breaking news
CSIR NET
-
రద్దైన యూజీసీ-నెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ రద్దు చేసిన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌కు కొత్త షెడ్యూల్ వెలువడింది. పీహెచ్‌డీల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే యూజీసీ– నెట్‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొత్త తేదీలను ప్రకటించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 4 దాకా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని శుక్రవారం రాత్రి తెలిపింది. తొలుత జూన్ 18న యూజీసీ-నెట్‌ను నిర్వహించారు. అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో మరుసటి రోజు ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే వాయిదా పడ్డ సీఎస్ఐఆర్-యూజీసీ-నెట్‌ను జూలై 25 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. వాయిదా పడ్డ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎన్సీఈటీ)ని జూలై 10న నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. -
సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: సీఎస్ఐఆర్–యూజీసీ–నెట్ ఉమ్మడి పరీక్ష వాయిదా పడింది. వచ్చే వారం జరగాల్సిన ఈ పరీక్షను అనివార్య పరిస్థితులు, రవాణాపరమైన ఇబ్బందుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం తెలిపింది. పరీక్ష తదుపరి తేదీని వెబ్సైట్లో ప్రకటిస్తామని వివరించింది. అయితే, పేపర్ లీకైందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సీఎస్ఐఆర్–యూజీసీ–నీట్ పరీక్షను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్íÙప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తారు. మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్‌ను కూడా అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయడం తెల్సిందే. -
దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదా వేయండి
న్యూఢిల్లీ: యూజీసీ–నెట్, సీఎస్ఐఆర్–నెట్, ఇగ్నో పీహెచ్డీ, ఎన్సీహెచ్ఎం జేఈఈ, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష, ఐసీఏఆర్ తదితర పరీక్షలకుగాను దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదావేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్టీఏ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ గడువును మరో నెల రోజులపాటు వాయిదా వేయాలని పేర్కొంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సోమవారం ట్వీట్ చేశారు. (కరోనాకు 35,349 మంది బలి) చదవండి: కరోనాను మించిన భయం -
సీఎస్ఐఆర్ నెట్
ఒకే పరీక్ష.. బహుళ ప్రయోజనాలు దేశంలోనే ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలైన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ-హైదరాబాద్),ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ-హైదరాబాద్) తదితరాలతోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతి నెలా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పొందుతూ పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు మార్గం చూపే పరీక్ష.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఎస్ఐఆర్-యూజీసీ-నెట్). అంతేకాకుండా దేశవ్యాప్తంగా అధ్యాపక నియామక పరీక్షలకు అర్హత సాధించాలన్నా నెట్ రాయాల్సిందే. డిసెంబర్, 2016లో పరీక్ష నిర్వహించనున్నారు. తాజాగా దరఖాస్తు తేదీని పొడిగించిన నేపథ్యంలో పరీక్ష విధానం, ప్రిపరేషన్ వ్యూహాలు.. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల వరకు ఫ్యాకల్టీ కొరతను ఎదుర్కొంటున్నాయి. అత్యుత్తమ విద్య, పరిశోధనలకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో సీఎస్ఐఆర్ నెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు, యూనివర్సిటీల్లో లెక్చరర్ల నియామకం కోసం నిర్వహించే పరీక్షలకు అర్హత లభిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లు నిర్వహిస్తున్నా సీఎస్ఐఆర్ నెట్‌కు ఉన్నంత ప్రాధాన్యత వాటికి లేదు. అంతేకాకుండా లెక్చరర్ల నియామక పరీక్షల్లో విజయం సాధించినవారిలో మొదట సీఎస్ఐఆర్ నెట్ ఉత్తీర్ణులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అందరి దృష్టి సీఎస్ఐఆర్ నెట్‌పై ఉంది. పరీక్షాంశాలు మొత్తం ఐదు అంశాల్లో నెట్ నిర్వహిస్తారు. అవి.. కెమికల్ సెన్సైస్; ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సెన్సైస్; లైఫ్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్. అర్హత బీఎస్ (నాలుగేళ్ల కోర్సు)/బీఈ/బీటెక్/బీఫార్మా/ఎంబీబీఎస్/ఇంటిగ్రేటెడ్ బీఎస్- ఎంఎస్ఎమ్మెస్సీలో జనరల్, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) విద్యార్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు 50 శాతం మార్కులు వ చ్చి ఉండాలి. (లేదా) ఎంఎస్సీకి నమోదు చేసుకున్నవారు అర్హులే. వీరిని రిజల్ట్ అవెటైడ్ (ఆర్ఏ) కేటగిరీగా పరిగణిస్తారు. (లేదా) బీఎస్సీ (హానర్స్) ఉత్తీర్ణులు లేదా 55 శాతం మార్కులతో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ - పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందిన జనరల్, ఓబీసీ అభ్యర్థులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు) కూడా అర్హులే, అభ్యర్థులు జేఆర్ఎఫ్, లెక్చర్షిప్ల్లో ఏదో ఒకదానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి జేఆర్ఎఫ్ కోసం: జూలై 1, 2016 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఓబీసీ (నాన్ క్రిమిలేయర్), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, దివ్యాంగులకు వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంటుంది. లెక్చర్‌షిప్ కోసం: ఎలాంటి వయోపరిమితి లేదు. అదేవిధంగా జేఆర్ఎఫ్కు నిర్దేశించిన వయసు దాటినవారిని లెక్చర్షిప్నకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సీఎస్ఐఆర్-నెట్ స్కోర్‌కు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. పరీక్ష విధానం పరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల ఆధారంగా మొత్తం 200 మార్కులు ఉంటాయి. అన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నపత్రంలో మూడు భాగాలుంటాయి. అవి.. పార్ట్-ఎ: ఈ విభాగం అందరికీ కామన్. ఇందులో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, ఎనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్స్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ వంటి అంశాల్లో విద్యార్థి జనరల్ ఆప్టిట్యూడ్‌ను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఈ విభాగం నుంచి అడిగే 20 ప్రశ్నల్లో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం మార్కులు 30. పార్ట్-బి: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై ఉంటుంది. ఆయా సబ్జెక్టుల్లో అభ్యర్థికున్న పరిజ్ఞానాన్ని ప్రశ్నించే విధంగా కన్వెన్షనల్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. సిలబస్‌లోని అన్ని టాపిక్‌లకు సంబంధించిన ప్రశ్నలు ఈ విభాగంలో వస్తాయి. అయితే అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టును బట్టి ప్రశ్నల సంఖ్య మారుతుంది. ఇందులో సబ్జెక్టును బట్టి 20 నుంచి 35 ప్రశ్నలుంటాయి. ఈ విభాగానికి కేటాయించిన మొత్తం మార్కులు 70. పార్ట్-సి: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై ప్రశ్నలుంటాయి. ఆయా సబ్జెక్టులలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని, సబ్జెక్టుపై లోతైన విశ్లేషణను పరీక్షించే విధంగా, సమస్యపూరకమైన ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. అభ్యర్థి తనకున్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఇచ్చిన ప్రశ్నలను విశ్లేషించి, సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విభాగానికి కేటాయించిన మొత్తం మార్కులు 100. ప్రశ్నల సంఖ్య, వాటికిచ్చే మార్కులలో సబ్జెక్టులను బట్టి తేడా ఉంటుంది. నెగెటివ్ మార్కులు పరీక్షలో అన్ని విభాగాల్లోనూ తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి సరైన సమాధాలకు ఇచ్చే మార్కుల నుంచి 25 శాతం మార్కుల కోత విధిస్తారు. ఫెలోషిప్ జేఆర్ఎఫ్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.25,000 చెల్లిస్తారు. ఏడాదికి ఒకసారి కాంటిన్జెన్సీ గ్రాంట్‌గా రూ.20,000 అందిస్తారు. ఆ తర్వాత పరిశోధన ప్రగతి, ఇంటర్వ్యూ ఆధారంగా మూడో సంవత్సరంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) హోదా కల్పించి నెలకు రూ.28,000 చెల్లిస్తారు. జేఆర్ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు కలిపి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్ లభిస్తుంది. నెట్లో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన జేఆర్ఎఫ్ ఇవ్వరు. ప్రతి సబ్జెక్టుకు పరిమిత సంఖ్యలో ఫెలోషిప్లుంటాయి. ఉన్న జేఆర్ఎఫ్లు, వివిధ కేటగిరీలను దృష్టిలో ఉంచుకుని నెట్ పరీక్షలో అత్యంత ప్రతిభావంతులైనవారిని మాత్రమే జేఆర్ఎఫ్కు ఎంపిక చేస్తారు. డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్ సీఎస్ఐఆర్ నెట్ పరీక్షలో మంచి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ప్రత్యేక ఫెలోషిప్‌ను అందిస్తున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడంతోపాటు పరిశోధనలు చేసే విద్యార్థులను ప్రోత్సహించడం ఈ ఫెలోషిప్ ఉద్దేశం. దీనిద్వారా మొదటి రెండేళ్లు నెలకు రూ.29,000 స్టైఫండ్ ఇస్తారు. దీంతోపాటు ఏడాదికి రూ.70 వేల చొప్పున కాంటిన్జెన్సీ గ్రాంట్ కూడా అందిస్తారు. తర్వాత ప్రతిభ, తదితరాలను బట్టి మూడేళ్లపాటు నెలకు రూ.34 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. ప్రిపరేషన్ వ్యూహాలు పాత ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని పరిశీలించాలి. దీనివల్ల ప్రశ్నల స్థాయిపై అవగాహన ఏర్పడుతుంది. చాలామంది విద్యార్థులు కేవలం కోచింగ్ మెటీరియల్ చదువుతారు. అయితే దీనివల్ల ఉపయోగం ఉండదు. అకడమిక్ పుస్తకాలతోపాటు ప్రామాణిక రిఫరెన్స్ బుక్స్, మంచి కోచింగ్ సెంటర్ కూడా ముఖ్యమే. ప్రశ్నల శైలి మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. అభ్యర్థికి సబ్జెక్టుపై ఉన్న పట్టును తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. దీనికోసం సంబంధిత అకడమిక్ పాఠ్యపుస్తకాలను లోతైన విశ్లేషణతో చదవాలి. అదేవిధంగా రిఫరెన్స్ బుక్స్ చివరలో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించడం సాధన చేయాలి. మాదిరి ప్రశ్నల కోసం, గత ప్రశ్నపత్రాలు, ‘కీ’ సీఎస్ఐఆర్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మాదిరి ప్రశ్నలను సాధన చేస్తే అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు చేసే ప్రిపరేషన్ టీఐఎఫ్ఆర్, ఐఐఎస్సీ, జెస్ట్, ఐసీఏఆర్, ఐసీఎంఆర్, డీబీటీ-జేఆర్ఎఫ్, ఇతర పీహెచ్డీ ఎంట్రెన్స్‌లకు, బార్క్, డీఆర్డీఓ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ముందుగా సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం అభ్యర్థికి పావుగంట ముందుగానే ఇస్తారు. ఈ సమయంలో పార్ట్-సి విభాగంలో ఏ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరో తెలుసుకోవాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పూర్తిచేసి ప్రింటవుట్ తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లలో జనరల్ అభ్యర్థులు రూ.1000, ఓబీసీలు (నాన్ క్రిమిలేయర్) రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 పరీక్ష ఫీజు చెల్లించాలి లేదా నెఫ్ట్ ద్వారా ఏదైనా బ్యాంక్ నుంచి చెల్లించొచ్చు. ప్రింటవుట్ పంపాల్సిన చిరునామా డిప్యూటీ సెక్రటరీ (ఎగ్జామ్), ఎగ్జామినేషన్ యూనిట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గ్రూప్, సీఎస్ఐఆర్ కాంప్లెక్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎదురుగా, లైబ్రరీ ఎవెన్యూ, పూసా, న్యూఢిల్లీ - 110012. ముఖ్య తేదీలు ఫీజు చెల్లించడానికి చివరి తేది: సెప్టెంబర్ 16, 2016 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 17, 2016 ప్రింటవుట్ పంపడానికి చివరి తేది: సెప్టెంబర్ 23 పరీక్ష తేదీ: డిసెంబర్ 18, 2016 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు. వెబ్సైట్: www.csirhrdg.res.in -
రికార్డు సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థిని
హైదరాబాద్: ఓ పక్క రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(యూవోహెచ్) వివాదాలకు వేదికగా మారి చర్చనీయాంశంకాగా.. అదే వర్సిటీ, అందులోని విద్యార్థులు విద్యాపరంగా రికార్డులను సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జాతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల సరసన చేరిన ఈ వర్సిటీ అంతే స్థాయిలో ఉత్తమ విద్యార్థులను కూడా అందించగలదని నిరూపించింది. అవును.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీ ప్రసూన అనే ఇంటిగ్రేటెడ్ విద్యార్థి సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో ఆలిండియా నంబర్ 1 ర్యాంకును సాధించి రికార్డు సృష్టించింది. స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిక్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ విద్యార్థిగా అడుగుపెట్టి ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లో ఉన్న ఆమె 200 మార్కులకుగాను 158 మార్కులు సాధించింది. వచ్చే జూలై నెలలో ఆమె టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) లో పీహెచ్డీ ప్రవేశం పొందనుంది. ముందునుంచే పుస్తకాలంటే ఎంతో మక్కువ చూపే ప్రసూన ప్రతి అకాడమిక్ ఇయర్లో రాణించేందుకు తోటి విద్యార్థులతో మమేకమవుతూ ప్రణాళిక బద్దంగా చదివినట్లు తెలిపింది. తన డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు, వర్సిటీ అందించిన సహకారం ఎంతో గొప్పదని కొనియాడింది. వర్సిటీలో బోధన, పరిశోధన ఎంతో ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడింది. పరిశోధన రంగంవైపు వెళ్లేందుకే తాను ఈ వర్సిటీని, ఈ కోర్సును ఎంచుకున్నట్లు వివరించింది.