క్రికెట్ అంటే ఏపీ గుర్తురావాలి: చంద్రబాబు
అమరావతి: రాజధాని ప్రాంతంలోని మూలపాడులో రెండు క్రికెట్ స్టేడియాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ అంటే ఆంధ్రానే గుర్తుకు రావాలని ఆకాంక్షించారు. అడ్వెంచర్ స్పోర్ట్సుకు అమరావతి అనుకూలమైనదంటూ ఇలాంటి గ్రౌండ్స్ ప్రపంచంలో ఎక్కడా లేవని, ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్‌గా ఉండడం మనకు గర్వకారణమని ఆయన అన్నారు. మూలపాడు గ్రౌండ్‌కు చుక్కపల్లి పిచ్చయ్య గ్రౌండ్‌గా, మరో గ్రౌండ్‌కు దేవినేని వెంకటరమణ-ప్రణిత పేరును ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నామకరణం చేసింది.