breaking news
Court ban
-
ఇదే చివరి చిత్రమని ప్రకటించిన టాప్ హీరో.. నోటీసులు పంపిన నిర్మాత
కోలీవుడ్‌లో 'మామన్నన్' చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించి, రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంజల్ చిత్ర నిర్మాత రామశరవణన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్లో తాను ఉదయనిధి స్టాలిన్, ఆనంది, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా ఏంజెల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నానన్నారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) కేఎస్.అదయమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యిందని, మరో 20 శాతం చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాగా ఉదయనిధి స్టాలిన్ తన చిత్రాన్ని పక్కనపెట్టి మామన్నన్ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యారన్నారు. అంతేకాకుండా మామన్నన్ తన చివరి చిత్రం అని ప్రకటించారన్నారు. తాను ఏంజెల్ చిత్రం కోసం ఇప్పటి వరకు రూ.13 కోట్లు ఖర్చుపెట్టానని తెలిపారు. తాను చిత్రం పూర్తి కాకపోతే చాలా నష్టపోతానన్నారు. (ఇదీ చదవండి: రోజుకు వెయ్యిమందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్: చిరంజీవి) కాబట్టి మామన్నన్ చిత్రం విడుదలపై నిషేధం విధించి తన చిత్రాన్ని పూర్తిచేయాల్సిందిగా ఉదయనిధి స్టాలిన్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి కుమరవేల్ బాబు సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో ఈ కేసుపై విచారణ కోరుతూ ఉదయనిధి స్టాలిన్‌కు, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు నోటీసులు జారీ చేసి తర్వాత విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు. -
మరిన్ని డాక్యుమెంట్లు ప్రచురించబోం
స్కార్పిన్ సమాచారం లీక్‌పై ది ఆస్ట్రేలియన్ మెల్బోర్న్: కోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో భారత్‌కు చెందిన స్కార్పిన్ తరగతి జలాంతర్గాముల అత్యంత రహస్య సమాచారాన్ని ఇకపై తాము ప్రచురించబోమని ‘ది ఆస్ట్రేలియన్’ దినపత్రిక మంగళవారం స్పష్టం చేసింది. పత్రిక వెబ్‌సైట్‌లోని డాక్యుమెంట్లను వెంటనే తీసివేయాలని, పూర్తి సమాచారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్ సంస్థకు అందజేయాలని వేల్స్‌లోని సుప్రీం కోర్టు ‘ది ఆస్ట్రేలియన్’కు సోమవారం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఫ్రాన్స్ సంస్థ డీసీఎన్ఎస్ వేసిన అఫిడవిట్ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంటూ గురువారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది. పత్రిక ఇలాంటి సమాచారాన్ని ప్రచురించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో తమ కంపెనీ పరువు, పేరు దెబ్బతినే అవకాశం ఉందని అఫిడవిట్లో డీసీఎన్ఎస్ పేర్కొంది. కాగా తమ వద్ద పెద్దమొత్తంలో డాక్యుమెంట్లు ఉన్నా అన్నింటిని ప్రచురించలేదని, ఇకపై ఎలాంటి సమాచారాన్ని ప్రచురించబోమని ఆస్ట్రేలియన్ పత్రిక అసోసియేట్ ఎడిటర్ కామెరాన్ స్టీవర్ట్ పేర్కొన్నారు. ఫ్రాన్స్ సహకారంతో భారత్ సుమారు రూ.24 వేల కోట్లతో ఆరు జలాంతర్గాములను నిర్మిస్తున్న విషయం విదితమే.