పత్తి సేకరణ మెరుగ్గానే ఉంది
ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు మెరుగ్గా జరుగుతున్నదని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు 54.81 లక్షల పత్తి బేళ్లు రాగా అందులో 36.89 లక్షల బేళ్లను సీసీఐ కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. అయితే విదేశాల కంటే భారత్లో పత్తి ధర ఎక్కువ పలకడం లేదని ఆయన వివరించారు.