breaking news
danger mark
-
నేపాల్ నెత్తిన మరో జలఖడ్గం
కఠ్మాండు: మెరుపు వరద బురదతో జలమయమైన నేపాల్ దిగువ ప్రాంతాలపై మళ్లీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు స్థానికుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కనీవినీ ఎరుగని జల ప్రళయం దాటికి ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో జనజీవనం కకావికలంకాగా మరోసారి అపార జలరాశి వరదరూపంలో వచ్చి పడే ఆస్కారముందని నేపాల్ వాతావరణ శాఖలోని వరద అంచనాల విభాగం బుధవారం హెచ్చరికలు జారీచేసింది. సింధూరి జిల్లాలో సున్ కోశి నది, గూర్ఖా జిల్లాలో బుధి గండకీ నది, దదేల్ధురా జిల్లాలో మహాకాళీ నది, లామ్జుంగ్ జిలాల్లో మార్షా్యంగ్డి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్లు వరద అంచనాల విభాగం ప్రకటించింది. దిగువ ప్రాంతాల ప్రజలు జనావాసాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలుచేసింది. భుకుందేబేసీ వాటర్ లెవల్ మానిటరింగ్ కేంద్రంలో మంగళవారం రాత్రి 11.15 గంటలకే నది డేంజర్ మార్క్‌ను దాటేసింది. మార్షా్యంగ్డి నదిలో నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే వినాశనం సృష్టించిన వరద విలయంలో మృత్యువాత పడిన వారి సంఖ్య బుధవారానికి 1243కు పెరిగింది. మరో 4,216 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. భారీ వర్షం, బురద మధ్యే భవన శిథిలాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని ఆశతో అన్వేషణ బృందాలు కాలంతో పోటీపడుతూ సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. 1,113 మృతదేహాల గుర్తింపు, చట్టపర ప్రక్రియ పూర్తయిందని, 95 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. 21,314 మంది సైనికులు, పోలీసులు, వలంటీర్లు ఈ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే రాసువా, నువాకోట్‌లో కురుస్తున్న భారీ వర్షం సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కల్గిస్తోంది. వర్షపు నీరు చేరుతుండటంతో జలవిద్యుత్కేంద్ర సొరంగంలో అన్వేషణ ఆగిపోయిందని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ సంస్థ తెలిపింది. భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల సొరంగాల్లో అన్వేషణకు భారత్, చైనా, ద.కొరియా నిపుణుల బృందాలు కృషిచేస్తున్నాయి. వాతావరణ మార్పులతోనే దారుణం: ప్రధాని సంపన్న దేశాలు వాతావరణంలోకి భారీగా విడుదలచేస్తున్న కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పుల కారణంగానే హిమానీనదాలు అమిత వేగంగా కరిగిపోతూ కొత్త ఉత్పాతాలను తీసుకొస్తున్నాయని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆరోపించారు. బుధవారం నేపాల్ పార్లమెంట్ దిగువ సభలో ఆయన మాట్లాడారు. ‘‘భోటె కోశీలో వరద రావడానికి ప్రత్యక్షంగా వాతావరణమార్పులు(క్లైమేట్ చేంజ్) కారణమని నిపుణులు తేల్చేశారు. అంతర్జాతీయ సమాజానికి మేం చెప్పేదొక్కటే. మేం అనుభవిస్తున్న ఈ బాధలకు వాతావరణ మార్పులే కారణం.ప్రపంచ దేశాలతో పోలిస్తే నేపాల్ గ్రీన్హౌస్ వాయువులను అత్యల్పంగా విడుదలచేస్తుంది. కానీ ఇతర దేశాలు చేసిన పాపాలకు మేం బలవుతున్నాం’అని అన్నారు. ఆపన్న హస్తం అందిస్తున్న భారత్‌కు ప్రధాని బాలేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. కాఠ్మండులో సోనూ సూద్ సాయం కోవిడ్ సంక్షోభం వేళ భారీ సంఖ్యలో కరోనా బాధితులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటారు. కాఠ్మండుకు పెద్ద మొత్తంలో సహాయక సామగ్రిని తీసుకెళ్లి వరద బాధితులకు అందజేశారు. ‘‘ఇక్కడి వాళ్లకు సరిపడా సరకులు, ఆహారం, దుప్పట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వరదతో సర్వం కోల్పోయిన వాళ్లకు మళ్లీ పాత జీవితాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని చెప్పారు. -
చెన్నైను మళ్లీ వణికిస్తున్న వర్షం
-
చెన్నైను మళ్లీ వణికిస్తున్న వర్షం
చెన్నై: చెన్నై నగరాన్ని మళ్లీ వర్షం వణికిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్లుగానే శుక్రవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాయపేట, మౌంట్ రోడ్, తాంబరం, మైలాపూర్, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్లీ వర్షం పడటంతో నగరవాసులు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. చెన్నై మహానగరం ఇంకా ముంపు లోనే మగ్గుతోంది. మరోవైపు కోయంబేడు బ్రిడ్జ్ దగ్గర ప్రమాద స్థాయిని దాటి నీరు ప్రవహిస్తోంది. ఇక నిత్యావసరాల కోసం జనాలు రోడ్లపై బారులు తీరుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలు, మంచినీళ్లు దొరక్క జనాలు అవస్థలు పడుతున్నారు. అలాగే ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ...చెన్నైలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న 72,119 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. -
ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ నీటిమట్టం
భారీ వర్షాలకు రాష్ట్ర రాజధాని వణికిపోతోంది. మూడు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. దీంతో సాగర్ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం స్థాయి 513.51 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 513.25 అడుగులకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగర్ పొంగిపొర్లే అవకాశముంది. దీంతో సాగర్ లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదిలావుండగా నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. -
గోదారి శాంతించినా.. వీడని కష్టాలు
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఉగ్ర గోదావరి శాంతించింది. భద్రాచలం వద్ద నీటిమట్టం మంగళవారం రాత్రి 7గంటలకు 45.5 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే కొనసాగుతోంది. 62 అడుగుల నీటిమట్టంతో ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తిన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టడటంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతి తగ్గటంతో ముంపు నుంచి గ్రామాలు బయట పడ్డాయి. భద్రాచలం నుంచి వాజేడు వరకూ.., అదే విధంగా చింతూరుకు రాకపోకలు సాగాయి. ఆర్టీసీ బస్సులను కూడా ఈ రహదారుల్లో నడిపారు. నాలుగు రోజులుగా నిలిపి వేసిన విద్యుత్ సరఫరాను ఆ శాఖాధికారులు ఒక్కో ఫీడర్లో పునరుద్ధరించేందుకు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా లేక మూగపోయిన సెల్ఫోన్లు మంగళవారం సాయంత్రం నుంచి పనిచేయటంతో సమాచారం అందుబాటులోకి వచ్చింది. వరద తగ్గినప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక ఉన్నందున భద్రాచలం డివిజన్లో 59 పునరావాస కేంద్రాలను కొనసాగిస్తూ 3,109 కుటుంబాలకు చెందిన 11,483 మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. ఇంకా జల దిగ్బంధమే... వరద తగ్గుముఖం పట్టినప్పటికీ భద్రాచలం డివిజన్లోని చాలా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వాజేడు మండలంలో దూలాపురం, ఏడ్చర్లపల్లి, నాగారం వద్ద రోడ్లపై నీరు తగ్గలేదు. దీంతో చీకుపల్లికి అవతల ఉన్న 32 గ్రామాలకు రాకపోకలు లేవు. అత్యవసర పనుల నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు పడవల ద్వారానే ప్రయాణం సాగించారు. భద్రాచలం నుంచి కూనవరం రహ దారిలో మురుమూరు, పోచారం వంటి చోట్ల రహదారులపై నుంచి వరద నీరు విడవ లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రయాణానికి తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. భద్రాచలం పట్టణంలోని రామాలయం వీధులు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. విస్తా కాంప్లెక్స్‌ను వరద నీరు విడవలేదు. అదే విధంగా రామాలయం పడమర మెట్లకు ఎదురుగా ఉన్న ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. అన్నదానం సత్రం కూడా వరద నీటిలోనే మునిగి ఉంది. రామాలయం నుంచి పంచాయతీ కార్యాలయానికి వచ్చే రహదారిపై నీరు తగ్గినప్పటికీ ఒండ్రు మట్టి చేరటంతో బురదమయంగా తయారైంది. ముంపు తగ్గక పోవటంతో చప్టా దిగువకు చెందిన ఇళ్ల వారు తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోనే ఉన్నారు. సుభాష్ నగర్లో నీరు తగ్గినప్పటికీ బురదగా ఉండటంతో సాయంత్రం తరువాత పునరావాస శిబిరాలను నుంచి ఇళ్లకు పయనమయ్యారు. విజృంభిస్తున్న వ్యాధులు వరద ఉధృతి తగ్గినప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. నాలుగు రోజుల పాటు వరద నీరు నిల్వ ఉండటంతో చెత్త, పంటలు ఇతర వ్యర్థ పదార్థాలు కుళ్లిపోయి దుర్గంధం వ స్తోంది. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంచాయతీ అధికారులు బ్లీచింగ్ చల్లకపోవటంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. దుమ్ముగూడెం, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఇక్కట్లు పునరావాస కేంద్రాల్లో తగిన సౌకర్యాలు లేక వరదబాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పట్టణంలోని జూనియర్ కళాశాల, తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వెలుతురు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పట్టణంలో ఉన్న పునరావాస శిబిరాల్లో స్వచ్ఛంద సంస్థల వారు అందిస్తున్న భోజనం తప్ప ప్రభుత్వపరంగా తగిన సహాయం అందించడం లేదని బాధితులు వాపోతున్నారు. దీంతో భోజనాల కోసం బాధితులు గిన్నెలు పట్టుకొని నెట్టుకుంటున్నారు. తానీషా కల్యాణ మండ పంలో అయితే గర్భిణులు, ముసలి వాళ్లు భోజనం కోసం లైన్లలో నిలబడ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వరద బాధితులు గోడును పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి.


