత బాల్యమిత్రులందరూ కలుసుకుంటారని ఆ కలయిక తరువాత హీరోహీరోయిన్ల మధ్య స్నేహం ఎలా ప్రేమగా మారింది. ఇటువంటి అంశాల సమాహారమే ప్రభాస్ బాహుబలి అని తెలిపారు. భద్రకాళీ ఫిలింస్ అధినేతలు చె ప్పినట్టుగానే నెలకో చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన వీరు తాజాగా అల్లుఅర్జున్ నటించిన సరైనోడు తమిళం హక్కుల్ని సొంతం చేసుకున్నట్టు తెలిపారు.