breaking news
cut jobs
-
ఓఎల్ఎక్స్లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత
నెదర్లాండ్‌కు చెందిన ప్రోసస్ కంపెనీ క్లాసిఫైడ్స్ వ్యాపార విభాగమైన ఓఎల్ఎక్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 800 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ గ్రూప్‌నకు చెందిన ఓఎల్ఎక్స్ ఆటోస్ కార్యకలాపాలను కొన్ని దేశాల్లో మూసివేస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్‌ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల తొలగింపు విషయాన్ని ఓఎల్ఎక్స్ గ్రూప్ టెక్ క్రంచ్ వార్తా సంస్థకు ధ్రువీకరించింది. ఆమ్స్టర్డామ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంగా కంపెనీ ఇటీవలే ఉద్యోగాల కోత గురించి బాధిత ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది. ‘ఈ సంవత్సరం ప్రారంభంలో ఓఎల్ఎక్స్ ఆటోస్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచే సంభావ్య కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాం’ అని కంపెనీ టెక్‌క్రంచ్ వార్తా సంస్థకు ఈమెయిల్ ద్వారా పంపిన ప్రకటనలో తెలిపింది. అర్జెంటీనా, మెక్సికో, కొలంబియాలో కంపెనీ తన కార్యకలాపాలను మూసివేసింది. ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ప్రోసస్ సంస్థ తన క్లాసిఫైడ్స్ వ్యాపారం ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
ఈ 9 టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు హుష్ కాకి!
టెక్నాలజీ సెక్టార్ ను ఈ 2017 కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఓ వైపు నుంచి కొత్త పెట్టుబడులు రాకపోవడం, మరోవైపు నుంచి అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాల్లో కీలక మార్పులు సంభవించడం దేశంలో చాలా స్టార్టప్ లకు, టెక్నాలజీ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. భారీగా ఉద్యోగాల కోత పెడుతున్న 9 టెక్నాలజీ కంపెనీలేమిటో ఓ సారిచూద్దాం... ఎయిర్ సెల్ : ఈ ఏడాది ఫిబ్రవరిలో సెల్యులార్ సర్వీసెస్ మేజర్ ఎయిర్ సెల్ తన ఉద్యోగుల్లో 700 మందికి పింక్ స్లిప్ లు ఇచ్చింది. అంటే తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించింది. దేశీయ టెలికమ్యునికేషన్ రంగంలో ఇదే తొలి ఉద్యోగాల కోత. దేశవ్యాప్తంగా ఎయిర్ సెల్ లో దాదాపు 8000 మంది ఉద్యోగులున్నారు. స్నాప్ డీల్: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న స్నాప్ డీల్ కూడా ఉద్యోగాల కోతకు సై అంటోంది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేని స్నాప్ డీల్ మెల్లమెల్లగా తన ఖర్చును తగ్గించుకోవడం కోసం ఉద్యోగులపై వేటు వేస్తోంది. అయితే ఈ కంపెనీ ఎంతమందిని ఉద్యోగులను తొలగిస్తుందో ప్రకటించనప్పటికీ, ఉద్యోగులను తొలగించడం మాత్రం తప్పనిసరి అంటూ ధృవీకరించేసింది. ఉద్యోగులను తొలగిస్తున్న వార్తలను ధృవీకరించిన అనంతరం కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ కూడా తమ జీతాలను వదులుకుంటున్నట్టు వెల్లడించారు. సంక్షోభంలో పడిపోయిన స్నాప్ డీల్ ను మళ్లీ పునఃస్థితికి తీసుకురావడానికి కంపెనీ సర్వశక్తుల ప్రయత్నిస్తోంది. యప్ మీ: ఫ్యాషన్ రీటైలర్ యప్మీ కూడా ఇటీవల క్వాలిటీ కంట్రోల్ టీమ్స్, వేర్ హౌజింగ్ లో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలిపింది. జనవరి నెలలో గరిష్ట స్థాయిలకు వెళ్లాలని ప్లాన్ చేశామని, కానీ పెద్ద నోట్ల రద్దు తమల్ని భారీగా దెబ్బతీసిందని యప్ మీ వ్యవస్థాపకుడు వివేక్ గౌర్ చెప్పారు. అమ్మకాలు పడిపోయినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ వెలుపల వ్యాపారాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. దీంతో దేశీయంగా ఉద్యోగుల సంఖ్యను కంపెనీ తగ్గిస్తోంది. క్రాఫ్ట్స్ విల్లా : సంప్రదాయ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్న క్రాఫ్ట్స్ విల్లా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేసింది. టెక్నాలజీ టీమ్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్ టీమ్స్ లో ఈ ఉద్యోగులను తొలగించినట్టు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. పేయూ: పేమెంట్ గేట్ వే పేయూ ఇండియా ఏకంగా తన కొత్త క్రెడిట్ కార్డు ప్రొడక్ట్ లాంచ్ ప్లానింగ్ నే వదులుకుంది. 85 మంది కాల్ సెంటర్ టీమ్ కు, 25 మంది కలెక్షన్ టీమ్ కు పింక్ స్లిప్ ఇచ్చేసింది. టోలెక్సో: ఇండస్ట్రియల్ మార్కెట్ ప్లే టోలెక్సో 50 మంది ఉద్యోగులకు రాంరాం చెప్పింది. అయితే 300 వరకు ఉద్యోగులను కంపెనీ తొలగించిందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. గిర్నార్ సాప్ట్ వేర్: కార్డెకో.కామ్, గాడి.కామ్, జిగ్వీల్స్.కామ్ సంస్థలను రన్ చేసే ఇంటర్నెట్ కంపెనీ గిర్నార్ సాప్ట్ వేర్ కూడా వ్యయాలను తగ్గించుకోవడానికి వ్యాపారాల పునరుద్ధరణ బాట పట్టింది. ఇటీవల 100 ఉద్యోగాలకు పైగా కోత పెట్టింది. వచ్చే క్వార్టర్లో లాభార్జించే కంపెనీగా నమోదుచేసే లక్ష్యంతో ఉద్యోగాలకు కోత పెట్టామని కంపెనీ చెబుతోంది. స్టేజిల్లా: చెన్నైకు చెందిన స్టేజిల్లా తన వ్యాపారాలను పూర్తిగా మూసివేసింది. కొత్త ఫండ్స్ ను సేకరించడానికి కష్టమవుతున్న ఈ కంపెనీ, మొత్తానికి మూతవేయడం మంచిదని భావించింది. ఈ కంపెనీ ఉద్యోగులు కూడా రోడ్డున్న పడ్డారు. లీఎకో: చైనీస్ బిలీనియర్ అయిన జియా యుఎటింగ్ కంపెనీ లీఎకో కూడా 85 శాతం ఇండియా స్టాఫ్ ను తొలగించేసింది. అంతేకాక ఇద్దరు అధికారులు కంపెనీ నుంచి వైదొలిగారు.