breaking news
corporator
-
డబ్బు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను.. కూటమికి కార్పొరేటర్ శశికళ కౌంటర్
-
‘చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ మానుకో’
సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబు చీఫ్ పాలిట్రిక్స్ మానుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హితువు పలికారు. రాష్ట్రంలో విశాఖ మున్సిల్ కార్పొరేషన్‌పై కూటమి కుట్ర రాజకీయాలు తెరతీసింది.ఈ తరుణంలో కూటమి కుట్రా రాజకీయాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.. మరి వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన కార్పోరేటర్లు, నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి. పార్టీ మారమని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రలోభాలతో ముగ్గురు నలుగురు కార్పొరేటర్లను చేర్చుకోవాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలి. చంద్రబాబు చీఫ్ పాలిట్రిక్స్ చేయడం మానుకోవాలి. వైఎస్ జగన్‌పై కార్పొరేటర్లకు విడదీయరాని అనుబంధం ఉంది. కార్పొరేటర్లకు సముచిత స్థానం పార్టీలో ఉంటుంది. మా కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తే సహించేది లేదు. అధికారం శాశ్వతం కాదు. మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తులో అసలైన రాజకీయం వారికి చూపిస్తాం. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. మరి వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన కార్పోరేటర్లు, నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి’అని సూచించారు. -
సీతాఫల్మండి బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ రిసెప్షన్లో కేటీఆర్ (ఫోటోలు)
-
బీఆర్ఎస్ యువ కార్పొరేటర్ హేమ సామల వివాహ వేడుకలో ప్రముఖుల సందడి (చిత్రాలు)
-
కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి.. ఇదీ ఓ గెలుపేనా!
-
జనసేన కార్పొరేటర్ పై టీడీపీ కార్యకర్త దాడి
-
కష్టం కార్పొరేటర్‌ది.. ప్రచారం ఎమ్మెల్యేది
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేటర్లు కౌన్సిల్లో శాంక్షన్ చేయించిన పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తానే చేయించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు ఆ పనులను మంజూరు చేయించిన కార్పొరేటర్ల ప్రమేయం లేకుండా ప్రచారం కోసం టెంకాయలు కొట్టి శంకస్థాపనలు చేస్తుంటే ఇదేమీ చోద్యం అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇలా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత ప్రభుత్వంలో మంజూరైన నిధులకు సంబంధించిన పనులకు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తూ అంతా తన ఘనతే అంటూ ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తుంది. ఇవే నిదర్శనం.. మూడో డివిజన్లోని రామచంద్రానగర్, నాగార్జున నగర్లో రోడ్లు నిర్మాణం కోసం ఎన్నికలకు ముందుకు కౌన్సిల్లో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, కో ఆప్షన్ సభ్యుడు ముసునూరు సుబ్బారావు ప్రతిపాదనలు పెట్టారు. ఆ పనులను అడ్డుకునేందుకు టీడీపీ వాళ్లు ప్రయత్నం చేయగా, కార్పొరేటర్, కో ఆప్షన్ సభ్యుడు పట్టుబట్టి వాటిని మంజూరు చేయించారు. ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్లి, ఆ పనులకు శంకుస్థాపన చేసి అంతా తన ఘనతే అని చెప్పుకుంటున్నారు. నాల్గవ డివిజన్ ఎనీ్టఆర్ కాలనీలో 2021లో పార్కు, జిమ్‌ను ప్రారంభించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో, నాటి కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. వాటిని మళ్లీ ఇటీవల ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెళ్లి రిబ్బన్ కట్ చేశారు. ఒకసారి ప్రారంభించిన పనిని మళ్లీ ప్రారంభించడం ఏమిటనీ ఆ ప్రాంత వాసులు నవ్వుకున్నారు. అంతేకాదు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. అవన్నీ ఎన్నికల కోడ్ సందర్భంగా నిలిచిపోయాయి. వాటన్నింటికి శంకుస్థాపనులు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు నాసిరకంగా కొంతమేర రిటైనింగ్‌వాల్ నిర్మించి, రిటైనింగ్ వాల్ ఘనత తమదే అంటూ ప్రచారం చెప్పుకోవడం విశేషం. తూర్పు నియోజకవర్గంలో 2014–19 కాలంలో కూడా కార్పొరేటర్లు చేసిన పనులను తానే చేసినట్లు చెప్పుకుంటున్నారని నాడు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా ప్రచారం చేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. నాడు అడ్డుకున్నారు.. నాగార్జున నగర్, రామచంద్రానగర్లలో రోడ్ల నిర్మాణం కోసం కౌన్సిల్లో పెడితే టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కానీ పట్టుబట్టి ఆమోదం చేయించాం. ఇప్పుడు మాకు చెప్పకుండా శంకుస్థాపన చేసి, వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. తాను కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత డివిజన్లో రూ.25 కోట్లతో అభివృద్ధి చేశాం. అంతా కళ్లకు కనిపిస్తుంది. ఎవరు అభివృద్ధి చేశారో కూడా ప్రజలకు తెలుసు. గత ప్రభుత్వంలో దేవినేని అవినాష్ సహకారంతోనే అభివృద్ధి చేయగలిగాం. – భీమిశెట్టి ప్రవల్లిక, 3వ డివిజన్ కార్పొరేటర్ -
రాజకీయ కక్షతోనే YSRCP కార్పొరేటర్ సురేష్ పై రౌడీషీట్
-
రూ.30 కోట్లతో చీటీల నిర్వాహకులు పరార్!
అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం): విశాఖ గాజువాకలో టీడీపీ కార్పొరేటర్ ముఖ్య అనుచరుడు చీటీల పేరిట సుమారు 500 మందిని రూ. 30 కోట్లకు ముంచేసిన వైనం బయటపడింది. అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా జీవితాన్ని మొదలెట్టి, భారీ మొత్తంలో చీటీలు కట్టించిన అతను.. చివరకు కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు శుక్రవారం గాజువాక పోలీసుల్ని ఆశ్రయించారు. ఏసీపీ త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక వాంబే కాలనీకి చెందిన మరడాన పరశురాం 65వ వార్డు టీడీపీ కార్పొరేటర్ బొడ్డు నర్సింహ పాత్రుడు(కేబుల్ మూర్తి)కి ముఖ్య అనుచరుడు. పరశురాం 12 ఏళ్ల క్రితం అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత చిన్నచిన్న చీటీలు ప్రారంభించాడు. వాటిని నెమ్మదిగా పెంచుకుంటూ రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 25 లక్షల వరకు తీసుకువెళ్లాడు. నమ్మకంగా ఉండటంతో ఎక్కువ మంది ఇతని వద్దే చీటీలు వేసేవారు. ఈ చీటీల నిర్వహణలో పరశురాంతో పాటు భార్య కుమారి, అన్నయ్య సత్తిబాబు, వదిన జ్యోతి, మేనల్లుడు ధనుంజయ్, అక్క చంద్ర, మామయ్యలు పాలు పంచుకొనేవారు. దీంతో పాటు పప్పుల చీటీలు, వరలక్ష్మీ వ్రతం కార్డులు, కిరాణా లక్కీ డ్రాలు వంటి స్కీములను కూడా నడిపారు. ఇటీవలి కాలంలో చీటీలు, స్కీముల పేరుతో అందరి నుంచి రూ. 30 కోట్ల వరకు వసూలు చేసి, పరారయ్యారు. ఈ విషయం శుక్రవారం బయటపడటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.లక్షల్లో నష్టపోయినట్లు పలువురు బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంత మొత్తమో నిర్ధారించి, శనివారం కేసు నమోదు చేస్తామని ఏసీపీ త్రినాథ్ తెలిపారు. -
చిరు వ్యాపారులపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రతాపం
-
HYD: బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్య రావుపై కొందరు మహిళలు దాడి చేశారు. వారి దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై దేదీప్య రావు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కొందరు మహిళలు దాడి చేశారు. ఆమె కారులో వెళ్తుండగా అడ్డుకున్న సదరు మహిళలు దేదీప్య రావుపై దాడికి దిగారు. దీంతో, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, తన భర్త విజయ ముదిరాజ్తో కలిసి దేదీప్య రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మాగంటి గోపినాథ్ అరాచకాలు ఎక్కువయ్యాయంటూ స్థానిక మహిళలు ఆరోపలు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. #Hyderabad: Jubilee Hills BRS Corporator Attacked Over Flex Controversy Dedeepya Rao, #BRSParty corporator from Vengala Rao Nagar, faced assault by women amid a dispute over flexes. She & her husband Vijay Mudiraj filed a complaint with the Jubilee Hills police. pic.twitter.com/dE7nLpd5cr — Informed Alerts (@InformedAlerts) March 13, 2024 -
‘ఐలా’పై కార్పొరేటర్ ‘కాకి’ వీరంగం
విశాఖపట్నం: కాకి గోవిందరెడ్డి వివాదస్పద కార్పొరేటర్. 69వ వార్డు నుంచి ఎన్నికైన ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేయడం..బెదిరింపులకు పాల్పడడం నైజం. తాజాగా ఆటోనగర్‌లో ఐలా చైర్మన్ కె.సత్యనారాయణరెడ్డి (రఘు)పై అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కాకిగోవిందరెడ్డి ఆయన అనుచరులపై పారిశ్రామిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా... శుక్రవారం రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాఽథ్ చేతుల మీదుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగాల్సి ఉంది. మంత్రితో ప్రారంభోత్సవం చేయాల్సిన శిలాఫలకానికి పక్కనే మరో శిలాఫలకాన్ని ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అటు పారిశ్రామిక వేత్తలు, ఇటు కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి, అతని అనుచరులు హాజరయ్యారు. తన అనుమతి లేకుండా శిలాఫలకం ఎలా ఏర్పాటు చేస్తారని కాకి గోవిందరెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఐలా చైర్మన్ కె.సత్యనారాయణ రెడ్డి (రఘు)పై అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పలువురు పారిశ్రామిక వేత్తలు కార్పొరేటర్ వర్గాన్ని నిలువరించేందుకు యత్నించారు. జరిగిన ఘటనతో అవమానకరంగా భావించిన పారిశ్రామిక వేత్తలు మూకుమ్మడిగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగకముందే వెళ్లిపోయారు. కార్పొరేటర్‌తో పాటు అతని అనుచరుల తోపులాటలో ఇద్దరు పారిశ్రామివేత్తలకు స్వల్పగాయాలయ్యాయని ఐలా చైర్మన్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. తాము ఎప్పుడూ గ్రామస్తుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆర్ఓబీ పనుల ప్రారంభాన్ని త్వరతగతిన చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఒక ప్రజా ప్రతినిధిగా కార్పొరేటర్ ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని ఐలా చైర్మన్ రఘుతో పాటు పారిశ్రామిక వేత్తలు, ఐలా ప్రతినిధులు మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఐలా ప్రతినిధులు గాజువాక పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని సీఐ శ్రీనివాసరావుకు చెప్పారు. దీంతో కాకి గోవిందరెడ్డిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఐలా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పించారు. -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్‌గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్‌గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్‌గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్‌నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్‌గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్‌కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్‌యాదవ్ కార్పొరేటర్‌గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్‌యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్‌లో 2014లో గోపాల్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్‌రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్‌పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్‌పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్‌హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్‌అలీ, మాజిద్ హుస్సేన్‌లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్‌రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్‌లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్‌నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
ఒక పార్టీనుంచి గెలిచి.. మరో పార్టీ నుంచి పోటీ చేయొచ్చు
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు టికెట్లు లభించాయి. వీరిలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఇటీవలే బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి చాలాకాలం క్రితమే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్లుచింది. పోటీ చేసేందుకు వీరు తమ కార్పొరేటర్ల పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచే టికెట్ పొందిన జీహెచ్ఎంసీని ఆనుకునే ఉన్న మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ సైతం చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిన పనిలేదు. ఆయన పార్టీ కూడా మారలేదు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారినా, మారకపోయినా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా కొనసాగుతున్న వారు ఎమ్మెల్యే వంటి ఇతర పదవులకు పోటీ చేయడానికి ముందే తమ పదవులకు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. మున్సిపల్ యాక్ట్, నియమ నిబంధనల మేరకు స్థానిక సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న వారు రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యే, ఇతరత్రా పదవులకు పోటీ చేయవచ్చని మున్సిపల్ చట్టాల నిపుణులు తెలిపారు. పోటీ చేసి, గెలిచాక మాత్రం పాత పదవిని వదులుకోవాల్సి ఉంటుందన్నారు. ఏకకాలంలో రెండు పదవుల్లో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఓడిపోతే పాత పదవిలోనే యథాతథంగా కొనసాగవచ్చు. కార్పొరేటర్లకు వర్తించదు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించే ఎమ్మెల్యేల విషయంలోనే సవ్యంగా అమలు కావడం లేదు. ఆ చట్టం ఉన్నప్పటికీ దాని వల్ల ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఇక ఎలాంటి చట్టమూ లేని కార్పొరేటర్లకు ఎలాంటి నిబంధనలు వర్తించవు. పార్టీలు మారితే ఆమేరకు పాత పారీ్టకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. – పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక్క పదవిలోనే ఉండాలి జీహెచ్ఎంసీ యాక్ట్‌లోని సెక్షన్ 5–డి మేరకు కార్పొరేటర్ కంటే ఉన్నతమైన పదవిని పొందినవారు పదిహేను రోజుల్లోగా తాను కొత్త పదవిలో చేరనున్నట్లు కమిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఆయనకు కార్పొరేటర్ పదవి రద్దవుతుంది. ఎమ్మెల్యే పదవనే కాదు.. మరే ఇతర పదవైనా సరే రెండో పదవిలో ఉండటం చెల్లదు. ఏకకాలంలో ఒకే పదవిలో మాత్రమే ఉంటారు. ఎమ్మెల్యేగా పోటీచేసేవారు గెలవని పక్షంలో యథావిధిగా తమ కార్పొరేటర్ పదవిలో కొనసాగవచ్చు. సాంకేతికంగానూ ఎలాంటి విధివిధానాలంటూ లేవు. – జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారి మారిన వారెందరో.. జీహెచ్ఎంసీలో ఇప్పటికే పలువురు పారీ్టలు మారారు. ఆమేరకు వారు సాంకేతికంగా ఆచరించాల్సిన విధానాలంటూ ఏమీ లేకపోవడంతో సర్వసభ్య సమావేశాలప్పుడు మాత్రం మారిన పార్టీ సభ్యులతో కలిసి కూర్చుంటున్నారు. అంతకుమించి పాటించిన విధానాలేమీ లేవు. -
నాన్ లోకల్ అభ్యర్థిని మాపై రుద్దుతారా?
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఎంత కాలమైనా పల్లకీ మోసే బోయీలుగానే మిగిలిపోవాలా.. నాయకత్వ పగ్గాలు పుచ్చుకునే అర్హత మాలో ఎవరికీ లేదా.. నాన్ లోకల్ అభ్యర్థిని మాపై రుద్దుతారా’ అని కడప టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పని చేస్తామని, మాలో ఒకరికి టికెట్ కేటాయించాలని కోరుతూనే, నాన్‌లోకల్ అభ్యర్థికి సహకరించబోమని తెగేసి చెబుతున్నారు. వెరసి తెలుగుతమ్ముళ్ల మధ్య ఉన్న కోల్డ్‌వార్ తెరపైకి వచ్చింది. ఇన్చార్జితో ప్రమేయం లేకుండా ఆ ముగ్గురు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా చంద్రబాబు విడుదల కావాలని దేవునికడప శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. టీడీపీ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి తన కోడలు, కార్పొరేటర్ ఉమాదేవికి నియోజకవర్గ ఇన్చార్జి అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. ఆ స్థానంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవీరెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు. అప్పటికే పలుమార్లు అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై స్థానికులకు అవకాశం కల్పించాలని కడప నేతలు కోరారు. గతంలో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన దుర్గాప్రసాద్, అమీర్‌బాబుకు అవకాశం కల్పించాలని, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే కార్పొరేటర్ ఉమాదేవికి ఇన్చార్జి పదవి ఇవ్వాలని విన్నవించారు. మాలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు. వీరి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డికి కడప పట్టం కట్టడాన్ని.. ఆ ముగ్గురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుంటే సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. అభ్యర్థిగా స్థానికులనే నిర్ణయించాలని కడప గడపలో తెలుగు తమ్ముళ్లు పట్టుబట్టుతున్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రమేయం లేకుండా నాన్‌లోకల్ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికల్లో ఏమి చేయగరలని వాదిస్తున్నారు. అదే విషయాన్ని అధినేత చంద్రబాబుకే తేల్చి చెప్పామని టీడీపీ విజయం సాధించాలంటే లోకల్ వారిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్చార్జి మాధవీరెడ్డితో కలిసి పని చేసే పరిస్థితే లేదని తేల్చి చెబుతున్నారు. ఆ మేరకు ఆమెతో ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ చేపట్టారు. ఈ వ్యవహారం వినాయక ఉత్సవాల నుంచి కొనసాగుతోంది. టీడీపీ నేతలు లక్ష్మీరెడ్డి, దుర్గాప్రసాద్, అమీర్‌బాబు ముగ్గురు కలిసికట్టుగా వినాయక మండపాలను సందర్శిస్తూ పూజలు చేపట్టారు. మాధవీరెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండిపోయారు. తాజాగా ఆదివారం ఆ ముగ్గురు నేతలతోపాటు మరి కొందరు డివిజన్లు ఇన్చార్జిలతో కలిసి దేవునికడపలో 101 టెంకాయలు కొట్టారు. సోమవారం నుంచి పాతబస్టాండ్ సమీపంలో నిరసన టెంట్ ఏర్పాటు చేసి, వేరుగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. లోకల్ నాయకుల్ని అందర్నీ కలుపుకొని కార్యక్రమాలకు వెళ్లాలనే దిశగా ఆ ముగ్గురు అడుగులు వేస్తున్నారు. నాన్ లోకల్ అభ్యర్థికి ఇప్పటి నుంచే పోటీగా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. వాసు ఏకపక్ష వైఖరి సహించం ‘టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా అందర్నీ కలుపుగోలుగా వెళ్లలేదు. పొలిట్‌బ్యూరో సభ్యుడు జిల్లాలోని టీడీపీ నేతల మన్ననలు పొందలేదు. పైగా వర్గ విభేదాలకు ఆస్కారం ఇచ్చేలా చర్యలుండిపోయాయి. వాసు ఏకపక్ష వైఖరి నేపథ్యంలో అభ్యర్థిగా మాధవీరెడ్డి నియామకాన్ని అడ్డుకునే చర్యలకు దిగినట్లు’ ఆ ముగ్గురు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఆమెకే టీడీపీ టికెట్ కేటాయిస్తే ఓడగొట్టి తీరుతామని ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని కార్యకర్తలకు, ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. -
46 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి సరిత విజయం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 39వ డివి జన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాత ఫలితమే పునరావృతమైంది. ప్రస్తుత కార్పొరేటర్, బీఆ ర్ఎస్ అభ్యర్థి కొండపల్లి సరిత 46 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్ ఓట్ల రీకౌంటింగ్ నిర్వహించగా, అభ్యర్థులంతా గత ఓట్లనే సాధించారు. 2020 జనవరిలో జరిగిన నగరపాలకసంస్థ ఎన్నికల్లో 39వ డివిజన్‌కు సంబంధించి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కొండపల్లి సరిత 46 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి వూట్కూరి మంజుల భార్గవిపై విజయం సాధించారు. అయితే బ్యాలెట్ పత్రాలు తారుమారాయ్యాయని, మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని మంజుల భార్గవి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టులో 39వ డివిజన్ ఎన్నికల ఓట్ల లెక్కింపును తిరిగి చేపట్టారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఓట్ల లెక్కింపు కొనసాగింది. జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో న్యాయవాది, ప్రభుత్వ ఉద్యోగులు, నగరపాలకసంస్థ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లు ఓపెన్‌చేసి ఓట్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపులో 2020 జనవరి ఎన్నికల్లో వచ్చిన తరహాలోనే అభ్యర్థులు ఓట్లు సాధించారు. ఓట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో కొండపల్లి సరితను విజేతగా జిల్లా న్యాయమూర్తి ప్రకటించారు. ధర్మమే గెలిచింది రీ కౌంటింగ్‌లోనూ ధర్మమే గెలిచింది. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా జరిగాయి. ప్రజలు మాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావు సహకారంతో డివిజన్ సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. – కొండపల్లి సరిత, కార్పొరేటర్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు అన్నమనేని నిహారిక (బీజేపీ) 466 కొండపల్లి సరిత (బీఆర్ఎస్) 876 జ్యోతి ఉప్పుగండ్ల (కాంగ్రెస్) 31 కోట శారద (స్వతంత్ర) 120 మంజుల భార్గవి వూట్కూరి (స్వతంత్ర) 830 సునీత గూడ(స్వతంత్ర) 49 ఫలితం: 46 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కొండపల్లి సరిత గెలుపు 39వ డివిజన్ ఓట్ల వివరాలు మొత్తంఓట్లు 3,898 పోలైనవి 2,401 చెల్లనివి 18 నోటా 11 -
Hyderabad: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా?.. కార్పొరేటర్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా.. అంటూ జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి దాడి చేసి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డిపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత శనివారం రాత్రి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది పల్లేమోని వెంకటేశ్ తోటి సిబ్బందితో కలిసి ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. కెప్టెన్ కుక్ హోటల్ వద్ద కార్పొరేటర్ జీవన్‌రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగిస్తుండగా అటుగా వచ్చిన కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి అతని అనుచరులు వచ్చి మా ప్లెక్సీలనే తొలగిస్తారా అంటూ బూతులు తిడుతూ వెంకటేశ్ తోటి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే తన ఫ్లెక్సీలు తొలగించారని కార్పొరేటర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు వారాలుగా ఉన్నా పట్టించుకోని సిబ్బంది కేవలం విపక్ష నాయకుల ఫ్లెక్సీలను తొలగించడం వెనుక బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందన్నారు. తాను సిబ్బందిపై ఎలాంటి దాడి చేయలేదన్నారు. చదవండి: Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ -
రెచ్చిపోయిన జనసేన కార్పొరేటర్.. ఫ్లెక్సీలను చించివేస్తూ..
సాక్షి,ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో జనసేనకు చెందిన కార్పొరేటర్, ఇతర నాయకులు సోమవారం తీవ్రంగా రెచ్చిపోయారు. నగరంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేస్తూ గందరగోళం సృష్టించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి, చర్చి సెంటర్, ఇతర ప్రధాన కూడళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని చూసి రెచ్చిపోయిన జనసేన నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా పలుచోట్ల వివాదానికి దిగారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తొలగించాలంటూ పోలీసులతో అడ్డగోలుగా వాదించారు. చర్చి సెంటరుకు చేరుకున్న జనసేన కార్యకర్తలు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారు. జనసేనకు చెందిన 38వ డివిజన్ కార్పొరేటర్ మునగాల రమేష్ కర్నూలు రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. అక్కడ ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న పోలీసులు వారిస్తున్నా వినలేదు. దాంతో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత వదిలేశారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేసిన రమేష్ పై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. చదవండి: కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు! -
ఒంటరిగా ఉన్నపుడు ఎమ్మెల్యే ఇంకేం చేస్తాడో అని భయమేస్తుంది
-
బీఆర్ఎస్లో విభేదాలు.. బయటపడ్డ ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వార్
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేట అధికార బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వివాదం మరింత ముదిరింది. మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వ్యాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు, అనుచరులు రోడ్డు మీదనే ఘర్షణకు దిగారు. అయితే కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే వెంకటేష్ చేయి చేసుకున్నారని ఆమె వర్గం ఆరోపిస్తుంది. మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే తనను నెట్టుకుంటూ వెళ్లాడని కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అంతేగాక గత కొంత కాలం నుంచి నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో తనను ఆహ్వానించడం లేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో కూడా తమను అవమానించేలా ఎమ్మెల్యే వ్యవహరించారని అన్నారు. -
ఆప్, బీజేపీ కౌన్సిలర్ల బాహాబాహీ
-
మరీ.. ఇంత దారుణమా.. రాత్రికి రాత్రే కూల్చేశారు..
సాక్షి, హైదరాబాద్: ‘అర్ధరాత్రి మిడతల దండులా మా ఇళ్ల మీద పడ్డారు. ఇంట్లోవాళ్లని బయటకు లాగి, సామాన్లను బయటపడేసి ఇండ్లు కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలాగే ఉన్నాయి. ఇంటిలోపల ద్విచక్రవాహనాలు కూడా ఉన్నాయి. ఇళ్లు మొత్తం నేలమట్టం చేసి రోడ్డునపడేశారు. మేము ఎక్కడకు వెళ్లాలి.. మా ఉసురు తగులుతుంది’.. అని ఎర్రమంజిల్ వాసులు అధికారులపై దుమ్మెత్తిపోశారు. ఎర్రమంజిల్ రవీంద్రనికేతన్ పాఠశాల సమీపంలో ఉన్న సుమారు 30 ఇళ్లను మంగళవారం అర్ధరాత్రి వందలకొద్ది రెవెన్యూ, జీహెచ్ఎంపీ, పోలీస్, ఆర్అండ్బీ అధికారులు వచ్చి కూల్చివేశారు. 50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. ప్రభుత్వం జీవో నెంబర్ 58 కింద మాకు పట్టాలు కూడా ఇచ్చింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మాకు ప్రత్యామ్యాయం ఏమీ చూపకుండా ఎలా కూల్చేవేస్తారని అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. బుధవారం బాధితులంతా కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం నంండి సంబంధిత అధికారులందరికీ నోటీసులు పంపించారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రెవెన్యూ అధికారులు వచ్చి అరగంటలో ఇండ్లు ఖాళీ చేయాలని కూల్చివేస్తామని వారికి చెప్పడంతో సమాచారం అందుకున్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి అక్కడకు వచ్చి వారికి మద్దతుగా అక్కడే బైఠాయించించారు. సాయంత్రం వరకు అక్కడే ఆమె ఉన్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకేసారి వందల కొద్ది పోలీసులు నలుగురు తహశీల్దార్లు, ఆర్డీవో, పెద్దెత్తున రెవెన్యూ అధికారులు అక్కడకు వచ్చి ప్రతీ ఇంట్లోకి వెళ్లడం అక్కడ కరెంట్ తీసేయ్యడం, ఇంట్లో ఉన్నవారిని బయటకు లాగి, చేతికి దొరికిన సామాన్లు బయటపడేసి రెండు జేసీబీలతో ఇండ్లు మొత్తం కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలానే ఇంట్లోనే కూరుకుపోయాయి. చాలా ఇండ్లల్లో పెట్టుకున్న ద్విచక్రవాహనాలు కూడా మట్టిలోనే కూరుకుపోయాయి. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ విజయారెడ్డి అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో అక్కడకు వచ్చి వారిని అడ్డుకునేందుకు యత్నించించారు. అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు, కొంతమంది బాధితులు, విజయారెడ్డి అనుచరులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరీ.. ఇంత దారుణమా అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో మేము గాఢ నిద్రలో ఉన్నాము. తలుపులు తట్టగా బయటకు వచ్చేసరికి 40 మంది ఉన్నారు. బయటకు రావాలి.. ఇళ్లుకూల్చేస్తున్నామని ఒకరు మాట్లాడుతుంటేనే మరొకరు కరెంట్ కట్‌చేశారు. మరొకరు టార్చ్‌లైట్ తీసుకుని నన్ను బయటకు ఈడ్చేశారు. మా బాబు ఉన్నాడు అని చెబితే మరొకరు వెళ్లి ఐదునెలల తన బాబును తీసుకువచ్చి నా చేతిలో ఉంచి ఇల్లు కూల్చేశారు.మరీ ఇంత దారుణమా. – శిరీష కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు ఇంట్లో పెద్దవారి మందులు ఉన్నాయి. పిల్లల పుస్తకాలు ఉన్నాయి వాటిని తీసుకుంటామన్నా వినలేదు. మాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రత్యామ్యాయం చూపకుండా బయటకు గెంటేస్తే ఎలా జీవో 58 ప్రకారం మాకు పట్టా కూడా ఇచ్చారు. – మల్లీశ్వరి రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లోనే మహిళా కార్పొరేటర్ ఎర్రమంజిల్ కాలనీ రామకృష్ణానగర్‌లో ఇళ్లు కూల్చడాన్ని అడ్డుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పి.విజయారెడ్డిని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అరెస్టుచేసి స్టేషన్‌కు ఎస్ఆర్ నగర్ స్టేషన్‌తీసుకెళ్లారు. ఆమెను బుధవారం ఉదయం 10 గంటల తరువాత వదిలి పెట్టారు. మహిళ అని చూడకుండా తనను రాత్రంతా స్టేషన్లో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుంతరావు పరామర్శించారు. -
గుడిమల్కాపూర్ కార్పొరేటర్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ (55) హఠాన్మరణం చెందారు. గురువారం రాత్రి ఇంట్లో మనవడితో ఆడుకుంటూ ఉల్లాసంగా ఉన్న కరుణాకర్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి కిందపడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను అంబులెన్స్‌లో సిటీన్యూరో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించి చికిత్స అందించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతదేహాన్ని గుడిమల్కాపూర్‌లోని స్వగృహంలో ఉంచగా పార్టీ నేతలు, కార్యకర్తలు సందర్శించారు. కాగా కరుణాకర్ రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా, ఆయన భార్య దీప ఓ పర్యాయం కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు బంధువే కాకుండా అత్యంత సన్నిహితుడు. కరుణాకర్‌కు భార్య దీప, కుమారుడు దేవర వంశీ ఉన్నారు. కాగా గత రెండేళ్ల క్రితం ఆయన ఏకైక కుమార్తె దేవర భవానీ మృతి చెందారు. నివాళులర్పించిన మంత్రి తలసాని దేవర కరుణాకర్ మృతి చెందిన విషయం తెలుసుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుడిమల్కాపూర్‌కు వచ్చేసి మృతదేహానికి నివాళులు అరి్పంచారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాసమస్యలపై గళమెత్తే నాయకుడని బల్దియా సమావేశాలలో ప్రజల మౌళిక సదుపాయాల కోసం ఆయన నిరంతరం ప్రశ్నించే వారని అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నగర మాజీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్, నగరానికి చెందిన వివిధ డివిజన్ల బీజేపీ కార్పొరేటర్లు కరుణాకర్ మృతదేహానికి నివాళులు అరి్పంచారు. -
కార్పొరేటర్ భర్త హంగామా.. కారుతో ఢీకొట్టి.. ఆపై దాడి చేసి..
సాక్షి, హైదరాబాద్: బైక్‌పై వెళుతున్న వారిని కార్పొరేటర్ భర్త కారుతో ఢీకొట్టి ఆపై దాడి చేసిన ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట 28వ డివిజన్ కార్పొరేటర్ జిల్లెల అరుణ భర్త ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి కారులో ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో న్యూ బాలాజీనగర్‌కు చెందిన బలరామకృష్ణ మీర్‌పేట చౌరస్తా నుంచి మరో వ్యక్తి డానియల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. శివసాయినగర్ కాలనీ పార్కు వద్దకు రాగానే ప్రభాకర్‌రెడ్డి తన కారుతో బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడ్డారు. దీంతో బలరామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభాకర్‌రెడ్డి.. బలరామకృష్ణపై దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. తనపై దాడి చేసిన ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాలరామకృష్ణ మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నన్ను, నా భార్యను బలరామకృష్ణ బూతులు తిట్టాడని ప్రభాకర్‌రెడ్డి కూడా ఫిర్యాదు చేశాడు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. పరస్పర ఆరోపణలు తనను చంపేందుకే ప్రభాకర్‌రెడ్డి కారుతో ఢీ కొట్టాడని బాలరామకృష్ణ ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే చేస్తే మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా తనపై రాజకీయంగా బురద జల్లేందుకే బాలరామకృష్ణ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రోడ్డుకు ఎడమ వైపు కుక్క పిల్లలు ఉండడంతో వాటిని తప్పించబోయి కుడివైపు వస్తున్న బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొనడం జరిగిందని తెలిపారు. అంతేగానీ ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదన్నారు. కావాలనే బలరామకృష్ణ నన్ను, నా భార్యను బూతులు తిట్టాడని జిల్లెల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్: మీర్పేట్ కార్పొరేటర్ భర్త వీరంగం
-
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ కుంభకోణం?
సాక్షి, హైదరాబాద్: ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమా గుర్తుందా? అందులో ఊరి నుంచి వచ్చిన బ్రహ్మానందంను నమ్మించి చార్మినార్‌ను తనికెళ్ల భరిణి విక్రయిస్తాడు. ఈ ఘటన కూడా ఇంచుమించు అలాంటిదే. కాకపోతే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేసుకున్న వారు ఆస్తి పన్ను చెల్లించడానికి ప్రవేశపెట్టిన స్వీయ మదింపు (సెల్ప్ అసెస్మెంట్)లో ఉన్న లోపాలను, అధికారుల పర్యవేక్షణ వైఫల్యాన్ని బయటపెట్టడానికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏకంగా మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి ఆస్తి పన్ను స్వయంగా మదింపు చేసుకొని అసెస్మెంట్ నంబర్ పొందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి నిర్మాణం చేసుకున్న యజమాని ఇంటి పన్ను చెల్లించడానికి ముందు ఆస్తి పన్ను మదింపు చేసి ఇంటి నంబరు కేటాయిస్తారు. ఈ విధానంలో అవినీతి ఎక్కువ కావడంతో స్వీయ మదింపు విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దాని ద్వారా ఇంటి యజమానే అన్ని వివరాలు పూర్తి చేసి ఆస్తి పన్ను మదింపు చేసుకోవచ్చు. ఈ విధానంలో కూడా లోపాలుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా అక్రమార్కులకు వరంగా మారింది. బయటపెట్టింది ఇలా.. మల్కాజిగిరి కార్పొరేటర్ గీతానగర్‌లో ఉన్న సర్కిల్ కార్యాలయం భవనాన్ని యాభై గజాలుగా చూపిస్తూ 194 రూపాయలు స్వీయ మదింపు ద్వారా ఆస్తి పన్ను చెల్లించారు. ఆస్తి పన్ను చెల్లించగానే పీటీఐ నంబర్ 1280210792 జనరేట్ అయింది. ఈ విధానంలో ఉన్న లోపాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరు బాధ్యతారాహిత్యం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ మదింపు విధానం పూర్తిగా అక్రమార్కులకు వరంగా మారింది. నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తిని కాజేయడానికి ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. నగరంలోని అన్ని సర్కిళ్లలో ప్రభుత్వ భూములు కొల్లగొట్టడంతో కోట్లాది రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఈ విధానంపై రెవిన్యూ విభాగం అధికారుల తీరు అధ్వానంగా ఉంది. మల్కాజిగిరిలో ఏఎమ్‌సీలను అడిగితే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ విధానం ద్వారా జరిగిన అన్ని ఆస్తి మదింపు (అసెస్మెంట్ల)పై కమిటీ వేసి విచారణ జరిపించాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – శ్రవణ్, కార్పొరేటర్ -
కిషన్ రెడ్డి కేంద్ర నిధులు తేలేకపోయారు: మేయర్ విజయలక్ష్మి
-
పాతబస్తీలో దారుణం.. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడి హత్య
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లలిత్‌బాగ్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కార్యాలయంలో హత్య జరిగింది. లలిత్‌బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ అల్లుడు ముర్తుజా అనస్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అనస్‌ను ఉస్మానియా అసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆరుగురు కలిసి అనస్‌పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కార్పొరేటర్ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఆరుగురు కలిసి కత్తులతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో అనస్ ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఇప్పటికే కొడుకు, కూతురు, భార్య మృతి -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. బొంతు శ్రీదేవి కంటతడి
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్లో మరో వర్గపోరు బయటపడింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ నడుమ వివాదం చోటు చేసుకుంది. చర్లపల్లిలో సోమవారం ఓ ప్రారంభోత్సవం సందర్భంగా వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ఎదుట.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. తన డివిజనల్లో తనకు తెలియకుండానే.. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆమె ఆరోపిస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ‘‘నేను మాత్రం ఊరుకునేది లేదు. మూడేళ్లు ఊరుకున్నా. ఇక ఊరుకోను. ఈసారి సాక్ష్యాలు ఉన్నాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పదివేలు పడేస్తే.. చంపేస్తారంటూ బెదిరిస్తున్నారు. నా సత్తా ఏంటో కూడా చూపిస్తా’’ అంటూ ఆమె సవాల్ విసిరారు. కులం పేరుతో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై ఆరోపిస్తూనే.. బీసీ సంఘాలు ఈ వ్యవహారంపై స్పందించాలని ఆమె కోరారు. ఈ వ్యవహారంపై అధిష్టానానికి కలిసి ఫిర్యాదు చేస్తానని బొంతు శ్రీదేవి చెప్పారు. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి సీరియస్ ఇదిలా ఉంటే.. నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి. ఉప్పల్‌లో గత కొంతకాలంగా బొంతు, బేతి వర్గాల నడుమ విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా.. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చేసిన ఆరోపణలపై ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి స్పందించారు. ఆమె వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. శ్రీదేవి చేసిన అసత్య ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని సుభాష్‌రెడ్డి ప్రకటించారు. ఇదీ చదవండి: ‘దొంగ–పోలీసు–దోస్తీ’ వ్యవహారాలు -
కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. టవర్ ఎక్కి ఆప్ నేత ఆత్మహత్యాయత్నం!
దేశంలో పలు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులు వేస్తోంది. ఇక, ఢిల్లీలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించేందుకు ప్లాన్ రచిస్తోంది. ఈ తరుణంలో అధికార కేజ్రీవాల్ సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది. అయితే, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో(ఎంసీడీ) పోటీ చేసేందుకు తనకు టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో మాజీ కార్పొరేటర్ హసీబ్ ఉల్ హసన్ నిరసనకు దిగారు. ఢిల్లీలోని శాస్త్రి నగర్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న హైటెన్షన్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు విధానాలను ఎత్తిచూపారు. పార్టీ కోసం ఎంత కృషి చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ తనను మోసం చేశారని షాకింగ్ కామెంట్స్. కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల కోసం ఆప్ రెండు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 134 మందికి, రెండో జాబితాలో 117 మందితో లిస్ట్ రిలీజ్ చేసింది. ఇక, తొలి జాబితాలో 134 మందిలో 70 మంది మహిళలకు టిక్కెట్లు ఇవ్వగా, మాజీ ఎమ్మెల్యే విజయేందర్ గార్గ్‌ను నరైనా నుండి ఆప్ రంగంలోకి దింపింది. మరోవైపు, కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన సీనియర్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్ ఆదర్శ్ నగర్ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. కాగా, డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. Aam Aadmi Party Councillor Haseeb-ul-Hasan jumped into an overflowing sewage drain in East Delhi. AAP Councillor stated the drain was overflowing but BJP-ruled East Delhi civic body paid no heed despite complaints pic.twitter.com/VRO3m0IXKw — Hindustan Times (@htTweets) March 23, 2022 -
సెక్యూరిటీ గార్డును కొరికిన ఆప్ కార్పోరేటర్.. వీడియో వైరల్
సూరత్: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్పోరేటర్ సెజల్ మాలవీయ సెక్యూరిటీ గార్డును కొరికిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ జనరల్ బోర్డు సమావేశంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నాయకుడు అమిత్ రాజ్‌పుత్ ఓ విషయంపై మాట్లాడుతుండగా.. ఆప్ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఫలితంగా సమావేశం కాస్తా రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆప్ కార్పోరేటర్ మహేశ్ అంఘన్ను సమావేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు సూరత్ మేయర్ హేమాలి భోఘవాలా ప్రకటించారు. అనంతరం ఆప్ కార్పోరేటర్లందరినీ సెక్యూరిటీ గార్డులు బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో సెజల్ మాలవీయ.. తనను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు చేతిని కొరికారు. సెజల్ చర్యను అమిత్ రాజ్‌పుత్ తీవ్రంగా ఖండించారు. సెక్యూరిటీ గార్డుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. SMCની સામાન્ય સભામાં AAPના કોર્પોરેટર સેજલ માલવિયા ભૂલ્યા ભાન, સભામાંથી બહાર કઢાતા ગાર્ડને ભર્યું બચકું #Surat #Gujarat #AAP pic.twitter.com/vZ1FRLi6DL — Zee 24 Kalak (@Zee24Kalak) October 22, 2022 చదవండి: బెంగాల్‌ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఏంపీ ఫైర్ -
పోలీస్టేషన్ ముందే కొట్లాట...బీజేపీ కార్పోరేటర్ భర్తను చితకబాదిన పారిశుద్ధ్య కార్మికులు
ఇండోర్: పారిశుద్ధ్య కార్మికుల బృందం బీజేపీ కార్పోరేటర్ భర్తను పోలీస్టేషన్ ముందే చితకబాదేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని రౌ పోలీస్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సందీప్ చౌహన్‌పై ఫిర్యాదు చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున సముహంగా పోలీస్ స్టేషన్‌వద్దకు వచ్చారు. సదరు వ్యక్తి ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని ఫోన్లో దుర్భాషలాడటంతో.... ఆమె బంధువులు, తోటి కార్మికులు ఆగ్రహావేశాలతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కి వచ్చారు. దీంతో పోలీసులు సందీప్ చౌహన్‌ని పోలీస్టేషన్‌కి పిలపించి ఇద్దరి మధ్య సమస్య రాజీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తలెత్తి చౌహన్‌పై దాడి చేసేందుకు యత్నించారు పారిశుద్ధ్య కార్మికులు. అంతేగాదు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరి దాడి చేసుకుని, బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఐతే చౌహన్ భార్య 13వ వార్డు రౌ మున్సిపాలటి బీజేపీ కార్పోరేటర్. (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్.. గడ్డిఅన్నారం కార్పొరేటర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న లంకా సుబ్రమణ్యం (24) కిడ్నాప్ కేసును సరూర్‌నగర్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా తేల్చారు. సుబ్రమణ్యం తండ్రి లంకా లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్ఓటీ బృందం బాధితుడితో పాటు నిందితులను నల్లగొండ జిల్లా చింతలపల్లి వద్ద గుర్తించారు. కిడ్నాప్‌నకు గురైన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఎసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన బీజేపీ బహిష్కృత నేత లంకా లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా కార్పొరేటర్ అనుచరుడు శ్రవణ్ బంధువులను సైతం ఆయన వేధిస్తున్నాడని, అలాగే లక్ష్మీనారాయణ సోదరుడు లంకా మురళి కూడా తమ ఆస్తి తగాదా విషయంలో న్యాయం చేయాలని శ్రవణ్‌ను వేడుకున్నాడు. ఈ విషయాలను శ్రవణ్ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వనస్థలిపురానికి చెందిన బీజేపీ సానుభూతిపరుడు పునీత్ తివారీతో మాట్లాడిన కార్పొరేటర్.. లక్ష్మీనారాయణకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని కిడ్నాప్ చేసి కొట్టాలని పురమాయించాడు. 8 మందితో ముఠా ఏర్పాటు.. పునీత్ తివారి తన ఎనిమిది మంది స్నేహితులతో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. గురువారం అర్ధరాత్రి లంకా లక్ష్మీనారాయణను కిడ్నాప్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లారు. లక్ష్మీనారాయణ కుమారుడు సుబ్రమణ్యం ఇంటి ముందు ఉన్నాడు. రెండు కార్లలో వెళ్లిన పునీత్ బృందం సుబ్రమణ్యాన్ని కారులో ఎక్కించుకుని వెళ్లారు. మార్గమధ్యలో అతడిని చిత్రహింసలు పెట్టి నల్లగొండ జిల్లా చింతాలపల్లికి తీసుకెళ్లారు. ఈలోగా బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కార్పొరేటర్ సూచనల మేరకే తాము కిడ్నాప్‌నకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. కార్పొరేటర్‌తో పాటు పునీత్ తివారి అతని అనుచరులు పోతబోయిన మంజునాథ్, పాలపర్తి రవి, కందాల పవన్‌కుమార్, రవల హేమంత్, రేవళ్ల చంద్రకాంత్, బలివాడ ప్రణీత్, కుంభగిరి కార్తీక్, మరుపోజు రవివర్మలను సాయంత్ర 7 గంటల ప్రాంతంలో రిమాండ్‌కు తరించారు. కేసులో నందితులుగా ఉన్న శ్రవణ్ గౌడ్, లంకా మురళి, మహేష, సాయి కిరణ్‌లు పరారీలో ఉన్నట్లు ఏసీపి తెలిపారు. మరో కేసు నమోదు లంకా సుబ్రమణ్యం కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు అరెస్ట్ చేసిన గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, పునీత్తివారి, రవివర్మ, హేమంత్‌లతో పాటు కార్పొరేటర్ మరో అనుచరుడు కోటేశ్వరరావులపై సరూర్‌నగర్ పోలీసులు మరో కిడ్పాప్ కేసు నమోదు చేశారు. పీఅండ్‌టీ కాలనీకి చెందిన భువనగిరి జయశంకర్, కార్పొరేటర్ అనుచుడు బొమిడిశెట్టి కోటేశ్వరరావుల మధ్య డబ్బు లావాదేవీలు ఉన్నాయి. ఇదే క్రమంలో గత నెల 28న రాత్రి 10 గంటల సమయంలో పునీత్ తివారి, రవివర్మ, కోటేశ్వరరావులు కారులో ఎక్కించుకుని సైదాబాద్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎదురుగా ఉన్న భవనంలోకి తీసుకెళ్లి డబ్బులు త్వరగా ఇవ్వాలని బెదిరించారు. అక్కడ నుంచి కార్పొరేటర్ కార్యాలయంలోకి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చిన తర్వాతే వెళ్లాలని బెదిరించినట్లు కార్పొరేటర్ మిగిలిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
కులుమనాలిలో చిక్కుకున్న జీవీఎంసీ కార్పొరేటర్లు
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అధ్యయన యాత్రకు వెళ్లిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు చెందిన 74 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కులు మనాలిలో చిక్కుకు పోయారు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో దాదాపు 20 గంటలపాటు నీరు, ఆహారం లేక అవస్థలు పడ్డారు. ఆర్మీ అధికారులు శనివారం రాత్రి ట్రాఫిక్ క్లియర్‌చేసి వాహనాలను వదలడంతో ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ నుంచి మొత్తం 141 మంది ఈ నెల 16న అధ్యయన యాత్రకి వెళ్లారు. తొలుత ఢిల్లీ, ఆ తర్వాత సిమ్లాకు వెళ్లారు. అక్కడి నుంచి కులు మనాలి వెళ్లారు. మనాలి కార్పొరేషన్ విజిట్ అనంతరం శుక్రవారం చండీగఢ్‌కు వెళ్లాల్సి ఉంది. వీరిలో ఏడుగురు విమానంలో చండీగఢ్ వెళ్లేందు కులు మనాలిలో ఉండిపోయారు. మిగతా 134 మంది 4 బస్సుల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరారు. చండీఘర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో మండీ వద్ద జోరుగా కురుస్తున్న వానకు కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్పొరేటర్ల బస్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం వరకు బస్సులోనే ఉండాల్సి వచ్చింది. కనీసం తాగడానికి నీరు కూడా దొరకలేదని కొందరు కార్పొరేటర్లు చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల అనంతరం ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్రం నుంచి ఆర్మీ అధికారులు వచ్చారని, కొన్ని అరటిపండ్లు, రొట్టెలు ఇవ్వడంతో కొంత ఉపశమనం కలిగిందని తెలిపారు. శనివారం రాత్రి 7 గంటల తర్వాత అధికారులు రోడ్డుపై బండ రాళ్లను, దెబ్బ తిన్న వాహనాలను తొలగించారు. దీంతో కార్పొరేటర్ల బస్సులు కూడా బయల్దేరాయి. అందరూ సురక్షితం : మేయర్ కార్పొరేటర్లంతా సురక్షితంగానే ఉన్నారని విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారి చెప్పారు. కార్పొరేటర్లంతా ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచి వైజాగ్ వస్తారని ఆమె తెలిపారు. -
అనంతపురంలో కమ్యూనిస్టు నేతల అత్యుత్సాహం
-
పదవి కాపాడుకునేందుకు మేయర్ పడరాని పాట్లు!
కుత్బుల్లాపూర్: శివారు ప్రాంత రాజకీయం రసవత్తరంగా మారుతుంది.. ఇప్పటికే నగరం నగర శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలు.. నగర పంచాయతిలలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారుతూ తమ అధిష్టానానికి ఝలక్ ఇస్తున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికార టిఆర్ఎస్ కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు ఆస్కారం ఇవ్వడంతో మేయర్ ఒక మెట్టు దిగి ప్రతి ఒక కార్పొరేటర్‌కు ఎంతో కొంత ముట్టజెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ► కాగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2019 జనవరి నెలలో జరిగాయి. ఈ ప్రాంతంలో మొత్తం 27 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు గెలుపొందగా ఆరు గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మెజారిటీ సభ్యులు ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ లో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ రాజులు కలిసి కొలను నీలా గోపాల్‌రెడ్డిని మేయర్‌గా, డిప్యూటీ మేయర్ ధనరాజ్‌యాదవ్‌లను ఎంపిక చేశారు. అంతవరకు బాగానే ఉంది రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి ప్రయాణం మూడవ సంవత్సరం దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్ మొదలైంది. క్యాంపు రాజకీయాలకు... ► మొత్తం 27 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా వారిలో ఏకంగా 17 మంది స్థానిక టీఆర్ఎస్ నేతతో గత నెలలో శ్రీశైలం టూర్ కి వెళ్లి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. దీంతో ఏదో జరిగిపోతుందన్న ఆందోళనతో మేయర్ భర్త గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే వివేకానందలకు ఈ విషయా న్ని చేరవేశారు. క్యాంపులో ఉన్న 17 మందితో పాటు మరో ముగ్గురు కార్పొరేటర్లు జత కలవడంతో వారి సంఖ్య ఏకంగా 20 కి చేరింది. దీంతో ‘రాజీ’ఫార్ములాకు వచ్చిన మేయర్ భర్త ఒ క్కొక్కరికి ఇంత చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో మరోసారి ఆ నో టా.. ఈ నోటా ఈ ఒప్పందం విషయం బహిర్గతం కావడంతో ఆయా పార్టీల నాయకులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా స్వతంత్రంగా గెలిచిన ఆరుగురు కార్పొరేటర్లు ఈ విషయంలో తటస్థంగా ఉండడం విశేషం. గిట్టని వాళ్ల పని ఇది... ► ఈ విషయంపై నిజాంపేట మేయర్ భర్త గోపాల్ రెడ్డిని వివరణ కోరగా ఖండించారు. కొంతమంది గిట్టనివాళ్లు ఇలా చెప్పుకుంటున్నారని, తాను ఎందుకు డబ్బులు ఇస్తానని ప్రశ్నించారు. అదంతా అబద్ధపు ప్రచారమని, తాను ఎవరికీ డబ్బులు ఇస్తానని చెప్పలేదు అంటూ వివరణ ఇచ్చారు. -
హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతిన్న కార్పొరేటర్
-
హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతున్న కార్పొరేటర్
సాక్షి, హైదరాబాద్: అసలే ఆకలి. అందునా ఆర్డర్‌చేసిన చికెన్ బిర్యానీ రానే వచ్చింది. ఇంకేముంది! ఒక పట్టుపట్టడమే అనుకున్నాడా వ్యక్తి. కానీ, ఆబగా సగం బిర్యానీ తిన్న తర్వాత పగవాడికీ రాని పరిస్థితి అతనికి తలెత్తింది. బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. యాక్! అనుకుంటూ తిన్న బిర్యానీ వాంతి చేసుకున్నాడు. ఇది ఎక్కడో ఏ మారుమూలో జరగలేదు. మన హైదరాబాద్‌లో.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్లో శుక్రవారం వెలుగుచూసిందీ ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది. రాంనాగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాడు. సగం బిర్యానీ తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్ అయ్యాడు. దీంతో కంగుతిన్న కార్పొరేటర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. అదే విధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: వికారాబాద్: పెళ్లయిన 20 రోజులకే.. -
పోలీసులపై బోలక్పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్ దురుసు ప్రవర్తన
-
ఎంఐఎం కార్పొరేటర్‌పై కేటీఆర్ సీరియస్
హైదరాబాద్: భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మొహ్మద్ గౌసుద్దీన్ ప్రవర్తనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు, వాళ్లతో దురుసుగా వ్యవహరించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ బుధవారం కోరారు. భోలక్‌పూర్ కార్పొరేటర్ ‘నెల రోజులు కనిపించొద్దంటూ..’ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది కూడా. ఈ మేరకు విషయాన్ని ట్విటర్లో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2 — KTR (@KTRTRS) April 6, 2022 పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని పేర్కొన్న కేటీఆర్, తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా ఆ వ్యక్తులను వదలొద్దంటూ డీజీపీకి ఆయన సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి మంగళవారం అంతా ట్విటర్లో వైరల్ కాగా. మొహ్మద్ గౌసుద్దీన్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదం! -
ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. జీహెచ్ఎంసీ పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. జీహెచ్ఎంసీలోని స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెరగడం వల్ల వారికి సంతోషం కలిగినప్పటికీ, అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీకి కొంత భారం పెరగనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ కాక, 148 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఇంకా జరగకపోవడంతో వారు లేరు. ప్రస్తుతం ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుంటే మేయర్ గౌరవ వేతనం ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి రూ. 65 వేలకు పెరిగింది. డిప్యూట్ మేయర్‌కు రూ.25 వేల నుంచి రూ.32,500, కార్పొరేటర్లకు రూ.6 వేల నుంచి రూ.7,800 లకు పెరిగింది.పెంపును పరిగణనలోకి తీసుకుంటే కింది విధంగా బల్దియాపై అదనపు భారం పడుతుంది. ఈ పెంపుతో మొత్తం బల్దియా ఖజానాపై ఏడాదికి రూ.34,66,800 భారం పెరిగింది. చదవండి: నచ్చిన సబ్జెక్టు.. మెచ్చిన చోట -
కార్పొరేటర్ భర్త పెండ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి,వరంగల్: వరంగల్ రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త పెండ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని బాధితురాలు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. దీనిపై పోలీసులు స్పందించి లిక్కర్‌డాన్‌తోపాటు కార్పొరేటర్ భర్తపై అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు చేసి ఐదు రోజుల కావస్తున్నా కేసులో పురోగతి లేదు. పోలీసులపై రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడీలు పెరగడంతో చేసేది ఏమీలేక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పేదలకు ఒక న్యాయం.. సంపన్నులకు మరో న్యాయమా అంటూ బయట నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుల ఆచూకీ తెలిసినా వారిని అరెస్టు చేయలేక జంకుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.. కేసులో పురోగతి ఏదీ..? కేసులో పురోగతి కనిపించకపోవడంతో పోలీస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిందితులకు పలుకుబడి ఉండటం, అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. 24గంటల్లోనే ఛేదించాల్సిన ఈకేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. తండ్రీకొడుకులపై కేసు నమోదై ఐదు రోజులు గడుస్తున్నా పురోగతి లేదు. కేసుల నుంచి తండ్రీకొడుకులు బయటపడేందుకు రాజీమార్గాన్ని ఉపయోగించి బాధిత యువతిపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికార పార్టీ నేతలు, వారి అనుచరులను రంగంలోకి దించి ఆ యువతి ఇంటికి వెళ్లి పలుమార్లు సయోధ్యకు యత్నిస్తున్నట్లు తెలిసింది. నెల రోజులు తిరుగుతున్నా నన్ను పట్టించుకోకపోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతూ దిక్కున్న చోట చెప్పుకో అనడం వల్లే పోలీసులను ఆశ్రయించానని, ప్రస్తుతం తాను చేసేది ఏమీలేదని ఆ యువతి వారితో స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి తాళం.. కేసు నుంచి ఎలాగైన బయటపడాలని లిక్కర్‌డాన్, కార్పొరేటర్ భర్త విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తరుచుగా బాధిత యువతి ఇంటికి వెళ్లి పలు మార్లు చర్యలు జరపడంతో విసుగెక్కిన ఆ యువతి మంగళవారం ఉదయాన్నే ఇంటికి తాళం వేసి తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం. గాలింపు ముమ్మరం.. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు మరింత ముమ్మరం చేశారు. బంధువుల ఇళ్లలో ఉండి బాధితురాలితో రాజీయత్నంతో పాటు బేల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల సైతం కేసును సవాలుగా స్వీకరించి ఎలాగై నిందితులను అరెస్ట్ చేయాలని పక్కా ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. ఏ క్షణనైనా పట్టుకునే అవకాశం లేకపోలేదు. బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఏసీపీ గిరికుమార్‌ను వివరణ కోరగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. చదవండి: ప్రేమించిన యువతి చెల్లి అవుతుందని తెలిసి.. -
వైరల్ అవుతున్న అడీక్ మెట్ కార్పొరేటర్ కుమారుడి ఫోన్ కాల్
-
నీ పని కావాలంటే.. ఫ్లోర్‌కు రూ.2 లక్షలు ఇవ్వాలి !
సాక్షి,ముషీరాబాద్( హైదరాబాద్): ఓ ఇంటిని నిర్మిస్తున్న యజమాని నుంచి అంతస్తుకు రెండు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని అడిక్‌మెట్ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ సి.సునిత ప్రకాష్‌గౌడ్, ఆమె కుమారుడు తరుణ్ మాట్లాడిన ఆడియో, వీడియోలు వైరల్‌గా మారాయి. శుక్రవారం ఈ ఆడియో, వీడియోలు నియోజకవర్గంలో తీవ్ర చర్చానీయాంశం అయ్యాయి. ► నల్లకుంట కూరగాయల మార్కెట్ రోడ్డులో నైషదం సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి నూతన భవనం నిర్మిస్తున్నారు. కొందరు స్థానికులు అక్రమ నిర్మాణం అని జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసి భవనాన్ని సీజ్ చేశారు. అయితే తన భవనాన్ని సీజ్ చేసిన విషయాన్ని స్థానిక అడిక్‌మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్‌కు సత్యనారాయణ మూర్తి ఫోన్ చేసి పనులు ఆపించారని మీ కుమారుడు తరుణ్ ఫ్లోర్‌కు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాడని నేను కూడా బీజేపీలో ఉన్నానని అన్నాడు. దీనికి సమాధానంగా ఏమైనా ఉంటే బాబుతో మాట్లాడుకోండి అంటూ ఫోన్‌ను కుమారుడికి ఇవ్వడంతో.. ఈ విషయాలు మమ్మీ మాట్లాడదు నేనే మాట్లాడుతాను అని తరుణ్ చెప్పడం ఆడియో విన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ► దీంతో పాటు రాంనగర్ చౌరస్తాలోని కార్యాలయానికి రమ్మని పిలిపించి ఫ్లోర్‌కు ఎంతిస్తారని తరుణ్ అడగడం.. దానికి ఇంటి యజమాని మూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పగా అందుకు తరుణ్ నాలుగున్నర లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, అదే వీడియోలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి రాజయ్య కూడా ఈ చర్చల్లో పాల్గొనడం స్పష్టంగా కనిపించింది. ఈ విషయం రెండు ఆడియోలు, ఒక వీడియో రూపంలో బయటకు రావడం కళకళం రేపింది. ► జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అడిక్‌మెట్ కార్పొరేటర్ బి.హేమలత భర్త జయరాంరెడ్డి ఓ బిల్డింగ్‌కు సంబంధించి డబ్బుల విషయంపై మాట్లాడుతున్న ఆడియో బయటకు రావడం దానిని ప్రతిపక్షంలో ఉన్న అడిక్‌మెట్ డివిజన్ బీజేపీ నాయకుడు ప్రకాష్‌గౌడ్ వైరల్ చేశారు. ఇప్పుడు పాత్రలు మారాయి. ఇటీవల కరోనాతో ప్రకాష్‌గౌడ్ మరణించగా.. కార్పొరేటర్ అయిన ఆయన భార్య సునీత, కుమారుడు తరుణ్‌లు ఇదే ఆడియో, వీడియోలో అడ్డంగా దొరకడం గమనార్హం. అలాగే ఇటీవల రాంనగర్ కార్పొరేటర్ కె. రవిచారి కూడా అదే డివిజన్‌కు చెందిన ఓ బీజేపీ నాయకుడిని దూషించిన ఆడియో వైరల్ కావడంతో ముషీరాబాద్ నియోజకవర్గంలో కార్పొరేటర్ల ఆడియో, వీడియోలు బయటకు రావడం పరిపాటిగా మారిపోయింది. దురుద్దేశంతోనే ఆరోపణలు నైషధం సత్యనారాయణ మూర్తి నల్లకుంట కూరగాయల మార్కెట్లో నిర్మిస్తున్న భవనం అక్రమమని స్వయానా ఆయన సోదరుడు, వదిన నాకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేయమని వారికి సూచించాను. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా తెలుసుకున్న సత్యనారాయణ మూర్తి మాపై కక్ష పెంచుకున్నారు. కావాలనే ఫోన్‌కాల్‌ను రికార్డు చేసి దురుద్దేశంతో వైరల్ చేశారు. డబ్బులు అడిగిన మాట అవాస్తవం. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. – సునిత ప్రకాష్‌గౌడ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ -
కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ‘కార్పొరేటర్’
హాస్యనటుడు ‘షకలక’ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కార్పొరేటర్’. ఇందులో సునీతా పాండే, లావణ్యా శర్మ, కస్తూరి హీరోహీరోయిన్లుగా నటించారు. సంజయ్ పూనూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ. పద్మనాభిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా ‘షకలక’ శంకర్ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. నా యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయని సన్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో ఓ సందేశం కూడా ఉంది. ఈ సినిమాలో ఐదు పాటలు, నాలుగు ఫైట్స్ ఉన్నాయి’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాకు యస్.వి. మాధురి సహనిర్మాత. -
మాజీ కార్పొరేటర్ దారుణ హత్య.. ఖండించిన సీఎం
సాక్షి, బెంగళూరు: ఉద్యాననగరిలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. చలవాదిపాళ్య వార్డు(138) బీజేపీకి చెందిన మాజీ మహిళా కార్పొరేటర్ రేఖాకదిరేశ్(40)పై గురువారం దుండగులు మరణాయుధాలతో దాడిచేసి హత్యకు పాల్పడ్డారు. రేఖాకదిరేశ్ ప్లవర్‌గార్డెన్‌లో నివాసం ఉంటుంది. పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం ఉండటంతో గురువారం ఉదయం 9.30 సమయంలో చలవాదిపాళ్యలో ఉన్న బీజేపీ కార్యాయానికి వెళ్లారు. 10.30 సమయంలో ముగ్గురు దుండగులు వచ్చి బయటకు పిలిచి ఒక్కసారిగా ఆమెపై మారణాయుధాలతో దాడి చేసి ఉడాయించారు. చిక్కపేట ఏసీపీ, కాటన్‌పేట పోలీసులు వచ్చి బాధితురాలిని కెంపేగౌడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి కుమారడు, కుమార్తె ఉన్నారు. కాగా టెండర్ వివాదంలో 2018లో రేఖా భర్త కదిరేశ్ హత్యకు గురయ్యారు. ఆ కేసుకు సంబంధించి శోభన్ అతడి అనుచరులు కోర్టులో లొంగిపోయారు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. ఇదిలా ఉండగా రేఖాకదిరేశ్ హత్యకు సంబంధించి పీటర్ అనే వ్యక్తితోపాటు ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. టెండర్లు, పాతకక్షలే హత్యకు కారణమని చెబుతున్నారు. హంతకులు తమను గుర్తు పట్టకుండా రేఖాకదిరేష్ ఇంటి వద్ద సీసీకెమెరాలను పైకి తిప్పారు. అదనపు పోలీస్‌కమిషనర్ మురగన్‌తో కలిసి పశి్చమవిభాగ డీసీపీ సంజీవ్‌పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హంతకుల ఆచూకీకోసం మూడు ప్రత్యేకబృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తాం: సీఎం రేఖాకదిరేశ్ హంతకులను 24 గంటల్లోగా అరెస్ట్ చేస్తామని ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప తెలిపారు. కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేఖాకదిరేశ్ హత్యకేసుకు సంబందించి ఇప్పటికే నగరపోలీస్‌కమిషనర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. చదవండి: అమానుషం: వీధి శునకం పెంపుడు కుక్కపై దాడి చేసిందని.. -
మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ వీరంగం
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ ఆనంద్ వీరంగం సృష్టించారు. సచివాలయ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన అనుచరులకు వెంటనే వ్యాక్సిన్ వేయాలని హడావుడి చేశారు. రెండో డోస్ మాత్రమే వేస్తున్నామని ఏఎన్ఎమ్ చెప్పిన కానీ.. వినకుండా అసభ్యంగా మాట్లాడుతూ సచివాలయ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్పొరేటర్ ఆనంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: చంద్రబాబు, లోకేష్ ప్రతి విషయానికి రాద్దాంతం చేస్తున్నారు ఐటీ పాలసీ లక్ష్యం ఇదే కావాలి: సీఎం జగన్ -
టీడీపీ కార్పొరేటర్ భూ దందాలకు అదుపే లేదు
దొండపర్తి(విశాఖ దక్షిణ): భూఆక్రమణలపై ఒకవైపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు టీడీపీ నేతలు అడ్డూ అదుపూ లేకుండా భూఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించిన మాదిరిగానే ఇప్పడు కూడా భూ దందాలు సాగిస్తున్నారు. ఒకవైపు వారి కబంద హస్తాల్లో ఉన్న భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నా.. తమ పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా 87వ వార్డు టీడీపీ కార్పొరేటర్ బొండా జగన్ భూఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గాజువాక ప్రాంతంలో ఆర్కార్డుల పేరుతో కబ్జాలకు తెరలేపారు. ఈయన వ్యవహారంపై ఇప్పటికే వడ్లపూడి, కణితి కాలనీ, అప్పికొండ ప్రాంతవాసులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో ఉన్నప్పటికీ.. వడ్లపూడి ప్రాంతంలో ఆర్‌హెచ్ కాలనీ సెక్టార్–2లో 526, 527 ప్లాట్ నెంబర్ల వివాదం 2012 నుంచి గాజువాక జూనియర్ కోర్టు, హైకోర్టులో నడుస్తోంది. ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వ హయాంలో వివాదమున్న ఇరువర్గాలను బెదిరించి ఆ ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టించి బొండా జగన్ అతని సోదరుడు సూరిబాబు బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో 526 నంబర్ ప్లాట్‌ను కొద్ది నెలల క్రితం రూ.30 లక్షలకు విక్రయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు అండగా.. భూఆక్రమణలకు పాల్పడడమే కాకుండా ఆక్రమణదారులకు కూడా టీడీపీ కార్పొరేటర్ బొండా జగన్ అండదండలు అందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వడ్లపూడి ఆర్‌హెచ్ కాలనీ, అప్పికొండ కాలనీ సెక్టార్–2లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరోతు గంగరాజు అనే వ్యక్తి 24 అడుగుల రోడ్డును కబ్జా చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకోకుండా జగన్ ఒత్తిడి చేశారని స్థానికులు ఇప్పుడు రెవెన్యూ, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పికొండ ప్రాంతంలో ప్లాట్ నెంబర్ 1799 పక్కన ఉన్న 24 అడుగుల రోడ్డును ఆనుకొని ఉన్న స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించిన బొండా జగన్ ఓ వ్యక్తికి రూ.15 లక్షలకు విక్రయించగా.. ప్రస్తుతం అందులో ఇంటి నిర్మాణం చేస్తున్నట్లు స్థానికులు అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కణితి కాలనీ కళింగ వీధి చివర వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో స్టీల్‌ప్లాంట్ నిర్వాసితుల పేరుతో ఇద్దరు వ్యక్తులు దొంగ పట్టాలతో రేకుల షెడ్డులు నిర్మించారు. ఆ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే రెండు సార్లు తొలగించారు. దీంతో కార్పొరేటర్ జగన్ వారితో ఒప్పందం చేసుకొని మళ్లీ నిర్మాణాలకు సిద్ధమవుతున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల్లో డబ్బులు సాయం చేసినందుకు గాను వడ్లపూడి మెయిన్ రోడ్డులో ఉన్న ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వెనుక గల ఆర్ నెంబర్ భూముల్లో ఇటీవల రేకుల షెడ్డు నిర్మాణం చేసినట్లు అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులపై అధికారులు విచారణకు సిద్ధమవుతున్నారు. ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం భూఆక్రమణలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కణితి కాలనీలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే రెండు సార్లు నిర్మాణాలు తొలగించాం. మరోసారి నిర్మాణం చేపడితే వారిపై కేసులు పెడతాం. ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతాం. – లోకేశ్వరరావు, గాజువాక తహసీల్దార్ -
నాన్న మృతదేహం నాకొద్దు.. వాటిని మాత్రం నాకు పంపండి
మైసూరు: కరోనా రక్కసి అనుబంధాలను తుడిచేస్తోంది. మరణించిన తండ్రి మృతదేహం తనకు వద్దని, మీరే తగులబెట్టుకోండి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల విలువైన డబ్బులు, డాక్యుమెంట్లను తెచ్చి ఇవ్వండంటూ ఒక కుమారుడు చాలా పరుషంగా మాట్లాడాడు. మైసూరు హెబ్బాళలో ఉన్న సూర్య బేకరి వద్ద ఒక ఇంట్లో వృద్ధుడు కరోనాతో మరణించాడు. అతని కొడుకు కువెంపు నగర శాంతి సాగర్ కాంప్లెక్స్ వద్ద నివసిస్తుంటాడు. కుమారుడు స్థానిక కార్పొరేటర్ కేవీ శ్రీధర్‌కు ఫోన్ చేసి తన తండ్రి అంత్యక్రియలను మీరే పూర్తి చేసి, అతని వద్ద ఉన్న రూ. 6 లక్షల డబ్బులు, ఆస్తి పత్రాలను మాత్రం తనకు తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. కొడుకు వైఖరికి విస్తుపోయిన కార్పొరేటర్ పాలికె సిబ్బందితో అంత్యక్రియలు చేయించారు. చదవండి: Lockdown: వందలాది మంది ఒక్కచోట చేరి -
మాస్క్ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్‌పై దాడి
పట్నంబజారు(గుంటూరు): మంచి చెబితే చెడు ఎదురైందన్న చందంగా జరిగింది నగరంలో ఓ కార్పొరేటర్‌కు...మాస్క్ లేకుండా తిరుగుతున్న కుర్రాడిని మాస్క్ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్‌పై దాడి చేయటం బుధవారం నగరంలో సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) బుధవారం ఉదయం బ్రాడీపేట ప్రాంతంలో రోజూ మాదిరిగానే పర్యటిస్తూ శానిటేషన్ పనులు చేయిçస్తున్నారు. ఈ క్రమంలో 4/17లో సాయిచరణ్ బాయ్స్ హాస్టల్ వద్ద భారీ సంఖ్యలో యువకులు ఎటువంటి మాస్క్‌లు లేకుండా కూర్చుని ఉన్నారు. ఇది గమనించిన ఆచారి ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌లు లేకుండా గుంపులుగా కూర్చోవటం సరికాదని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన యువకులు నువ్వు మాకు చెప్పేది ఏంటంటూ ఆచారిపై దాడికి తెగబడ్డారు. వసతిగృహం పక్కన ఉన్న రాళ్లతో ఆయనపై దాడి చేయటంతో గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆచారి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్లో ఉండే ఎస్.శివశంకర్, ఎస్.వెంకటేశ్వర్లు, వి.హేమంత్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరికొంత మంది ఉన్నట్లు గుర్తించామని వారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఘటన గురించి తెలుసుకున్న మేయర్ కావటి మనోహర్‌నాయుడు పట్టాభిపురం స్టేషన్‌కు వచ్చారు. ఘటనకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ఆచారి మాస్క్ పెట్టుకోమన్నందుకు తనపై దాడి చేసిన యువకులతో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆచారి డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని హాస్టళ్ల వద్ద నిత్యం ఇదే తంతు నడుస్తోందని, యువకులు మాస్క్‌లు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పలు హాస్టళ్ల వద్ద గంజాయి సేవిస్తున్న పరిస్థితులను కూడా తాను గుర్తించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. చదవండి: ‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్ రైతు భరోసా’ -
కరోనాతో కార్పొరేటర్ వానపల్లి రవి మృతి
సాక్షి, విశాఖపట్నం: నగరంలో కరోనా బారినపడి టీడీపీ కార్పొరేటర్ మృత్యువాత పడ్డారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవి కుమార్.. ఇటీవల కోవిడ్ బారిన పడ్డారు. ఆసుపత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. కార్పొరేటర్‌గా గెలుపొందిన ఆయన.. అనాథ శవాల అంత్యక్రియలు లాంటి ఎన్నో సామాజిక కార్యకలాపాలు గతంలో నిర్వహించారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్.. మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం -
కరోనాతో కార్పొరేటర్ వానపల్లి రవి మృతి
-
గుంటూరు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ మృతి..
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు, ఆరో డివిజన్ కార్పొరేటర్ పాదర్తి రమేష్‌గాంధీ గురువారం మృతిచెందారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ యువజన నేతగా ఎదిగిన రమేష్‌గాంధీ జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుతెచ్చుకు న్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో భాగంగా గుంటూరు నగరంలో ఆయన సమక్షంలో రమేష్‌గాంధీ వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆరో డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. మేయర్ పీఠం అధిష్టించకుండానే.. జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాథరాజు మేయర్ ఎన్నికకు ముందు పార్టీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో పాదర్తి పార్టీ నేతలు, కార్పొరేటర్లను ఆప్యాయంగా పలుకరించారు. ఆ సమావేశంలో మేయర్ పీఠాన్ని కావటి మనోహర్‌నాయుడు, పాదర్తి రమేష్ గాంధీకి చెరో రెండున్నరేళ్లు చొప్పున కేటాయిస్తున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు ప్రకటించారు. ఆ సమావేశం నుంచి కార్పొరేటర్లు అందరూ కార్పొరేషన్‌కు చేరుకుని ప్రమాణ స్వీకారం చేశారు. పాదర్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. కావటి తరువాత మేయర్ పీఠాన్ని అధిష్టించకుండానే పాదర్తి అకాల మరణం చెందారు. పాదర్తి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తొలుత చెప్పినప్పటీకీ, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురికావడంతో అపోలో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ సీపీ నేతల సంతాపం రమేష్‌గాంధీ ఇక లేరన్న విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. మంచి వ్యక్తి, అజాత శత్రువును కోల్పోయా మని జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంచి మిత్రుడిని కోల్పోయానని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ కోసం ఎంతోకష్టపడిన రమేష్ గాంధీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసన సభ ఉపసభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మేయర్ కావటి మనోహర్‌నాయుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు), మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాదర్తి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాదర్తి రమేష్ గాంధీ అంతిమయాత్ర శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక సాంబశివరావుపేటలోని పాదర్తి కార్యాలయం నుంచి ప్రారంభమవుతుందని పార్టీ నేతలు తెలిపారు. చదవండి: తీర్మానాలు చించేశారు.. కుర్చీలు విసిరేశారు.. పరిషత్ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు -
విశాఖ కార్పొరేటర్ బట్టు సూర్య కుమారి పై దాడికి యత్నం
-
గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ దాడి సూర్యకుమారి మృతి
-
ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బెదిరింపు కాల్స్..ఆడియో వైరల్
సాక్షి, విజయవాడ: కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఫ్యాన్ వీచిన గాలికి సైకిల్ కనుమరుగైంది. ఒకవైపు టీడీపీ పార్టీని తమ భుజాలపై మోస్తున్న కార్యకర్తలను, నాయకులను ఓదార్చాల్సిన బాధ్యత మరిచిన ఆ పార్టీ అగ్రనాయకులు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ కార్పోరేషన్ పరిధిలో ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. విజయవాడ 42 వ డివిజన్ నుంచి పోటీచేసి ఓడిపోయిన టీడీపీ కార్పోరేటర్ అభ్యర్ధి యెదుపాటి రామయ్యపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బెదిరింపులకు దిగారు. యెదుపాటి రామయ్య ఫేస్బుక్లో టీడిపీ నాయకులను విమర్శించారు. ‘ఒక్క ప్రెస్‌మీట్‌తో 20 మంది కార్పోరేట్ అభ్యర్ధులం ఓడిపోయాం. మన ఓటమికి కారణం ఎవరో మనందరికి తెలుసు ’ అని పశ్చిమ నియోజక వర్గ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. ఈ విషయాన్ని లేవనెత్తినందుకు గాను బుద్దా వెంకన్న నుంచి బెదిరింపుకాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఆడియోను విడుదల చేశారు యెదుపాటి రామయ్య. ఇప్పుడు ఆ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చివరగా తమకు ఇక ఫోన్లు చేయవద్దని, అవసరమైతే పార్టీని వీడుతామని రామయ్య భార్య రమణి తెలిపారు. అదే సమయంలో తాము ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతాం సార్ అంటూ ఫోన్ పెట్టేశారు రమణి. -
కార్పొరేటర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్
తూర్పుగోదావరి: కార్పొరేటర్ కంపర రమేష్ హత్యకేసులో నిందితుడు చిన్నాను పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనాస్థలి నుంచి పారిపోయిన చిన్నాను గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12న కార్పోరేటర్ రమేష్‌ను కాకినాడలో అతి దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. నిందితుడు చిన్నా..రమేష్‌పైకి మూడు సార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేశాడు. రియల్ ఎస్టేట్ విషయంలోనే ఇద్దరి మధ్యా వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి, ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతోనే చిన్నాను రమేష్ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని, అంతకు సుమారు వారం నుంచి చిన్నా ప్రయత్నించగా మొదట రమేష్ అందుకు అంగీకరించ లేదు. చిన్నా తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్ తన స్నేహితులకు చెప్పగా వారి సలహాతోనే చిన్నాను రమేష్ కలిశాడు. ఈ నేపథ్యంలో ముందే అనుకున్న పథకం ప్రకారం రమేష్‌పైకి కారుతో తొక్కించి చిన్నా కిరాతంగా హత్య చేశాడు. చదవండి : (కార్పొరేటర్ హత్య కేసు: కృష్ణా జిల్లాలో నిందితుడు?) (కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య) -
కార్పొరేటర్ హత్య కేసు: కృష్ణా జిల్లాలో చిన్నా?
కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కార్పొరేటర్ కంపర రమేష్‌ను దారుణంగా హతమార్చిన నిందితుడు గురజాన చిన్నా అలియాస్ సత్యనారాయణ కృష్ణా జిల్లాలో తలదాచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనా స్థలి నుంచి పారిపోయిన చిన్నా నేరుగా ఇంటికి వెళ్లాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవాలనే పన్నాగంతో హత్యకు వినియోగించిన హోండా సిటీ కారును ఇంటి దగ్గరే వదిలేశాడు. భార్య, పిల్లలు, తమ్ముడు కుమార్‌తో కలిసి తన మరో కారు ‘ఫార్చూ్యనర్’లో పరారయ్యాడు. సగం దారి వరకూ ఫోన్ ఆన్‌లోనే ఉంచాడు. మార్గం మధ్యలో తన ఫోన్‌తో పాటు, భార్య, తమ్ముడి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు. నిందితుడి జాడ తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటికే సర్పవరం సీఐ నున్న రాజు తన బృందంతో కలిసి కృష్ణా జిల్లా చేరుకున్నారు. నిందితుడి కోసం శోధన మొదలు పెట్టారు. అక్కడి పోలీసులతో కలిసి చిన్నా కదలికలను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లాలో అతడి బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ కోకిలా సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మొదలు, కృష్ణా జిల్లాను అనుసంధానం చేసే రహదారిలోని దాదాపు ప్రతి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించేందుకు ప్రత్యేక బృందమే ఏర్పడింది. దీనిపై పోలీస్ శాఖ ఐటీ విభాగం కసరత్తు చేస్తోంది. టోల్గేట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ హత్య ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు చిన్నా తొలుత రమేష్‌కు ఫోన్ చేసి వస్తాననడం నిజం కాదని తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి, ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతోనే చిన్నాను రమేష్ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని, అంతకు సుమారు వారం నుంచి చిన్నా ప్రయత్నిస్తున్నాడు. అందుకు రమేష్ అంగీకరించడం లేదు. చిన్నా తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్ తన స్నేహితులు సతీష్, శ్రీనివాస్‌కు శుక్రవారం రాత్రి అంటున్నాడని చెప్పారు. వారి సలహాతోనే చిన్నాను రమేష్ రమ్మన్నారని అంటున్నారు. తాను కోనపాపపేటలో ఉన్నానని, తమ్ముడి పుట్టిన రోజని చిన్నా చెప్పాడు. అలా బాధ చెప్పుకుంటానని వచ్చిన వ్యక్తి రమేష్‌ను అతి కిరాతకంగా హతమార్చాడు. (చదవండి: కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య ) శునకం తెచ్చిన తంటా.. -
కాకినాడ కార్పొరేటర్ దారుణ హత్య
కాకినాడ/కాకినాడ రూరల్: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన 9వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కంపర రమేష్ (47) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. వలసపాకల గంగరాజు నగర్లో సూర్య కార్ వాష్ వద్ద రమేష్ ను అతడి మిత్రుడే కారుతో ఢీకొట్టి హతమార్చాడు. సర్పవరం సీఐ నున్న రాజు కథనం ప్రకారం.. కార్పొరేటర్ రమేష్, స్నేహితులు ముత్యాల సతీష్, సుందరవీడి వాసు గురువారం రాత్రి 8 గంటలకు సూర్య కార్ వాష్ వద్ద పార్టీ చేసుకున్నారు. మరో స్నేహితుడైన గురజాన వీరవెంకట సత్యనారాయణ (చిన్నా) అనే వ్యక్తి ఐదు రోజులుగా తనను కలవాలంటూ మెసేజ్‌లు పెడుతున్నాడని, అందువల్ల అతణ్ణి కూడా పార్టీకి పిలుద్దామని కార్పొరేటర్ రమేష్ చెప్పగా.. మిగిలిన స్నేహితులు సరేనన్నారు. దీంతో రమేష్ చిన్నాకు ఫోన్ చేసి పార్టీకి రమ్మనడంతో అతడు తన సోదరుడు కుమార్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అంతా కలిసి మద్యం సేవించిన అనంతరం చిన్నా తన సోదరుడి పుట్టిన రోజు కేక్ కటింగ్‌కు రావాలని రమేష్ ను కోరాడు. అందుకు రమేష్ నిరాకరించడంతో ఇద్దరిమధ్యా వాదులాట చోటుచేసుకుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చిన్నా తన కారు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయగా.. రమేష్ అడ్డుపడ్డాడు. స్నేహితులు అతడిని పక్కకు తీసుకెళ్లగా.. తన కారు తాళం కనిపించడం లేదని, చిన్నా తీసుకుపోతున్నాడేమో అని రమేష్ మరోసారి కారుకు అడ్డుగా వెళ్లాడు. దాంతో చిన్నా తన కారుతో రమేష్ ను ఢీకొట్టాడు. కారు వేగానికి రమేష్ వలసపాకల మెయిన్ రోడ్డుపై పడిపోగా చిన్నా కారును రివర్స్ చేసి మరో రెండుసార్లు రమేష్ పైకి ఎక్కించి ముందుకు పోనిచ్చాడు. రక్తపుమడుగులో ఉన్న రమేష్ ను అతని స్నేహితులు సతీష్, వాసు సర్పవరం జంక్షన్ వద్ద గల ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నగరంలో విషాద ఛాయలు కార్పొరేటర్ కంపర రమేష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2000 సంవత్సరంలో తొలిసారి కౌన్సిలర్‌గా ఎన్నికైన కంపర రమేష్, 2001లో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. తరువాత 2005లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. తిరిగి 2017లో వైఎస్సార్ సీపీ తరఫున 9వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. గతంలో వైఎస్సార్ సీపీ సిటీ కన్వీనర్‌గా, కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్‌లో వివిధ పదవులు నిర్వహించారు. రమేష్ హత్యతో నగరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వివిధ రాజకీయ పారీ్టల నేతలు, అభిమానులు రమేష్ మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. పాతకక్షలే కారణం! రమేష్ హత్యకు గురైన దృశ్యాలు కార్ వాష్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. రమేష్ మీద నుంచి మూడుసార్లు కారును పోనివ్వడంతో కావాలనే చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు పాతకక్షలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్టు సీఐ రాజు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. చదవండి: కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి -
అమానుషం: కారుతో మూడుసార్లు తొక్కించి..
-
కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య
-
కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): జిల్లాలో దారుణం జరిగింది. కాకినాడ కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. కాకినాడ వాకపూడి గానుగచెట్టు సెంటర్ వద్ద గల కార్ వాష్ షెడ్ ఎదురుగా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను చేసినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హత్యకు ముందు రమేష్ ఇదే కార్ వాష్ షెడ్ లో మిత్రులతో కలసి మద్యం సేవించారు. అనంతరం ఇళ్లకు కార్లపై వెళ్లే సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. నలుగురుపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి రమేష్ మృతదేహాన్ని తరలించారు. చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి టీడీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ మద్యం -
నాకు తెలియకుండా షాప్ పెడ్తార్రా..!
సాక్షి, గోదావరిఖని(రామగుండం): ‘ఇంటికొచ్చి కలవాలని చెప్పినా.. అయినా పట్టించుకోలే.. నాకు తెలియకుండానే షాప్ పెడ్తార్రా..!’ అంటూ అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త ఆదివారం రాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. షాప్ యాజమానిపై దాడి చేశాడు. పక్కనే రాజస్తాన్‌కు చెందిన షాప్ యాజమానిని బూతులు తిట్టగా, అనుచరులు రంజన్లను ధ్వంసం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన సముద్రాల ఓదెలు రంజన్లతోపాటు ఇతర మట్టిపాత్రలను విక్రయించుకునే షాపును మూడురోజుల క్రితం రామగుండం కార్పొరేషన్ కార్యాలయం టీజంక్షన్ సమీపంలో ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సదరు కార్పొరేటర్ భర్త తన ఇంటికి వచ్చి కలవాలని సూచించాడు. పనుల బిజీతో ఓదెలుకు వీలుకాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కార్పొరేటర్ భర్త ఆదివారం రాత్రి బూతులు తిడుతూ చేయిచేసుకున్నట్లు ఓదెలు తెలిపాడు. పక్కనే ఉన్న రాజస్తాన్వాసుల రంజన్ల షాప్ వద్దకు వెళ్లి కొన్ని రంజన్లను ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో బాధితులు భయంతో వణికిపోయారు. సింగరేణి పర్మిషన్, మున్సిపల్ అనుమతితో షాప్ ఏర్పాటు చేసినా ఈ దౌర్జన్యం ఏమిటని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
రేపు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు బీజేపీబ్ కార్పొరేటర్లు
-
హైదరాబాద్‌లో సాక్షి ప్రతినిధులపై దాడి
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి అనుచరులు సాక్షి ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి తమ ప్లాట్‌ను కబ్జా చేశారని నల్లగొండకు చెందిన ఓ కుటుంబం ఆదివారం ధర్నా నిర్వహించింది. ఆయన ప్రచార రథాన్ని బాధిత కుటుంబం అడ్డుకుంది. కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులపై సామ తిరుమల్‌రెడ్డి అనుచరులు దాడి చేశారు. సాక్షి రిపోర్టర్ ఫోన్‌ను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
యువతిపై దాడి: కార్పొరేటర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : యువతిపై దాడి చేసిన కేసులో శేరిలింగం పల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌ను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం నల్లగండ్లలోని గ్రేటర్ కమ్యూనిటీలో ఉండే ఓ ఫ్యాషన్ డిజైనర్ యువతితో నాగేందర్ గొడవ పడ్డారు. అనంతరం యువతిపై దాడి చేశారు. దీంతో సదరు యువతి షీ టీమ్‌ను ఆశ్రయించి, అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. చదవండి : సుమేధ మృతి: మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు -
శేరిలింగంపల్లి యువతిపై కార్పొరేటర్ దాడి
-
యువతిపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ దాడి
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం ఓ యువతిపై దాడి చేశారు. కార్ పార్కింగ్ వివాదంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసినట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లిలోని లక్ష్మీ విహార్ పేజ్2 కాలనీలో నాగేంద్ర యాదవ్ నివాసముంటున్నారు. అదే కాలనీలో వేణుగోపాల్ కుటుంబం కూడా ఉంటుంది. అక్కడికి కారులో వచ్చిన వేణుగోపాల్ కుమార్తె అడ్డంగా ఉన్న కార్పొరేటర్ కారు తీయాలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అది దాడి చేసేంతగా పెరిగింది. ఈ గొడవను వేణుగోపాల్ రెండో కుమార్తె వీడియో తీసింది. షార్ట్, బనియన్‌పై ఉన్నానని వీడియో తీయ్యొద్దని కార్పొరేటర్ ఆ యువతిని వారించారు. అయినా వినకుండా వీడియో తీయడంతో వివాదం మరింత ముదిరింది. ఇద్దరు చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురిపైన కేసు నమోదయినట్లు చందానగర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర తెలిపారు. కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పై 323,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు యువతి పైన 448,504 సెక్షన్ల కింద కేసు పెట్టారు. -
కార్పొరేటర్‌పై దాడికి యత్నం.. కారు దహనం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ ధరావత్ రామ్మూర్తి నాయక్‌పై రఘునాథపాలెం మండలం కైకొండాయిగూడెం గ్రామంలో మంగళవారం దాడి యత్నం జరగడం, అతడి ఫార్చునర్ కారును తగలబెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గత నెల 18వ తేదీన కైకొండాయిగూడెంకు చెందిన తేజావత్ ఆనంద్(23) అనే యువకుడు బైపాస్ రోడ్డు వెంట గల కార్పొరేటర్ రామ్మూర్తి ఫంక్షన్హాల్లో వెల్డింగ్ పనులకు వెళ్లి..అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఖమ్మంరూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కార్పొరేటర్‌కు, మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య చర్చలు జరగ్గా విఫలమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం తన డివిజన్ పరిధిలోని కైకొండాయిగూడెం హైస్కూల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించి..ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు అడ్డగించగా..కోపోద్రిక్తుడైన కార్పొరేటర్ అసభ్యపదజాలంతో దూషించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు కార్పొరేటర్‌పై దాడికి ప్రయత్నించగా ప్రాణభయంతో..పాఠశాలలోని ఓ గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. స్థానికులు బయటి నుంచి తాళం వేసేశారు. అక్కడ ఏం జరుగుతుందోననే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన కుమారుడి మృతికి కారణాలు తెలపాలని తల్లి తేజావత్ విజయ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కార్పొరేటర్ రామ్మూర్తి సైతం తనపై దాడి యత్నం, కారు దహనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు ధ్వంసం, దహనం ఇలా.. పోలీసులు అక్కడికి చేరుకుని రామ్మూర్తి నాయక్‌ను, స్థానిక గ్రామ పెద్ద గుర్రం వెంకటరామయ్యతో కలిసి బందోబస్తు నడుమ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత టూ టౌన్ సీఐ గోపి ఆందోళనకారులను సముదాయించి కార్పొరేటర్ కారును డ్రైవర్ ద్వారా పంపిస్తుండగా..ఆందోళనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. భయాందోళన చెందిన డ్రైవర్ దిగి పారిపోగా..ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. పోలీసుల సమాచారంతో ఫైరింజన్ అక్కడికి చేరుకోగా..అప్పటికే దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ఒక ఏసీపీ, ముగ్గురు సీఐలు, పోలీసు బలగాలతో ఉన్న సమయంలోనే కారును తగలబెట్టడం చూస్తే గ్రామస్తుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. గది నుంచి రామ్మూర్తినాయక్‌ను తరలిస్తున్న పోలీసులు (వృత్తంలో వ్యక్తి) 3గంటలు భయం..భయం: బడిలో హడలిన ఉపాధ్యాయులు గొడవతో కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కైకొండాయిగూడెం ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలోకి వెళ్లి తల దాచుకున్నారు. గ్రామస్తులు వందల సంఖ్యలో అక్కడ గుమికూడడడంతో ఆన్లైన్ క్లాసుల కోసం వచ్చిన ఉపాధ్యాయులు కూడా భయంతో మరో గదిలోకి వెళ్లగా..అందులోకే రామ్మూర్తి నాయక్ వెంట వచ్చిన గుర్రం వెంకట్రామయ్య కూడా వెళ్లి దాక్కున్నాడు. పరిస్థితిని హెచ్ఎం డీఈఓకు ఫోన్లో వివరించారు. ఆ తర్వాత డయల్ 100కు చేస్తే అది గుంటూరుకు కలిసింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నాక వీరంతా బయటకు వచ్చారు. కార్పొరేటర్‌ను ప్రశ్నించడం, దాడికి యత్నం, దాక్కోవడం, గ్రామంలో కారు ధ్వసం ఇలా..ఉదయం 10:30నుంచి మధ్యాహ్నం 2వరకు ఉద్రిక్తత నెలకొంది. -
‘ఎవరూ ముందుకు రాలేదు.. నేనే దిగాను’
బెంగళూరు: మ్యాన్‌హోల్ లాంటి వాటిలో అడ్డంకులు ఏర్పడితే.. అధికారులకో.. ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేస్తాం. వారు పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయించి సమస్యను పరిష్కరిస్తారు. అయితే స్వయంగా ఓ ప్రజాప్రతినిధే మ్యాన్హోల్లోకి దిగి శుభ్రం చేసిన సంఘటన గురించి ఇంతవరకు ఎప్పుడు వినలేదు. కానీ బీజేపీ కార్పొరేటర్ మనోహర్ శెట్టి ఈ సంఘటనను నిజం చేసి చూపారు. మనోహర్ శెట్టి స్వయంగా మ్యాన్హోల్లోకి దిగి.. శుభ్రం చేశారు. ఆయనను అనుసరించి మరో నలుగురు బీజేపీ కార్యకర్తలు మ్యాన్హోల్లోకి దిగారు. అందరూ కలిసి ఆ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసి నీరు సాఫీగా పోయేలా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. మంగళూరు సిటీ కార్పొరేషన్ పరిధిలోని కద్రీ-కంబాలా వార్డు వద్ద చెత్త కుప్పలుగా బయట వేయడంతో ఆ పక్కనే ఉన్న మ్యాన్‌హోల్‌లో చెత్త అడ్డుపడి.. నీరు బయటకు పొంగిపోయింది. రహదారిపై నీరు ప్రవహిస్తూ ట్రాఫిక్‌కు, రోడ్డు మీద నడిచేవారికి ఇబ్బంది కలిగించింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మనోహర్ శెట్టి అక్కడికి చేరుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పిలిచి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయాలని కోరారు. అయితే రుతుపవనాల సమయంలో ఇది చాలా ప్రమాదకరమని, మ్యాన్‌హోల్ లోపలికి వెళ్లడానికి వారు నిరాకరించారు. దాంతో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు హై స్పీడ్ వాటర్ జెట్ అమర్చిన వాహనాన్ని పంపాలని మనోహర్ శెట్టి నగర కార్పొరేషన్‌ను ఆదేశించారు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇక లాభం లేదనుకున్న మనోహర్ శెట్టి తానే స్వయంగా 8 అడుగుల లోతులో ఉన్న మ్యాన్హోల్లోకి దిగి నీటి ప్రవాహానికి అడ్డుపడిన చెత్తను తొలగించారు. (పిండికొద్దీ ప్లేటు) ఈ సందర్బంగా కార్పొరేటర్ మనోహర్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ.. ‘మ్యాన్‌హోల్‌లో ఏదో అడ్డుపడి నీరు బయటకు పొంగిపొర్లుతుంది. పారిశుద్ధ్య కార్మికులను శుభ్రం చేయమని అడిగితే.. ప్రస్తుత పరిస్థితుల్లో దిగలేమని చెప్పారు. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక లాభం లేదనుకుని.. నేనే మ్యాన్హోల్లోకి ప్రవేశించి.. పైపుకు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించాను. ఇది చూసి బీజేపీ పార్టీ కార్యకర్తలు నలుగురు నన్ను అనుసరించారు. ఆ మ్యాన్‌హోల్ ఎనిమిది అడుగుల లోతులో ఉంది.లోపలంతా చీకటిగా ఉంది. టార్చ్ లైట్లు వేసుకుని శుభ్రం చేశాము’ అని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. మరో సారి మ్యాన్హోల్లోకి దిగడానికి కూడా తాను వెనకాడనని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరలవ్వడమే కాక.. మనోహర్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. (నిప్పుల గుండంలో యోగా చేసిన ఎంపీ) -
పోలీసులపై దాష్టీకాలా?
సాక్షి, హైదరాబాద్: వనపర్తిలో ఓ కానిస్టేబుల్ వాహనదారుడిపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారు. వాస్తవానికి తొలుత ఆ వాహనదారుడే పోలీసుపై దాడికి దిగిన వీడియో మరునాడు విడుదలైనా ఎవరూ పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై ఓ కార్పొరేటర్ అకారణంగా చేయి చేసుకున్నాడు. కరోనా మహమ్మారిపై పోరులో వైద్యుల తరువాత పోలీసులు కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. కానీ, పలువురు నేతలు, పౌరులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులపై తి రగబడటం, వారిపై చేయి చేసుకోవడం కొం దరు అలవాటుగా మార్చుకుంటున్నారు. 40 రోజులకుపైగా కుటుంబానికి దూరంగా, ఎండనకా వాననకా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విధులు నిర్వహిస్తోన్న పో లీసులపై దాడులకు దిగుతూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీ యడం సబబేనా అన్న ప్ర శ్న పోలీసు కుటుంబాల్లో మొదలైంది. చిన్నాచి తకా విషయాల్లో వా స్తవాలు తెలుసుకోకుం డా రాజకీయ ఒత్తిడి, క్రమశిక్షణ పేరిట చర్య లు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఐపీఎస్ అధికారులే వాపోతున్నారు. వీరందరికీ కరోనా ఎందుకు వచ్చింది? డిపార్ట్మెంటులో ఇప్పటికే ఐదుగురు పోలీసు లు కరోనా బారినపడ్డారు. ఇన్ని త్యాగాలు చే స్తోంటే తిరిగి వారిపై దాడులు చేయడం, వారి నే కించపరిచేలా ప్రవర్తించడంపై పోలీసుల్లో అసంతృప్తి మొదలైంది. అసలు రాష్ట్రంలో తబ్లి గీ జమాత్‌కు వెళ్లొచ్చినవారిని గుర్తించడంలో పోలీసుల పాత్ర మరువలేనిది. కరోనా పా జిటివ్ రోగుల గుర్తింపు, ఐసోలేషన్ కేంద్రాల కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో గస్తీ కాయడం, కంటైన్మెంట్ జోన్లను పరిరక్షించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి విధుల వల్లే ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం రాజకీయ నేతలకు తెలియంది కాదు. పాతబస్తీలో మరింత చెలరేగుతున్నారు.. పాతబస్తీలో పలువురికి అసలు లాక్డౌన్ ఎం దుకు విధించారో అవగాహన లేదు. మాస్కు లు, హెల్మెట్లు లేకుండా ఇష్టానుసారం బయటి కి వస్తూ గుంపులుగా తిరుగుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద నగరంలోనే అధిక కేసులు నమోదవడానికి ఈ నిబంధనల ఉల్లంఘనా ఒక కా రణమే. ఇదేంటని అడిగితే ప్రజలు, నేతలు పో లీసుల మీదకే తిరగబడుతున్నారు. ఇటీవల హోంమంత్రి కూడా ప్రజలపై లాఠీలు ఝుళి పించవద్దంటూ ఆదేశాలిచ్చి పోలీసుల చేతులు కట్టేసినంత పని చేశారు. ఆ మరునాడే ఓ కార్పొరేటర్ కానిస్టేబుల్‌పై చేయిచేసుకోవడం గమనార్హం. ఇలాగైతే పాతబస్తీలో పని చేయలేమని పోలీస్ సిబ్బంది అంటున్నారు. -
కార్పొరేటర్ టు కేబినెట్..
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన చాలామంది నేతలు చట్టసభల వరకు ఎదిగారు. నిరంతర ప్రజాసేవ, క్రమశిక్షణ, నిబ ద్ధతలే సోపానాలుగా క్షేత్రస్థాయి లో పడిన తొలిమెట్టును రాజకీయ పునాదిగా ఉపయోగించుకుని అంచెలంచెలు గా ఎదిగారు. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాసేవ మొదలుపెట్టిన వారు జాతీయ స్థాయి నేతలుగా, రాష్ట్ర మంత్రులుగా, పార్టీ సారథులుగా, డిప్యూటీ స్పీకర్ లాంటి రాజ్యాం గబద్ధ హోదాల్లో పనిచేస్తూ సమకాలీన రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన వారు ఈ జాబితాలో ఉండగా.. మేయర్లు, కార్పొరేట ర్లుగా పనిచేసి చట్ట సభలకు ఎదిగిన వారి గురించి ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల తరుణంలో ఓసారి మన నం చేసుకుందాం. క్షేత్రం నుంచి కదిలొచ్చి.. క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాలామంది నేతలు చట్టసభలకు ప్రాతిని« ధ్యం వహించడం విశేషం. కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా పనిచేశారు. అక్కడి నుంచే రాజకీయ అరంగ్రేటం చేసిన ఆమె జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. అదే కోవలో రాష్ట్ర కేబినెట్ వరకు ఎదిగిన నేతలు కూడా నగర రాజకీయాల నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వీరిలో ప్రస్తుత శాసనçసభ ఉపసభాపతి, మాజీ మంత్రి టి.పద్మారావుగౌడ్ ఒకరు. ఆయన రెండుసార్లు హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని మోండా డివిజన్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తు త మంత్రి గంగుల కమలాకర్ కూడా కార్పొరేటర్ నుంచి కేబినెట్ వరకు ఎదిగారు. కరీంనగర్ నగర పాలక సంస్థలో రెండు సార్లు డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేసిన గంగుల ఆ తర్వాత ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీసీ సంక్షేమం బాధ్యతలు చూస్తున్నారు. కమలాకర్, వినయ్‌భాస్కర్, నరేందర్ ప్రత్యక్ష ఎన్నికల్లో బల్దియా మేయర్‌గా గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. ఆ తర్వాత ఎమ్మెల్యే గా చట్ట సభల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్‌భాస్కర్ కూడా ఓరుగల్లు నగర పాలక సంస్థలో కార్పొరేటర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతు న్నారు. అదే నగరానికి ప్రథమ పౌరుడి గా వ్యవహరిస్తూనే శాసనసభకు ఎన్నికైన నన్నపునేని నరేందర్ కూడా ఒకనాటి కార్పొరేటరే. ఆయన ప్రస్తుతం వరంగల్ (తూర్పు) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎల్బీనగర్ ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అక్బర్‌బాగ్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా రెండుసార్లు ప్రజాసేవ చేశారు. ఆ తర్వాత హుడా చైర్మన్‌గా పనిచేసిన దేవిరెడ్డి ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. జీహెచ్ఎంసీకి అంబర్‌పేట డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కాలేరు వెంకటేశ్ ప్రస్తుతం అదే నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ కూడా 3 దశాబ్దాల క్రితం జవహర్‌నగర్ కార్పొరేటర్‌గా పనిచేశారు. మజ్లిస్‌లో ముగ్గురు.. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలుండ గా అందులో ముగ్గురు కార్పొరేటర్లుగా పనిచేసిన వారే. పత్తర్‌ఘట్టీ కార్పొరేటర్‌గా పనిచేసిన అహ్మద్ బలా లా మలక్‌పేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జాఫర్ హుస్సేన్ మిరాజ్ (నాంపల్లి ఎమ్మెల్యే) కూడా కార్పొరేటర్‌గా ఎన్నికై జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. పాతబస్తీ నుంచి కార్పొరేటర్‌గా పనిచేసిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ (చార్మినార్) ప్రస్తుత ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. గతంలో డబీర్‌పుర కార్పొరేటర్‌గా పనిచేసిన రియాజుల్ హసన్ అఫన్ది ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మంగళ్‌హాట్ నుంచి కార్పొరేటర్‌గానే రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కూడా గతంలో కార్పొరేటరే. మున్సిపల్ చైర్మన్లుగా చేసిన జగ్గారెడ్డి (సంగారెడ్డి ఎమ్మెల్యే), సోమారపు సత్యనారాయణ (రామగుండం మాజీ ఎమ్మెల్యే) లాంటి నేతలు కూడా చట్టసభలకు ఎన్నిక కావడం విశేషం. -
బాలికపై కార్పొరేటర్ ఘాతుకం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బెతుల్ నగర ఇండిపెండెంట్ కార్పొరేటర్‌ను 11 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాదికి పైగా ఈ దారుణం కొనసాగుతోందని బాధిత బాలిక వెల్లడించిందని బెతుల్గంజ్ ఏఎస్ఐ జుగల్ కిషోర్ తెలిపారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె స్టేట్మెంట్ను నమోదు చేశామని, కార్పొరేటర్ రాజేంద్ర సింగ్ చౌహాన్ (59) భార్య, కుమారుడిని ప్రశ్నించిన అనంతరం నిందితుడు చౌహాన్ లొంగిపోయారని వెల్లడించారు. కార్పొరేటర్‌పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కార్పొరేటర్ పెద్దసంఖ్యలో సామూహిక రక్షా భందన్ కార్యక్రమాలు నిర్వహించేవాడని, ఈ క్రమంలో వందల మంది మహిళలు, బాలికలు ఆయనకు రాఖీకట్టేవారని పోలీసులు చెప్పడం గమనార్హం. -
కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసిన ఎంపీ
సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ బి. వినోద్ కుమార్‌పై 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తన కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. కార్పోరేటర్ పదవికి రాజీనామా లేఖను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టె మురళీకృష్ణ ద్వారా నగరపాలక సంస్థ కమీషనర్ భద్రయ్యకు పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయిన బండి సంజయ్‌కు సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల, సానుభూతి పవనాలు వీచాయి. అయితే తెలంగాణలో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కువ మెజార్టీ వచ్చింది బండి సంజయ్‌కే కావడం విశేషం. -
కార్పొరేటర్ గారి కవిత్వసభ
‘కవిరత్న’ కత్తుల భద్రయ్య ఎవరి కవిత్వమూ చదవడు. తనది కవిత్వం కాదంటే ఒప్పుకోడు. ‘నన్ను కవి కాదన్నవాడిని కత్తితో పొడుస్తా’ టైపన్నమాట. ఇలాంటి భద్రయ్యకు ఒక ఆదివారం పూట పుస్తకం వేయాలనే ఆలోచన వచ్చింది.తన మిత్రుడు నూకేశ్వర్రావును ఇంటికి పిలిచి, వేడి వేడి చాయ్ పోసి తన మనసులో మాట చెప్పాడు.‘‘భద్రయ్యగారూ...ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. తక్షణం పుస్తకం వేయాల్సిందే’’ అని చాలా గట్టిగా చెప్పాడు నూకేశ్వర్రావు.‘‘అంతేనంటావా!’’ అన్నాడు ఆనందంగా భద్రయ్య.‘‘ముమ్మాటికీ అంతే...’’ అన్నాడు నూకేశ్వర్రావు అంతకంటే ఆనందంగా.వారం తిరిగేలోపే కత్తుల భద్రయ్య కవిత్వం 172 పేజీల పుస్తకంగా వచ్చింది.(గమనిక: ఈ పుస్తకంలో 20 పేజీలు మాత్రమే కవిత్వం....మిగిలిన పేజీలన్నీ ముందుమాటలే) నూకేశ్వర్రావుని ఇంటికి పిలిచి చాయ్ పోసి...‘‘పుస్తకం ఎలా ఉంది?’’ అని అడిగాడు భద్రయ్య.‘‘ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కొన్ని వందల పుస్తకాలు చూసుంటాను. కానీ ఇంత అందమైన పుస్తకాన్ని చూడలేదంటే నమ్మండి. పుస్తకం వేయడం కూడా ఒక కళ...’’ అంటూ సైకిల్ పంపుతో గ్యాస్ కొట్టడం మొదలుపెట్టాడు నూకేశ్వర్రావు. పొగడ్తలతో భద్రయ్య పొట్ట ఉబ్బిపోయింది.∙∙ రెండో రోజు కూడా టీ టైమ్‌కు వచ్చాడు నూకేశ్వర్రావు.టీ చప్పరిస్తూ...‘‘పుస్తకాన్ని సైలెంట్‌గా రిలీజ్ చేయవద్దండి. భారీ ఎత్తున ప్లాన్ చేయాలి’’ సలహా ఇచ్చాడు నూకేశ్వర్రావు.‘‘అలాగే చేద్దాం’’ అన్నాడు భద్రయ్య.సిటీలో పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశారు.‘‘ఏమయ్యా హాలు చూస్తే ఇంతపెద్దగా ఉంది. అంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తారు?’’ అడిగాడు భద్రయ్య.‘‘మామూలుగానైతే పుస్తకావిష్కరణ సభల్లో స్టేజీ మీద కంటే స్టేజీ కిందే తక్కువ జనాలు ఉంటారు’’ అన్నాడు నూకేశ్వర్రావు.‘‘మరి ఎలా?’’ అడిగాడు భద్రయ్య.‘‘నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది...’’ అన్నాడు నూకేశ్వర్రావు.‘‘ఏమిటోయ్ అది?’’ ఆసక్తిగా అడిగాడు భద్రయ్య.‘‘ఏమిలేదండి...పుస్తక ఆవిష్కరణ సభకు ఆహ్వానించే కార్డులో ‘ముఖ్యగమనిక: సభ అనంతరం లక్కీడ్రా ఉంటుంది. మొదటి ముగ్గురు విజేతలకు మిక్సీ, రాకెన్కేక్ జీన్‌ప్యాంట్, ఎనిమిది వందల రూపాయల విలువైన జియో ఫోన్ ప్రదానం చేయబడుతుంది’ అని ప్రచురిస్తే సరిపోతుంది’’ విలువైన సలహా ఇచ్చాడు నూకేశ్వర్రావు. ‘‘అలాగే’’ అన్నాడు భద్రయ్య.∙∙ ఆరోజు కత్తులవారి పుస్తకావిష్కరణ సభ. ఖైరతాబాద్‌లోని ‘కర్మ’ ఫంక్షన్‌హాల్ కిక్కిరిసిపోయిఉంది. హాల్లో ఎంతమంది ఉన్నారో, బయట అంతమంది ఉన్నారు.మేఘాలయ నుంచి భద్రయ్య ఫేస్బుక్ ఫ్రెండ్ జేమ్స్ పాంగ్సాంగ్ కొంగల్ వక్తల్లో ఒకడిగా వచ్చాడు. అతడు మాట్లాడుతూ ఇలా అన్నాడు...‘‘న భూతో న భవిష్యతీ...అంటారు కదా, అలా ఉంది సభ. మా స్టేట్‌లో ఎంతపెద్ద సాహిత్యసభకైనా పాతికమంది వస్తే మహాగొప్ప. అలాంటిది ఇక్కడ వందలాది మందిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందో చెప్పలేను. ప్రజలకు సాహిత్యం అంటే ఇంత అభిమానం ఉందని ఇప్పుడే తెలిసింది. ప్రజల అభిరుచికి పాదాభివందనం చేస్తున్నాను’’ అని మాట్లాడి కూర్చున్నాడు పాంగ్సాంగ్ కొంగల్.ఆతరువాత...‘‘మా గల్లీ కార్పొరేటర్ మల్లేశంగారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం’’ అని పిలిచాడు సభానిర్వాహకుడు నూకేశ్వర్రావు.అంతే...పెద్దగా నినాదాలు!‘మల్లేశన్న నాయకత్వం వర్థిల్లాలి’‘మల్లెపువ్వు తెలుపు...మల్లేశన్న గెలుపు’కార్పొరెటర్ మల్లేశం పెళ్లికి వెళ్లినా, చావుకు వెళ్లినా....ఎక్కడికి వెళ్లినా చుట్టూ పదిమంది ఉండాల్సిందే. ఆ పదిమంది...ఛాన్స్ దొరికితే చాలు....ఇలా నినాదాలు ఇస్తుంటారు.మల్లేశం స్టేజీ ఎక్కి మైక్ అందుకున్నాడు.‘‘ఎంత కార్పొరెటర్ అయితే మాత్రం వీడికి కవిత్వం గురించి ఏంతెలుసు!’’ తమలో తాము నిశ్శబ్దంగా గొణుక్కున్నారు. తనకు తెలియని సబ్జెక్ట్ గురించి ఈ కార్పొరేటర్ ఏంమాట్లాడతాడో అనే ఆసక్తి సభికుల్లో నిండిపోయింది.ఆయన ఇలా మాట్లాడారు...‘‘ఈ పుస్తకం రాసినాయిన మనకు జిగ్రీదోస్తు. జాన్జబ్బ. వీళ్ల నాయిన, మా నాయిన ఒకటే బడిల సదువుకున్నరు. కార్పొరేషన్ ఎలక్షన్ల టైమ్‌లో ‘పెదనాయినా...నీ ఓటు నాకే’ అని అడిగితే...‘నువ్వు అడగాల్నార బద్మాష్...నీకు దప్ప ఎవరకు ఏస్తా!’ అన్నడు. ఆ మంచిమనిషి తమ్ముని కొడుకే ఈ కవి.భద్రన్నకు భరోసా ఇస్తున్న...కంపల్సరిగా మన గవర్నమెంట్ వస్తది. అందరికి న్యాయం జరుగుతది.జరగకపోతే ఊరుకునేది లేదు.నడి బజార్లకొస్తం.న్యాయం జరిగే వరకు ఫైట్ చేస్తాం.ఇవ్వాళ అన్న బుక్కు ఎందుకు రాసిండు? అని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను.తన కోసమా!తన పిల్లల కోసమా!కానే కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.మన భద్రన్న ప్రజలు భద్రంగా ఉండాలని ఈ పుస్తకం రాసిండు. అంతేగానీ...తన స్వార్థం కోసం ఈ పుస్తకం రాయలేదని మరోసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’’స్పీచ్ పూర్తయ్యిందో లేదో మళ్లీ నినాదాలు...‘మల్లెపువ్వు తెలుపు...మల్లేశన్న గెలుపు’బాటమ్ లైన్: విమానాలే కాదు సభలు కూడా హైజాక్ అవుతాయి. యాకుబ్ పాషా -
విజయవాడ మున్సిపల్ సమావేశం రసాభాస
-
విజయవాడ మున్సిపల్ సమావేశం రసాభాస
సాక్షి, అమరావతి : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. 2019-20 బడ్జెట్‌పై సవరణ తీర్మానం చేయాలన్న వైఎస్సార్సీపీ, సీపీఎం కార్పొరేటర్ల విజ్ఞప్తిని మేయర్ తోసిపుచ్చారు. దీంతో రెండు పార్టీల కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి కౌన్సిల్ హాలు ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ, సీపీఎంల కార్పొరేటర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదని తెలిసినా.. రూ.1968కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి బిల్ల తేలేని పాలకపక్షం..ఎన్నికల ముందు బడ్జెట్ అంకెలను పెంచిందని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబ్బులు కట్టించుకొని ఇప్పుడు లబ్ధిదారులకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని మండిపడ్డారు. పేదల ఇళ్లకోసం భవిష్యత్తులో పోరాటం చేస్తామని రెండు పార్టీల కార్పొరేటర్లు పేర్కొన్నారు. -
మాజీ కార్పొరేటర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కక్ష సాధింపు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాజీ కార్పొరేటర్ చింతా దుర్గా రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కక్ష సాధింపులు ఎక్కువ అయ్యాయి. కొన్ని నెలలుగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి రావాలని మాజీ కార్పొరేటర్‌పై ఒత్తిడి చేశారు. టీడీపీలో చేరకపోవడంతో ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఒత్తిడితో అయిదో డివిజన్లో నిర్మాణంలో ఉన్న మాజీ కార్పొరేటర్ చింతా దుర్గా రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. టీడీపీలో చేరకపోవడంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారని చింతా దుర్గా రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని సంఘటనా ప్రాంతానికి చేరుకుని మాజీ కార్పొరేటర్‌కు అండగా నిలిచారు. ఏపీలో టీడీపీ అరాచకాలు పెరిగిపోయాయని ఆళ్లనాని వ్యాఖ్యానించారు.పార్టీలో చేరలేదని ఎమ్మెల్యే బడేటి బుజ్జి కక్ష సాధింపులకు దిగటం చాలా దారుణమన్నారు. ఏలూరులో టీడీపీ అక్రమాలకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. మరో ఆరు నెలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. -
మహిళ అని కూడా చూడకుండా కార్పొరేటర్ ఘాతుకం
-
కార్పొరేటర్ ఘాతుకం
సాక్షి, చెన్నై : ప్రజల మంచి చెడులు చూడాల్సిన ఓ రాజకీయనాయకుడు, మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా దాడికి దిగాడు. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. డీఎంకే కార్పొరేటర్ సెల్వకుమార్‌కు బ్యూటీపార్లర్ యజమాని సత్యకు మధ్య మే25న తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన సెల్వకుమార్ ఆమెను దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. పక్కనే ఉన్న మహిళలు ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా కిందపడేసి కాలుతో ఇష్టానుసారంగా తన్నాడు. వీడియో ఆధారంగా సెల్వకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎంకే పార్టీ అధినాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
అధికలోడ్ లారీలను అరికట్టమని కాళ్లపై పడి వేడుకోలు
-
ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తా..
సాక్షి, వించిపేట (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్.. మహిళా కార్పొరేటర్‌పై దౌర్జన్యానికి దిగారు. ప్రొటోకాల్ ప్రకారం డివిజన్లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యేనో, ఆ డివిజన్ కార్పొరేటరో ప్రారంభించాల్సి ఉండగా, మరో డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వెంట తీసుకొచ్చి వారిచేత ప్రారంభింపజేశారు. దీనిపై నిలదీసిన మైనార్టీ మహిళా కార్పొరేటర్‌పై జలీల్‌ఖాన్ దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. విజయవాడ 36వ డివిజన్ పరిధిలోని వించిపేట నైజాంగేటు సెంటర్లో రూ.30 లక్షలతో సీసీ, బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ప్రొటోకాల్ పాటించకుండా మైనార్టీ కార్పొరేటర్ జాన్‌బీ పక్కనుండగానే ఆయన అనుచరులైన మరో డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్తల చేత కొబ్బరికాయలు కొట్టించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. కార్పొరేటర్ జాన్‌బీ అడ్డుకుని ప్రొటోకాల్‌పై నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన జలీల్‌ఖాన్ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, అడగడానికి నువ్వెవరు.. నా కాళ్లు పట్టుకుంటే నీకు సీటు ఇప్పించా.. ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తానంటూ.. ఆమెపై దాడికి యత్నించారు. తనకు తెలియకుండా డివిజన్లో అభివృద్ధి పనులు జరగొద్దని అధికారులకు హుకుం జారీచేశారు. జాన్‌బీ మాట్లాడుతూ.. ఓట్లు వేసే వారికి మీరు పని చేయరా? ఓ ఎమ్మెల్యే మాట్లాడే మాటలా ఇవి? ప్రజలు చూస్తున్నారు. ఆడవారితో మాట్లాడే పద్ధతి ఇదా? మీ ఇంటికి చేస్తున్నావా? మా ఇంటికి చేస్తున్నావా?.. అంటూ జలీల్‌ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచి వించిపేట నైజాంగేటు సెంటర్ నుంచి ఫోర్‌మెన్ బంగ్లా వరకు రోడ్లు గోతులుపడిపోయి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, దీనిపై అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగానన్నారు. కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టడంతో నగరపాలక సంస్థ ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభించామన్నారు. 36వ డివిజన్లో వైఎస్సార్సీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉనికిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే.. డివిజన్లో అభివృద్ధి పనులు చెయ్యొద్దంటూ అధికారులను ఆదేశించడం నీచమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని త్వరలో ప్రభుత్వానికి, ఆ నాయకులకు తగిన బుద్ధి చెబుతారన్నారు.. -
కార్పొరేటర్‌పై ఎమ్మెల్యే పీఏ వేధింపులు..
సాక్షి, విజయవాడ: టీడీపీ నీచ రాజకీయాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతున్నాయని వైఎస్సార్ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. సాక్షాత్తూ ఓ మహిళా కార్పొరేటర్ పైనే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా పీఏ వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో మహిళలకు రక్షణ కరువైందనడానికి ఇంతకన్నా నిదర్శమేముందని అన్నారు. కార్పొరేటర్‌ను వేధింపులకు గురి చేయడమే కాకుండా, విషయం బయట పెట్టకుండా ఎంపీ నాని సెటిల్మెంట్కు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తిని విధుల నుంచి తొలగించకుండా వారికి వంతపాడుతున్న టీడీపీ నాయకులకు మహిళలే బుద్ధి చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే పీఏపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపులను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ తీరును ఎండగడతామన్నారు. -
మురుగు తీసి..సమస్య తీర్చి..!
లింగోజిగూడ: మురుగునీరు రోడ్లపైకి వస్తుండడంతో స్థానికుల ఇబ్బందులను తొలగించేందుకు గురువారం హయత్‌నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి రంగంలోకి దిగారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని నర్సింహారావునగర్, శారదానగర్ జంక్షన్ వద్ద గడ్డిపొలాల యజమానులు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ను ధ్వంసం చేయడంతో మురుగునీరు పొంగి రోడ్లపైకి వస్తోందని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోలేదని కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డి తెలిపారు. ప్రజల ఇబ్బందులను తాత్కాలికంగా తొలగించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్వలోకి దిగి శుభ్రం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ను నిర్మించాలని ఆయన కోరారు. -
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బైరామల్ గూడాలోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలంగా మారింది. ఎల్బీ నగర్ బైరామల్‌గూడలోని ఓ స్కాబ్ గోడౌన్లో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాం చేశారు. గోడౌన్లో ప్లాస్టిక్ పదార్థాలు, సీసాలు ఉండటంతో ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఫైర్ సిబ్బంది అప్రమత్తంతో ప్రమాదం తప్పిందన్నారు. మూడు గోడౌన్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ఆయన చెప్పారు. పెద్ద మొత్తంలో ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించామన్నారు. గోడౌన్లో పాత ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో ప్రమాదం సంభవించి ఉంటుందని ఆయన అంచనా వేశారు. హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం -
ఎక్కువ చేస్తున్నావ్..
సాక్షి, హైదరాబాద్ : అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్ అధికారిపై ఓ కార్పొరేటర్ భర్త దౌర్జన్యానికి దిగాడు. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని దుర్భాషలాడడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఇతని దౌర్జాన్యాన్ని సెల్ఫోన్లో చిత్రిస్తున్న ఆమె చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కున్నాడు. అంతేకాదు.. వార్నింగ్ ఇచ్చి సంఘటన స్థలం నుంచి ఆమెను తరిమేశాడు. దీంతో ఆ మహిళా ఉద్యోగిని విలపిస్తూ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుధవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, బాధితురాలి కథనం ప్రకారం.. జీహెచ్ఎంసీ సర్కిల్–16లో జి.వాణి టౌన్‌ప్లానింగ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్. కాచిగూడ డివిజన్ చెప్పల్‌బజార్‌లోని 3–2–505 డోర్ నంబర్లోని 50 గజాల స్థలంలో సురేష్ అనే వ్యక్తి జి+3 ఇంటి నిర్మాణం చేపట్టాడు. విషయం తెలిసిన వాణి బుధవారం అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని నిర్మాణంపై ప్రశ్నించారు. అనుమతి లేకుంటే నిలిపివేయండని చెప్పారు. దీంతో సురేష్ విషయాన్ని కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య భర్త ఎక్కాల కన్నకు సమాచారం అందించాడు. ఆయన భార్య కార్పొరేటర్‌ను తీసుకొని ఆఘమేఘాలపై అక్కడకు చేరుకున్నాడు. వస్తూ వస్తూనే.. ‘నువ్వు కాచిగూడకు సెక్షన్ ఆఫీసర్‌గా వచ్చి నెలరోజులు కాలేదు. ఎక్కువ చేస్తున్నావ్.. ఏంది సంగతి? ఇక్కడి అక్రమ నిర్మాణంపై ఎవరు ఫిర్యాదు చేశారు? అంటూ ఎక్కాల కన్నా సెక్షన్ ఆఫీసర్‌ను నిలదీశాడు. ఫిర్యాదు కాఫీ చూపించాలంటూ చిందులు తొక్కాడు. అక్రమ నిర్మాణం జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటామని ఆమె సమాధామిచ్చారు. దీంతో రెచ్చిపోయిన కార్పొరేటర్ భర్త ఆమెను దుర్భాషలాడాడు. అతని దౌర్జన్యాన్ని అధికారి వాణి తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆమె చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కొన్నాడు. దీంతో భయపడిన ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి బయటపడ్డారు. సర్కిల్ డీఎంసీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు.. సెక్షన్ అధికారిణి జి.వాణి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆమెను సంఘటన స్థలానికి తీసుకువెళ్లి ఏం జరిగిందనే దానిపై విచారించారు. అంతేగాక వారు తీసిన వీడియోను పరిశీలించారు. సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఎక్కాల కన్నాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాణికి పలువురు అధికారుల మద్దతు కాచిగూడ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ జి.వాణిపై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం చేసినట్లు తెలుసుకున్న వివిధ సర్కిళ్లల్లో పనిచేస్తున్న సెక్షన్ ఆపీసర్లు ఆమెకు బాసటగా నిలిచారు. పెద్దసంఖ్యలో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వాణికి ఓదార్చి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగేవరకు తామంతా వెంట ఉంటామని భరోసానిచ్చారు. -
వైఎస్సార్ సీపీ కాకినాడ అధ్యక్షుడిగా రమేష్
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా సీనియర్ కార్పొరేటర్ కంపర రమేష్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం రాత్రి ఈ నియామకాన్ని ప్రకటించింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తోన్న రమేష్ 1992లో ఎన్ఎస్యూఐ నగర అధ్యక్షునిగా, 1995లో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2000లో కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2005లో కార్పొరేటర్‌గా ఎన్నికై స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2013 నుంచి 17 వరకు నాలుగేళ్లపాటు కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసి ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి 9వ డివిజన్ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించారు. కాకినాడ నగర అధ్యక్షునిగా తనను నియమించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి, ఇందుకు సహకరించిన మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, కాకినాడ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ ఇతర నాయకులకు కంపర రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. జగన్ సీఎం కావడమే లక్ష్యం వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని కంపర రమేష్ పేర్కొన్నారు. నగరాధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ ప్రకటించిన నవరత్న పథకాలు, వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానన్నారు. రమేష్‌కు కుమార్ అభినందనలు రమేష్‌ను పార్టీ ప్రస్తుత నగర అధ్యక్షుడు కుమార్ అభినందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కాకినాడ నగరాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన తనకు అన్ని విధాలా సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు..?
♦ కార్పొరేటర్ల పయనం వెనుక రాజకీయం ♦ అంతా అధికార పార్టీకి చెందినవారే ♦ ఓ కీలక నేత వైఖరి నచ్చకేనని ప్రచారం ♦ ఏలూరు నగరంలో జోరుగా చర్చలు ఏలూరు (సెంట్రల్): నగరపాలక సంస్థ కార్పొరేటర్ల ఢిల్లీ ప్రయాణం చర్చనీయాంశమైంది. వారంతా అధికార పార్టీకి చెందిన వారే కావడం, నగరంలోని ఓ కీలక నేత పనితీరుపై అసంతృప్తి ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ నేతను తొలగించే ప్రయత్నమే ఈ ప్రయాణమని ప్రచారం జరుగుతోంది. నగరంలో మొత్తం 44 మంది అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 25 మంది ఈనెల 2న ఢిల్లీ వెళ్లారు. వీరు తిరిగి ఈనెల 8న రానున్నట్లు సమాచారం. ఓ వర్గానికి చెందిన కార్పొరేటర్లంతా ఢిల్లీ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. కీలక పదవిలో ఉన్న నేతను తొలగించే ప్రయత్నంలో భాగమే ఢిల్లీకి ప్రయాణమని అధికార పార్టీ నాయకుల్లో చర్చ నడుస్తోంది. ఓ నేత తీరుపై అసంతృప్తి నగరపాలక సంస్థ కీలక పదవిలో ఉన్న ఓ నేత తీరుపై పలువురు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ నేత వ్యతిరేక వర్గం ఢిల్లీకెళ్లింది. వచ్చిన తరువాత ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. సదరు నేత స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకోరనేది కార్పొరేటర్లు, నాయకులకు తెలిసిందే. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఓ సీనియర్ నాయకుడైన కార్పొరేటర్‌ను మందలించి, పార్టీకి ఎంతగానో సహకరించే వ్యక్తిపై ఇటువంటి వైఖరిని మానుకోవాలని సూచించినట్లు సమాచారం. అభివృద్ధి పనుల్లో వివక్ష నిత్యం ఎమ్మెల్యే, మేయర్ వెనుక పదుల సంఖ్యలో తిరిగే కార్పొరేటర్లు ప్రస్తుతం ఇద్దరు ముగ్గురికే పరిమితమయ్యారు. ఇందుకు తమ డివిజన్లలో పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇటీవల పలు డివిజన్లలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు నగరానికి ఇవ్వడంతో పనులు వేగంగా జరిగాయి. ఈ డివిజన్లకు అనుకొని ఉన్న డివిజన్లలో పనులు అంతంతమాత్రంగానే ఉండడంపై ప్రజలు కార్పొరేటర్లను ప్రశ్నిస్తున్నారు. తమ డివిజన్లోని సమస్యలను పాలకులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయా కార్పొరేటర్లు తీవ్ర అసంత్తృప్తితో ఉన్నట్లుగా తెలిసింది. -
టీడీపీ కార్పొరేటర్ భర్త దౌర్జన్యం
-
కార్పొరేటర్ భర్త హల్చల్
విజయవాడ: కృష్ణా జిల్లాలోని మొగల్రాజపురంలో కార్పొరేటర్ భర్త రత్నాకర్ హల్చల్ చేస్తున్నాడు. అక్కడ కొండపై నివశిస్తున్న వారు వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని వేదిస్తున్నాడు. ఒకవేళ ఇళ్లు ఖాళీ చేయకపోతే రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి అడ్డొచ్చిన వారిపై తన అనుచరులతో దాడి చేయించి, ఇళ్లను పడగొట్టించాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం
కృష్ణా: విజయవాడలోని ముత్యాలంపాడులో ఓ టీడీపీ కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం తెలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు జరిపి పలువురు విటులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ టీడీపీ కార్పొరేటర్ ఓ మంత్రి అనుచరుడు కావడంతో పోలీసులు సమాచారం బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. -
చెప్పుతో కొట్టుకున్నకార్పొరేటర్
అనంతపురం: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓ టీడీపీ కార్పొరేటర్ వీరంగం సృష్టించారు. తన డివిజన్ పై నిర్లక్ష్యం చూపుతున్నారంటూ మున్సిపల్ కమిషనర్ మూర్తి ఎదుట టీడీపీ కార్పొరేటర్ ఉమా మహేశ్వర్‌రావు చెప్పుతో కొట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల తీరుపై ఊగిపోయిన అధికారపార్టీ కార్పొరేటర్ ఉమా చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. -
మరో కార్పొరేటర్ ఇంట్లో ఐటీ సోదాలు
-
వైఎస్సార్సీపీ కార్పొరేటర్‌పై బీటెక్ రవి వర్గీయుల దాడి
-
కృష్ణవేణి.. తెలుగోడి వాణి..
► ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా కృష్ణవేణిరెడ్డి గెలుపు ► తొలిసారి తెలుగువారికి ప్రాతినిథ్యం.. ► ‘సాక్షి’లో ఒకప్పుడు ఆపరేటర్.. ఇప్పుడు కార్పొరేటర్ సాక్షి ముంబై: తెలుగు వారికి అందని ద్రాక్షగా మిగిలిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి ప్రాతినిథ్యం దక్కింది. బీఎంసీలో వార్డు నంబర్ 174 నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన కందిగ కృష్ణవేణి రెడ్డి విజయం సాధించారు. ‘సాక్షి’ దినపత్రిక ముంబై కార్యాలయంలో ఒకప్పుడు ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన ఆమె ఇప్పుడు బీఎంసీ కార్పొరేటర్‌గా విజయం సాధిం చారు. ప్రతిక్షనగర్‌లో నివసించే ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 2014 ఫిబ్రవరిలో సాక్షి ముంబై కార్యాలయంలో ఆపరేటర్‌గా చేరారు. 2015 మేలో పదవీ విరమణ చేసి.. సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఆమెను బరిలోకి దింపింది. ఎన్నికల్లో గెలిచి, బీఎంసీలో తెలుగువారికి తొలిసారిగా ప్రాతినిథ్యాన్ని కల్పించారు. కడప నుంచి ముంబై వయా చిత్తూరు కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో జన్మించిన కృష్ణవేణి రెడ్డి వివాహం చిత్తూరు జిల్లా కొత్త ఆరూరుకు చెందిన వినోద్ రెడ్డితో జరిగింది. ఆమె భర్త ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయన ఫార్మా రంగంలో ఉండగా ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. కాగా, 2012లో జరిగిన ఎన్నికల్లో శివసేన టికెట్‌పై 176వార్డు (ధారావి–ట్రాన్సిస్ట్ క్యాంప్)నుంచి పోటీ చేసిన వరంగల్ జిల్లాకు చెందిన అనూషా వల్పదాసి విజయం సాధించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఆమె పదవి రద్దు అయిన సంగతి తెలిసిందే. మార్పు కోరుకున్నారు.. ‘‘రాజకీయ అనుభవంలేని నేను రాజకీయాల్లోకి రావడం, విజయం సాధించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రాజకీయ అనుభవం లేని మీరు రాజకీయ బురదలోకి ఎందుకొస్తున్నారు.. వచ్చినా.. ఎలా నెగ్గుకొస్తారని పలువురు ప్రశ్నించారు. అయితే నేను వారికి చెప్పే సమాధానమొక్కటే రాజకీయ బురదని అందరూ తప్పించుకుంటే ఎలా? మహిళలతోపాటు యువత రాజకీయాల్లోకొస్తే కొత్త ఆలోచనలతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే నాకు అవకాశం కల్పించారు’’ -
ఇంటింటికీ మంచినీటి సరఫరా
శేరిలింగంపల్లి: ఇంటింటికీ మంచినీటి సరఫరాకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను కార్పొరేటర్ తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి డివిజన్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌లతో కలిసి సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నీటి సరఫరా లైన్లు, రిజర్వాయర్లకు సుమారు రూ.1900 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి డివిజన్ కార్యాలయాలు దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.600 కోట్లతో చేపట్టిన మంజీర పైప్‌లైన్, రిజర్వాయర్ల పనులు మార్చినాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెలే గాంధీలను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్లు వి.జగదీశ్వర్‌గౌడ్, కొమిరిశెట్టి సారుుబాబా, బొబ్బ నవతారెడ్డి, మేక రమేష్, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, ఎస్ఈ మోహన్‌సింగ్, ఈఈ మోహన్‌రెడ్డి, నాయకులు మిరియాల రాఘవరావు, వీరేశంగౌడ్, బొల్లంపల్లి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దర్జాగా కార్పొరేషన్ స్థలం కబ్జా
గుంటూరులో టీడీపీ మాజీ కార్పొరేటర్ భూ దాహం మరుగుదొడ్ల స్థలంలో ఇల్లు నిర్మించేందుకు యత్నం స్థానికుల ఫిర్యాదుతో కదలిన యంత్రాంగం గుంటూరు (అరండల్‌పేట): నగరంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నాయకుడి స్థాయిని బట్టి ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. తాజాగా నగరంలోని శారదాకాలనీలోని కార్పొరేషన్ స్థలాన్ని మాజీ కార్పొరేటర్ కబ్జా చేసి అందులో ఇల్లు నిర్మాణం చేపట్టారు. స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలో 35 సంవత్సరాల క్రితం శారదాకాలనీని ఏర్పాటు చేశారు. ఇక్కడ పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చారు. కాలనీలో నివసిస్తున్న పేదల కోసం 28వ లైనులోని కార్పొరేషన్‌కు చెందిన ఐదు సెంట్ల స్థలంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. రెండు దశబ్దాల వరకు మరుగుదొడ్లును స్థానికులు వినియోగించుకున్నారు. కాలక్రమంలో అవి శిథిలావస్థకు చేరడంతో వాటిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడ నివసించే కొంతమంది ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా కార్పొరేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఐదు సెంట్ల స్థలంలో ఒక సెంటును ఓ వ్యక్తికి కేటాయిస్తూ పట్టా ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే తాజాగా టీడీపీ అధికారంలోకి రావడం, భూమి రేట్లు పెరగడంతో దీనిపై మాజీ కార్పొరేటర్ గోళ్ళ ప్రభాకర్ కన్ను పడింది. ఇంకేముంది ఈ స్థలాన్ని కబ్జా చేసి కొద్దిరోజులుగా ఇల్లు నిర్మిస్తున్నారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. అధికారపార్టీ నాయకుడు కావడం, అడిగే వారు లేకపోవడంతో శరవేగంగా నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు రంగం సిద్ధం చేశారు. నాలుగు సెంట్ల స్థలం కబ్జాకు గురికావడం గమనించిన స్థానికులు నగర కమిషనర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. కబ్జాను వెంటనే అడ్డుకోవాలని పట్టణ ప్రణాళికాధికారిని ఆమె ఆదేశించారు. దీంతో పట్టణ ప్రణాళికాధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి కబ్జాను అడ్డుకున్నారు. రెండురోజుల్లో ఆ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్‌కు చెందిన స్థలంగా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో కార్పొరేషన్ స్థలం కబ్జా చేయాలనుకున్న సదరు నాయకుని ప్రయత్నం విఫలమైంది. -
పేకాడుతూ పట్టుబడ్డ కార్పొరేటర్ భర్త
విజయవాడ: ఆంధ్రప్రభ కాలనీలో ఆదివారం పేకాట శిబిరంపై దాడిచేసి కార్పొరేటర్ పైడి తులసి భర్త పైడి శ్రీనుతోపాటు మరో ఏడుగురిని సీసీఎస్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రభ కాలనీలో పేకాడుతున్నట్లు సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది. పేకాట శిబిరంపై దాడిచేసి పేకాడుతున్న కార్పొరేటర్ భర్త పైడి శ్రీను, పలు పార్టీలకు చెందిన నాయకులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 56,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిని సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి పైడి శ్రీను, కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి వెంకట్రావు, దండా శ్రీను, ఒర్సు సుందరరావు, సీహెచ్ మల్లేశ్వరరావు, బొమ్మారెడ్డి వెంకట నరసింహారెడ్డి, గడ్డం ప్రసాద్, సాము మనుకుమార్‌లను అరెస్టు చేశారు. -
మేయర్‌ను మార్చేద్దాం!
విజయవాడ సెంట్రల్ : ‘బ్రదరూ.. మేయర్ వల్ల మనకేం ఉపయోగం లేదు. నన్ను సపోర్టు చేయండి. మీ మంచి చెడ్డా నేను చూసుకుంటా. ఇదే మంచి చాన్స్. మీ నియోజకవర్గంలో కార్పొరేటర్ల మద్దతు కూడగట్టు. పార్టీ హైకమాండ్‌తో మాట్లాడేద్దాం..’ - విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కార్పొరేటర్ స్కెచ్ ఇది. ‘మేయర్ మీతో ఎలా ఉంటారు.. నగరాభివృద్ధిపై చర్చిస్తారా? అందరినీ కలుపుకుపోయే ధోరణి ఉందా?’ - టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పలువురు కార్పొరేటర్లతో అధిష్టానం తరఫున ఫోన్ సంభాషణ ఇది. కార్పొరేటర్ల విజ్ఞానయాత్ర రచ్చ కొత్త మలుపు తిరుగుతోంది. విజయవాడ మేయర్ చైర్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. అసమ్మతి వర్గం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇంతటి రాద్ధాంతానికి మేయర్ వైఖరే కారణమంటూ పలువురు కార్పొరేటర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లకు ఫోన్లు వచ్చాయి. మేయర్ మీతో ఎలా ఉంటారన్న ప్రశ్నకు.. ‘అబ్బే.. అసలేం బాగోరు.. అంతా ఏకపక్షమే..’ అంటూ పలువురు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. పూణే ఘటనపై పత్రికల్లో వచ్చినప్పుడే మేయర్ నోరువిప్పి ఉంటే పార్టీ ఇంతగా డ్యామేజ్ అయ్యేది కాదని ఓ కార్పొరేటర్ అధిష్టానం వద్ద కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. విమానంలో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించిన ఘటనలో అడ్డంగా బుక్కైన టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి వ్యవహారాన్ని ఆసరాగా తీసుకొని మేయర్ చైర్‌కు ఎసరు పెట్టాలన్నది అసమ్మతి వర్గం వ్యూహంగా తెలుస్తోంది. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కార్పొరేటర్ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లోని మేయర్ అసమ్మతి వర్గంతో రాయ‘బేరాలు’ సాగిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేల ఆశీస్సులతో! తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలతో మేయర్ కోనేరు శ్రీధర్‌కు మొదటి నుంచి పొసగడం లేదనే వాదనలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఆశీస్సులతోనే ఆయన మేయర్ చైర్ దక్కించుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆశావహ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల ఆశీస్సులతో మేయర్ చైర్‌ను దక్కించుకోవాలనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పదవుల్ని మార్చాలనే ప్రతిపాదన గత మూడు నెలలుగా నడుస్తోంది. ఈ పదవుల పంపిణీకి సంబంధించి ఎమ్మెల్యేలు తమ శిష్యగణానికి హామీలు ఇచ్చారు. మేయర్ మార్పుపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిది కావడంతో ఇప్పటివరకు దానిపై ఎవరూ నోరు మెదపలేదు. విజ్ఞానయాత్ర ఘటనతో పార్టీకి నష్టం జరిగింది కాబట్టి డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్లతో పాటు మేయర్‌ను మార్చాలనే వాదనను ప్రత్యర్థి వర్గం తెరపైకి తెచ్చింది. ఇంటెలిజెన్స్ ఆరా : విమానంలో ఘటన నేపథ్యంలో విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. నగరపాలక సంస్థలోని సెక్రటరీ సెల్, పీఆర్వో విభాగాల నుంచి కార్పొరేటర్ల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకెళ్లారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు మరికొందరు కార్పొరేటర్ల ప్రవర్తనపై కూపీ లాగినట్లు తెలుస్తోంది. విజ్ఞానయాత్రలో ఎలాంటి తప్పూ జరగలేదని, ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తామంటూ ప్రకటించిన నాయకుల్ని తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. -
పోకిరీ కార్పొరేటర్
♦ విమానంలో మహిళా ప్రొఫెసర్ పట్ల అసభ్య ప్రవర్తన ♦ విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు నిర్వాకం ♦ కేసు నమోదు చేసిన ఆర్జీఐఏ పోలీసులు సాక్షి, హైదరాబాద్: విమానంలో మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ 25 డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుపై శంషాబాద్ విమానాశ్రయంలోని ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సుధాకర్ కథనం ప్రకారం... హైదరాబాద్‌లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీలో ఓ యూనివర్సిటీలో పనిచేసే మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ-544 విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరారు. హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళుతున్న ఈ విమానంలోనే ఆమె పక్కసీట్లోనే కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు కూర్చున్నాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేలోపు మహిళా ప్రొఫెసర్‌ను తన కాలివేళ్లతో పదేపదే తాకడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోలేదు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. కార్పొరేటర్ ప్రవర్తనపై బాధితురాలు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావుపై పోలీసులు 354 సెక్షన్(మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించడం) కింద కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్‌ను పోలీసులకు అప్పగించాల్సిన ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో అతడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆర్జీఐఏ పోలీసులు వెంటనే కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు సమాచారం అందించగా, వెంకటేశ్వరరావు ఆలోపే అక్కడి నుంచి జారుకున్నట్లు సమాధానమిచ్చారు. అతడిని పట్టుకునేందుకు చట్టపరంగా ముందుకెళతామని సీఐ సుధాకర్ తెలిపారు. ఎయిర్ ఇండియా సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే నిందితుడు ఈపాటికి కటకటాల్లో ఉండేవాడని పోలీసులు అంటున్నారు. కేంద్ర మంత్రి ఆరా : విమానంలో కార్పొరేటర్ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని కేంద్రమంత్రి మేనకా గాంధీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మేనకా గాంధీ తెలంగాణ సీఎం కార్యాలయానికి ఫోన్ చేశారు. దీంతో అక్కడి అధికారులు పోలీసులను సంప్రదించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలను వారు మేనకకు వివరించినట్లు సమాచారం. బాధితురాలు రీతూవాసు కేంద్రమంత్రికి సన్నిహితురాలని తెలిసింది. కాగా, విమానంలో మహిళా ప్రొఫెసర్ పట్ల టీడీపీ కార్పొరేటర్ అసభ్య ప్రవర్తనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడలో మేయర్ శ్రీధర్ వాహనాన్ని అడ్డుకున్నాయి. పొంతన లేని వాదన : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉమ్మడి వెంకటేశ్వరరావును రక్షించుకొనేందుకు అధికార టీడీపీ కార్పొరేటర్లు పొంతనలేనివాదన వినిపించారు. విమానంలో ఆయన పక్కసీట్లో కూర్చున్న మహిళకు 60 ఏళ్లు ఉంటాయన్నారు. విమానం ఎక్కిన దగ్గర నుంచీ ఆమె అందరితో గొడవ పడిందన్నారు. అయితే వెంకటేశ్వరరావుపైనే ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నిస్తే.. నీళ్లు నమిలారు. ఇదిలా ఉండగా... శంషాబాద్ ఎయిర్ ఇండియా సెక్యూరిటీ అధికారుల ఆదేశాల మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. తాను ఏ తప్పూ చేయలేదని, నిద్రలో పొరపాటున తన కాలు మహిళకు తగిలిందని అతడు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కారు...కార్యాలయం...సహాయకుడు
ఇంటి అద్దె, కంప్యూటరు, ఫోనూ కావాలట.. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల డిమాండ్ సిటీబ్యూరో: ‘ఓ కారు... నడపడానికి డ్రైవర్... కార్యాలయం... సహాయకుడు... కంప్యూటరు... ఫోను...’ ఇవన్నీ మన కార్పొరేటర్లకు కావాలట.. పనిలో పనిగా ఇంటి అద్దె అలవెన్స్, హెల్త్‌కార్డులు కూడా కావాలంటున్నారు. కంప్యూటర్‌కు ప్రింటర్, స్కానర్, కారుకు డీజిల్ అదనం...ఇవన్నీ ‘సేవ’ కోసమేనట. ఇక వేతనాల పెంపు డిమాండ్ ఎలాగూ ఉన్నదే. ఓ వైపు తమ చాంబర్లలో మార్పులు చేయాలని... త గినన్ని గదులు ఇవ్వాలని... ఇతర కార్యాలయ గదులను తమ కార్యాలయాల్లో విలీనం చేయాలని మేయర్.. డిప్యూటీ మేయర్లు కోరుతున్నారు. మరోవైపు వేతనాలు పెంచాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి కొత్త కార్పొరేటర్లు వచ్చాక తొలి సమావేశం ముగిసిందో... లేదో...వేతనాలు పెంచాలని, సౌకర్యాలు కల్పించాలని కొంతమంది కార్పొరేటర్లు పల్లవి అందుకున్నారు. ఈ మేరకు నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పైన చెప్పినవన్నీ కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇవన్నీ సమకూరిస్తే సేవాభావం ఉన్న కార్పొరేటర్లు నిజాయితీగా పని చేయగలుగుతారని తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.5 లక్షలుగా నిర్ణయించారని... ప్రస్తుత గౌరవ వేతనం నెలకు రూ.6వేలని చెప్పారు. ఐదేళ్లకు ఈ మొత్తాన్ని లెక్కిస్తే రూ.3.60 లక్షలు మాత్రమే అవుతుందని లేఖలో ప్రస్తావించారు. కనీసం ఎన్నికల ఖర్చు కూడా ఈ వేతనంతో తిరిగి రాదని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కార్పొరేటర్లు ఈ వేతనంతో నెట్టుకురావడం కష్టమని ఏకరువు పెట్టారు. వేతనం పెంచకపోయినా... కనీసం పైన పేర్కొన్న సదుపాయాలు కల్పిస్తే నిజాయితీగా సేవ చేయగలుగుతారని, లేని పక్షంలో అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని తెలిపారు. -
'సుశీల్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు సుశీల్ కుమార్ ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై తెలంగాణ మైనార్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ కమిషన్ చైర్మన్ పోలీసులను కోరారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని బంజారాహిల్స్ కార్పొరేటర్, ఎంపీ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి పోలీసులను కోరారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. నిందితున్ని అరెస్టు చేసేంతవరకు ఊరుకునేది లేదని ఆమె 'సాక్షి'తో మాట్లాడుతూ తెలిపారు. గుంటూరులోనూ నిరసనలు! పత్తిపాడు: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. మంత్రి కొడుకైతే అతనికి ఏమైనా కొమ్ములు ఉంటాయా.. రాజ్యాంగానికి అతీతుడా అని నినాదాలు చేస్తూ.. మైనార్టీ సంఘాల నాయకులు రాస్తారోకో చేస్తున్నారు. ప్రత్తిపాడులోని ఓల్డ్ మద్రాస్‌రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాల నుంచి వస్తున్న ఉపాధ్యాయురాలి చేయి పట్టుకొని లాగిన వ్యక్తిపై కేసు పెట్టకుండా అతనికి సాయం చేసిన డ్రైవర్‌పై కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
బెదిరింపులతో చితికిపోతున్నాం..!
ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన నగరపాలక సంస్థ ఉద్యోగులు దాడులను ఎదుర్కొనేందుకు నూతనంగా కమిటీ ఏర్పాటు అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థలో అధ్వానమైన పరిస్థితి నెలకొందని, నిత్యం బెదిరింపులతో చితికి పోవాల్సి వస్తోందని అధికారులు, ఉద్యోగులు ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేను కలిసిన నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో పాటు కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఆయన నివాసంలోనే సమావేశమయ్యారు. ఏఈ సుభాష్ రాజీనామా చేసే స్థాయికి వచ్చాడంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లుల చేయమని వేధించడమేమిటన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామన్నారు. ఒకరికి పని చేస్తే మరో వర్గం లక్ష్యంగా చేసుకుని దురుసుగా ప్రవర్తిస్తోందన్నారు. ఈఈ, డీఈ, ఏఈ అధికారులన్న ఆలోచన లేకుండా దుర్భాషలాడడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైన తమ పట్ల ఇంత వివక్ష చూపించడం సరికాదన్నారు. కార్పొరేటర్లు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పాలకవర్గంలోని నేతలు వ్యవహరిస్తున్న తీరుతో కింది స్థాయి ఉద్యోగి నుంచి అధికారుల వర కు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాగైతే ఏవిధంగా పనిచేయాలని ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను తాము కాపాడుకునేందుకు ఓ కమిటీను వేసుకుంటామని తెలిపారు. ఎవరినీ ఉపేక్షించ వద్దు: ఎమ్మెల్యే విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని, ఎవరినీ ఉపేక్షించవద్దని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అధికారులకు భరోసా ఇచ్చారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు, ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. ధైర్యంగా, స్వేచ్ఛగా పని చేయాలన్నారు. నగరాభివృద్ధికి అందరూ ముందుకు రావాలన్నారు. ఎవరైనా సరే అధికారులు, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికారులతో సమన్వయంతో పని చేయించుకోవాలన్నారు. ఎమ్మెల్యేను కలసిన వారిలో అడిషినల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, డిప్యూటీ కమిషనర్ అజయ్ కిషోర్ తదితరులున్నారు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న నగరపాలక సంస్థ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఇదేగౌరవాధ్యక్షులుగా చల్లా ఓబులేసు(కమిషనర్), అధ్యక్షుడుగా నరసింహులు, కార్యదర్శిగా బీఎస్ కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శిగా మురళీ, కోశాధికారిగా రమణ, ఉపాధ్యక్షులుగా నవనీతకృష్ణ, సతీష్, సురేంద్ర, బాషా ఉన్నారు. దళిత ఉద్యోగులను వేధిస్తే సహించం = ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం హెచ్చరిక అనంతపురం న్యూటౌన్ : అధికార పార్టీ నాయకుల అరాచకాలు క్రమంగా పెరిగిపోతున్నాయని, దళిత ఉద్యోగులపై ప్రతాపం చూపిస్తుండడం దారుణమని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మీనుగ రామప్రసాద్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న దళిత ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అనేక అవస్థలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నగర పాలక సంస్థలో పనిచేస్తున్న సుభాష్‌చంద్రబోస్‌కు సమయానికి మించి పని భారం పెట్టడం వల్ల కుటుంబానికి చెప్పుకోలేక, ఇటు అధికారులకు చెప్పలేక మనోవేదనకు గురై ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. దళిత ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. -
ప్రతి అడుగూ ప్రజాపక్షమే..
వర్థమాన నేతల అభిమతం గ్రేటర్ బరిలోకి తొలిసారి దిగినవారు.. గెలుపు వీరులుగా నిలిచారు. గతంలో రాజకీయ అనుభం లేనివారు కొందరు.. ఇంటికే పరిమితమైన స్త్రీమూర్తులు మరికొందరు.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధపడినవారు ఒకరు. ఎన్నికల వేళ గల్లీగల్లీ తిరిగారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశారు. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ‘ఇలాంటి’ ప్రాంతాలు కూడా ఉన్నాయా..! అన్న అనుమానం అప్పుడు.. అనుక్షణం కష్టించి తమకు పట్టం కట్టినవారికి అండగా నిలిచి.. కష్టాలు తొలగించాలనే దృఢ నిశ్చయం ఇప్పుడు. తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికై, బల్దియా ప్రధాన కార్యాలయంలో నేడు అడుగుపెడుతున్న వర్ధమాన నేతలు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వారి మాటల్లోనే.. - సాక్షి నెట్వర్క్ గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా ఆదర్శ డివిజన్ రూపకల్పనే లక్ష్యం ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో పర్యటించినప్పుడు చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారానికి ఈనెల 15 నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తా. అక్కడి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తా. ఇకపై తరచూ ఇలాంటి పర్యటనలు చేస్తునే ఉంటాను. చేసిన ప్రతి పనిపైనా.. అది ప్రజలకు ఎంతవరకు మేలు చేకూరిందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా చూస్తూ తరచూ ప్రజలతో మమేకమయ్యేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను. డివిజన్ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న, చేయని పవర్ బోర్ల వివరాలు తెలుసు కుంటున్నాం. వాటి మరమ్మతులకు తక్షణం చర్యలు తీసుకునేలా చేస్తాం. పైప్‌లైన్ ద్వారా తాగునీరు మరింత మెరుగ్గా సరఫరా అయ్యేలా అధికారులు చేస్తున్నారు. హైటెక్ జోన్‌గా పేరున్నా గచ్చిబౌలిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అన్ని కాలనీలు,బస్తీలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. అయిదేళ్లలో ఓపెన్ డ్రైనేజీ అనేది లేకుండా చేయాలన్నది నా లక్ష్యం. చీకటి పడితే వీధుల్లో వెలగని వీధి లైటు అన్నది లేకుండా చూస్తా. త్వరలో అధికారులతో సమావేశమై వీధిదీపాలు అన్ని చోట్ల వెలిగేలా చూస్తాను. ప్రజలు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తేవాలని కోరుతున్నా. గోపన్‌పల్లి శ్మశానవాటిక అభివృద్ధి పనులు సాగుతున్నాయి. నానక్‌రాంగూడలో స్థానికులు అభివృద్ధికి ముందుకు వచ్చి పనులు చేస్తున్నారు. పార్కులు కేవలం టెలికాం నగర్, జీపీఆర్ఏ క్వార్టర్స్‌లోనే ఉన్నాయి. వాటిని మరింత అభివృద్ధి చేస్తాం. కాలనీ, బస్తీల్లో సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేస్తాం. వారంతా కనీసం నెలకోమారు సమావేశమయ్యేలా చూస్తాను. వారంతా ఏకగ్రీవంగా చెప్పే పనులను వెంటనే అమలు చేసేందుకు కృషి చేస్తా. మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్ ప్రధాన సమస్యలపై తొలిపోరు.. నా డివిజన్లో కాలనీలు చాలా తక్కువ. అత్యధికంగా అపార్ట్మెంట్లు, మురికివాడలు ఉన్నాయి. ఇక్కడ భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అంతే కాకుండా శిథిల రోడ్లు, వెలగని విద్యుద్దీపాలు వంటి సమస్యలు చాలా ఉన్నాయి. డివిజన్లో అన్ని కాలనీలు, అపార్ట్మెంట్లకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకుచర్యలు తీసుకుంటాను. వివాదాస్పద స్థలంలో ఉన్న ఇళ్లకు ఇంటి నంబర్లు, పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని గ్రేటర్ ఎన్నికల్లో హామీ ఇచ్చాను. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తా. మురికివాడలైన ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, మక్తా మహబూబ్పేట్, బాలాజీ నగర్, న్యూకాలనీ, నడిగడ్డ తాండ, సుభాష్ చంద్రబోస్ నగర్, ప్రశాంత్ నగర్, కృషి నగర్, మయూరి నగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. వీటి పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. మియాపూర్ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషి చేస్తా. మంత్రి కేటీఆర్ మా డివిజన్ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, అదేవిధంగా ఇంటింటికీ నల్లా, మార్కెట్ల నిర్మాణం, అధునాతన శ్మశానవాటిక ఏర్పాటు తప్పకుండా ఏర్పాటు చేస్తా. వృద్ధులు అందరికీ ‘ఆసరా’ పథకం అందేలా చూ స్తాం. నా ప్రధాన ఎజెండా ప్రజా సమస్యలు తీర్చడమే. గెలిపించిన ప్రజల రుణాన్ని తీర్చుకుంటా. ఉప్పల్ కార్పొరేటర్ అనలారెడ్డి అందుబాటులో ఉంటా.. డివిజన్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించగలిగే పనులన్నీ పూర్తి చేస్తాం. స్థానికుల సహకారంతో మెరుగైన పాలనకు శ్రీకారం చుడతా. డంపింగ్ యార్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు, తాగునీటి కాలుష్యం.. వంటి సమస్యలను గుర్తించాం. ప్రధానంగా ఉప్పల్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ వద్ద ఉన్న చెత్త డంపింగ్ పాయింట్ (ట్రాన్సిట్ పాయింట్) వల్ల స్థానికంగా 25 కాలనీల్లో కలుషిత వాతావరణం ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై దృష్టి సారిస్తాం. తొలుత డంపింగ్ పాయింట్‌ను వేరేచోటుకు తరలించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరస్వతి కాలనీ, విజయపురి కాలనీ, సూర్యానగర్, శాంతినగర్, తదితర ప్రాంతాలు ఓపెన్ నాలాల వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితమవుతున్నాయి. ఈ సమస్యను కూడా ప్రాధాన్యం ఇస్తాను. ఔట్లెట్ లేని కారణంగా డివిజన్లో చాలా వరకు కాలనీలు మురుగుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దోమల బెడద, మురుగు కాలువలు పందులకు అవాసాలుగా మారాయి. అధికారుల సహాయంతో ఈ సమస్యను కూడా పరిష్కరిస్తాం. సౌత్ స్వరూప్నగర్తో పాటు మరికొన్ని కాలనీలలో మంచినీటి పైప్‌లైన్ లేదు. దేవేందర్‌నగర్‌లో ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారానే నీరు అందుతోంది. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రాంతాల్లో పైప్లైన్లు వేయిస్తాం. మంచినీటి సమస్యను పూర్తిగా తీరుస్తాం. గరీబోళ్లకు అండగా ఉంటా.. మంగళ్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ నిరుపేద కుటుంబంలో జన్మించిన నాకు సామాన్యులు ఎదుర్కొనే సమస్యలపై అనుభవం ఉంది. నగరంలో సొంత ఇల్లు లేకుండే పేదలు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. అది నాకు అనుభవమే. ఇప్పటికీ నాకు సొంత ఇల్లంటూ లేదు. అందుకే నా తొలి ప్రాధాన్యం గరీబోళ్లకే. పేదరికంలో మగ్గుతున్న నా కుటుంబానికి కొన్నేళ్లుగా నందకిషోర్ వ్యాస్ ట్రస్ట్ అండగా నిలిచింది. ట్రస్ట్‌లో నాకు ఉద్యోగం ఇచ్చారు. అంతేగాక కార్పొరేటర్‌గా టికెట్ ఇప్పించి గెలిపించారు. స్థానిక ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారు. నా డివిజన్లో అధికంగా నిరుపేదలే ఉన్నారు. వారికి ముఖ్యమంత్రి ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ పథకం ద్వారా ఇళ్లను మంజూరు చేయించేందుకు నా వంతు కృషి చేస్తాను. చాలా కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నాయి. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను. నాకు చిన్ననాటి నుంచి గరీబీతనం తెలుసు. గరీబోళ్ల సంక్షేమమే నా ధ్యేయం. మూసీ ప్రాంతం సుందరీకరణే లక్ష్యం.. కొత్తపేట కార్పొరేటర్ సాగర్‌రెడ్డి డివిజన్లోని చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ, మంచినీరు, సీసీరోడ్లు వంటి మౌలిక వసతులు లేవు. ఎన్నికల ప్రచారంలో వాటిని గుర్తించా. ప్రతి సమస్యను నోట్ చేసుకున్నా. ఇకపై అక్కడ సదుపాయాల కల్పనకే నా ప్రథమ ప్రాధాన్యం ఇస్తాను. డివిజన్‌ను ఆనుకుని ఉన్న మూసీ ప్రాంత సుందరీకరణకు నా వంతు ప్రయత్నం చేస్తాను. మూసీ వెంట లుంబినీ పార్కులా అందమైన పార్కు ఏర్పాటు చేయడమే నా కల. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాను. చదువుకునే రోజులలో ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేవాడిని. అక్కడి నేలంతా పచ్చని పొలాలతో ఎంతో బాగుంది. ఇక్కడ మాత్రం నీరు లేక ఇబ్బందులు పడేవారు. అక్కడి స్ఫూర్తితో తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. హైటెక్‌సిటీ బిల్డింగ్ కన్ష్ట్రక్షన్స్లో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉద్యోగం మానేసి ఉద్యమంలో భాగమయ్యా. డివిజన్లో ప్రతి ఒక్కరూ ఉపాధి బాట పట్టాల్సిందే. అదే నాధ్యేయం. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తాను. అధికారులతో కలిసి డివిజన్‌ను అభివృద్ధి పథాన నడిపిస్తాను. ఇందుకోసం అందరి సహకారం తీసుకుంటాను. కార్మికుల పక్షాన నిలుస్తా.. చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి డివిజన్లో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా చిన్నారులకు పౌష్టికాహారం సరిగా అందడం లేదు. దీంతో చిన్నారులకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను పెంచడం, వాటికి నాణ్యమైన సరుకులు అందించేలా దృష్టి పెడతా. మంజీరా పైప్‌లైన్ లేని ప్రాంతాలకు జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్ విభాగాలు నీరు అందిస్తున్నాయి. కానీ అది ప్రజలకు అరకొరగానే అందుతోంది. వచ్చేది వేసవి కావడంతో తాగునీటి సమస్య ఇంకా తీవ్రమవుతుంది. ట్యాంకర్ల ద్వారా వస్తున్న నీరు అక్రమ మార్గాలకు తరలకుండా చర్యలు తీసుకుంటాం. ఉదయం వేళల్లో మహిళలు రోడ్లు ఊడుస్తూ శానిటేషన్ నిర్వహిస్తున్నారు. కొంతమంది స్వార్థం వల్ల వారికి సరైన జీతభత్యాలు అందడం లేదని తెలిసింది. కొన్నిచోట్ల అందరూ వచ్చినట్టు హాజరు పట్టికలో ఉన్నా.. కేవలం ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తున్నట్టు గుర్తించాం. పనిచేసేవారికి ప్రభుత్వం ఇచ్చే జీతం సక్రమంగా అందేటట్టు చూస్తా. ప్రధానంగా చందానగర్ నుంచి అమీన్పూర్ వైపు వెళ్లే రోడ్డును 150 అడుగులు వెడల్పున వేయాలి. రోడ్డు కోసం స్థలం వదిలినా రోడ్డు మాత్రం వేయలేదు. దీంతో ఇరువైపులా ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈ రోడ్డును వేసేందుకు వెంటనే చర్యలు చేపడతాను. అర్హులకు ఇళ్లు ఇప్పిస్తా.. అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి ఇటీవల ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంతో పాటు అందరికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ఎన్నికలకు ముందు వ్యవసాయం, వ్యాపార వ్యవహారాలను చూసుకోవడంలో భర్త శ్రీనివాస్‌రెడ్డికి తోడుగా ఉండేదాన్ని. మామ కనకారెడ్డి ఎమ్మెల్యే. ఆయన వద్దకు వచ్చే ప్రజలకు అవసరమయ్యే సహాయ సహకారాలు అందించేవారు. అప్పుడు ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేవారు. డివిజన్లో ప్రచారానికి వెళ్లినప్పుడు చాలా సమస్యలను నేను గుర్తించాను. వీటీలో చాలా కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించాను. వాటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తా. డివిజన్లోని అర్హులైన వారందరికి డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు చేయించడం నా ప్రధమ కర్తవ్యం. ప్రతి ఇంటింటికి తాగు నీరు, కొత్త చెరువు, చిన్న రాయుని చెరువులను సుందరీకరణకు చర్యలు తీసుకుంటా. అల్వాల్ ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి పెంచి పునర్నిర్మాణం చేయడం నాలక్ష్యం. సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ పూర్తి సమయం ప్రజలకే.. ఎన్నికల ప్రచారంలో డివిజన్లోని గల్లీగల్లీ తిరిగాను. ఎన్నికలు, ప్రచారం, ప్రజా సమస్యల గురించి పూర్తిగా అప్పుడే తెలుసుకున్నాను. రెండు రోజులు ఇబ్బంది పడ్డా.. ఆ తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి శాయాశక్తులా కృషి చేయాలని నిశ్చయించుకున్నా. నగరంలోనే భారీ మెజారిటీ రావడం పట్ల కార్పొరేటర్‌గా నా బాధ్యత మరింత పెరిగింది. నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. సీతాఫల్మండిలో జూనియర్ కళాశాల ఏర్పాటనేది 25 ఏళ్ల కల. ఎన్నికలకు ముందే మంత్రి పద్మారావు ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించారు. డిగ్రీ కళాశాలకు కూడా. ఈ రెండు కళాశాలల ఏర్పాటులో నేనూ భాగస్వామిని అవుతున్నందుకు ఆనందంగా ఉంది. వీటితో పాటు ఇక్కడి ప్రభుత్వ విద్యాసంస్థలను ఆధునికీకరించి సీతాఫల్మండి డివిజన్‌ను విద్యా సంస్థలకు నిలయంగా మార్చాలని ఉంది. వాస్తవానికి ఎంబీఏ తర్వాత జెన్‌ప్యాక్, గూగుల్ సంస్థల్లో పనిచేశా. ఎంఎస్ కోసం ఫారిన్ వెళ్లాలని అన్నీ సిద్ధం చేసుకున్నా. మా నాన్న కరాటే రాజు కార్పొరేటర్‌గా గెలవగానే అమెరికాకు విమానం ఎక్కాలకున్నాను. ఒక్కరోజులోనే వ్యవహారమంతా మలుపు తిరిగింది. మహిళా రిజర్వేషన్ కారణంగా మా నాన్నకు అవకాశం లేకపోయింది. దీంతో నన్ను ఎన్నికల బరిలోకి దింపమని మంత్రి పద్మారావు సూచించారు. దీంతో అమెరికా చదువు కోరికను పక్కనబెట్టి బల్దియాలో అడుగుపెట్టాను. ఇక ఉద్యోగం, చదువు లేదిప్పుడు. పూర్తి సమయం డివిజన్ ప్రజలకే కేటాయిస్తా. తాగునీరు, డ్రైనేజీ వంటి ఇబ్బందులు చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నిత్యం డివిజన్లో తిరుగుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. అధికారులను సమన్వయ పరిచి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతా. రాజకీయాల కు నేను కొత్తే అయినా ప్రజల ఆదరణ పట్టుదలను పెంచింది. బాధ్యతతో మసులుకుంటా, నిస్వార్థంగా సేవ చేస్తా. యూసుఫ్‌గూడ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ రాజకీయాలకు తావుండదు.. మా తండ్రి మురళి గౌడ్ గతంలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌గా పనిచేయడం, నేను ఇక్కడే పుట్టి పెరగడంతో డివిజన్ పైన, ఇక్కడి అన్ని రకాల సమస్యలపైనా పూర్తిఅవగాహన ఉంది. డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, అక్రమ కట్టడాలు సహా అన్ని సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరుచుకొని పదవీకాలంలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తా. అత్యవసరమైన పనులకు తొలి ప్రాధాన్యం ఇస్తా. ప్రధానంగా ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉంది. ప్రజలకు నీటి సమస్యలు ఏర్పడకుండా చేయాల్సిన ఏర్పాట్లపై త్వరలోనే అధికారులతో కలిసి కార్యచరణ రూపొందించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాను. పెండింగ్‌లో ఉన్న వరదనీటి కాలువ నిర్మాణ పనులకు త్వరగా నిధులు మంజూరయ్యేలా అధికారులపై ఒత్తిడి తెస్తాను. అక్రమ కట్టడాలు అనేవి నగరవ్యాప్తంగా ఉన్న సమస్య. అక్రమ కట్టడాలను ప్రోత్సహించేది లేదు. తాతల కాలం నాడు వేసిన మురుగునీటి పైప్లైన్లు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. వీటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాను. నిర్మాణాత్మక సూచనలు ఎవరు ఇచ్చినా స్వీకరిస్తాను. అన్ని పార్టీలు, నాయకులను కలుపుకుపోతూ సమస్యల పరిష్కారానికి నావంతు కృషి చేస్తా. రాజకీయాలను పక్కనపెట్టి పూర్తిస్తాయిలో అభివద్ధిపై దృష్టి పెడతా. అవినీతికి దూరంగా పారదర్శకంగా వ్వవహరిస్తాను. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నా దృష్టికి తెస్తే సాధ్యమైనంత వేగంగా పరిష్కారానికి కృషి చేస్తాను. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటా. నా ఫోన్ నెంబర్, వాట్సప్, ఫేస్బుక్ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి.. ప్రజల కోసం దేనికైనా సిద్ధమే.. ప్రజల సమస్యలను ఏడాది కాలం నుంచి దగ్గర నుంచి చూసిన అనుభవం ఉంది. గత ఏడాది నుంచి బంజారాహిల్స్ ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాను. వాటి పరిష్కార మార్గాలు సైతం అప్పుడే ఆలోచించాను. నాపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. దాన్ని కాపాడుకుంటా. మా తండ్రి కేకే అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. ప్రజలకోసం ఏమైనా చేయాలనే తెగింపు ఆయన ద్వారానే నాకు వచ్చింది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవాలని ఆయన ఇచ్చిన సలహా ఎన్నికల ముందు బాగా పనిచేసింది. అందుకే భారీ మెజారిటీ వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్లో మహిళా భవన్ నిర్మాణం నా కలల ప్రాజెక్ట్. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఇక్కడ మహిళా భవన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించడమే కాకుండా సీఎం కేసీఆర్‌తో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించాం. త్వరలోనే ఇక్కడ పనులు ప్రారంభమవుతాయి. ప్రచారంలో భాగంగా ప్రతి గల్లీ తిరిగాను. చాలాచోట్ల రోడ్లు దెబ్బతినడం చూశాను. పలుచోట్ల డ్రెయినేజీ సమస్యను కూడా కళ్లారా చూశాను. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను దగ్గర నుంచి గమనించాను. వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టడం, పురోగతిపై వారి వెంటపడటం జరుగుతుంది. త్వరలోనే నేను చూసిన, నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలను నూరు శాతం పరిష్కరిస్తా. అమెరికాలో 18 ఏళ్ల పాటు ఉన్నా నా చదువంతా నగరంలోనే సాగింది. ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకసారి కళాశాల యూనియన్ ఉపాధ్యక్షురాలిగా, ఇంకోసారి యూనియన్ జాయింట్ సెక్రటరీగా గెలిచాను. ఆ అనుభవం కార్పొరేటర్‌గా నాకు ఉపయోగపడుతుంది. -
మహిళా కార్పొరేటర్‌ను లాగిపెట్టి కొట్టాడు
-
అధికార దర్పమే ఇరికించింది!
సాక్షి ప్రతినిధి, కడప : రాజకీయ నాయకుల చర్యలు, నడవడిక ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి. ప్రజామెప్పు పొందిన వారికే ఆదరణ లభిస్తుంది. పాతతరం నాయకుల చర్యలు అచ్చం అలానే ఉండేవి. స్వార్థ చింతనకు దూరంగా, ప్రాంతం అభివృద్ధే ధ్యేయంగా మసులుకునేవారు. ప్రస్తుత నాయకులు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి చర్య వెనుక తనకేమిలాభం అన్న ధోరణితోనే ముందుకు వెళ్తున్నారు. అధికారం ఉందంటే విచక్షణ మరిచి మరీ అడ్డంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి వ్యవహారంలోనూ తలదూరుస్తూ వివాదాస్పదమౌతున్నారు. అచ్చం అలాంటి పరిస్థితే కడప నగర టీడీపీ నేత బాలకృష్ణయాదవ్ కొనసాగించారు. వెరశి ఓ హత్య కేసులో చిక్కుకున్నారు. బాలకృష్ణ యాదవ్ కడప కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా నిలుచుండిన్నారు. కడపలో టీడీపీకి ప్రజాదరణ లేకపోవడం కారణంగా మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన కార్పొరేటర్‌గా ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ప్రవర్తించడంలో ఆయన ముందు వరుసలో నిలిచారు. అందుకు జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజాద్బాషలకు అడ్డు తగులుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించారు. అధికార దర్పంతో వ్యూహాత్మకంగా ఫోకస్ అయ్యేలా ఆయన చర్యలు ఉండేవి. ఇతని దుశ్చర్యలను ప్రభుత్వ యంత్రాంగం నియంత్రించకపోవడంతో మరింత అడ్డుఅదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం బాలకృష్ణయాదవ్‌కు వ్యక్తిగతంగా రాజకీయ భవిష్యత్ సైతం ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం కడప నగర టీడీపీ అధ్యక్షుడుగా పార్టీ పదవి కట్టబెట్టేందుకు సంసిద్ధమైన తరుణంలో హత్య కేసులో నాల్గువ నిందితుడుగా ఇరుక్కుపోయారు. స్వీయ నియంత్రణ లేకపోవడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. కడప గడపలో ప్రతి వ్యవహారంలో జోక్యం... కడపలో చిన్నచిన్న పంచాయితీలు చేయాలన్నా, పోలీసుస్టేషన్లో సెటిల్మెంట్లు చేయాలన్నా నేనున్నానని బాలకృష్ణయాదవ్ ముందుండేవారని పరిశీలకులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్లో భవనాలకు అనుమతులు ఇవ్వాలన్నా, దేశం నేత అనుమతి లేకుంటే నిరాకరించే స్థాయికి యంత్రాంగం వచ్చింది. ఓ వైపు అధికారులు ఛీత్కరిస్తున్నా పట్టించుకోకుండా అడ్డంగా వ్యవహరించడం ఇటీవల సర్వ సాధారణమైంది. ఇటీవల ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ ప్రైవేట్ బిల్డింగ్ వ్యవహారంలో తల దూర్చి ధర్నా నిర్వహించడం చూసి పలువురు నవ్వుకున్నారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. పులివెందులకు చెందిన సతీష్‌కుమార్‌రెడ్డి కిడ్నాప్...ఆపై హత్య వ్యవహారంలో సైతం అదే రీతిలో వ్యవహరించారు. నిర్భందించి చితక బాదడం, రక్త గాయాలతో ఉన్న సతీష్‌కుమార్‌రెడ్డి ఫొటోలను వాట్సాప్‌లో వారి బంధువులకు పంపడం వెనుక పూర్తిగా అధికార దర్పంతోనే విర్రవీగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి అవే ఫోటోలు బాలకృష్ణ యాదవ్‌ను హత్య కేసులో నిందితుడుగా చేర్చగల్గాయి. అధికార దర్పంతో ఇదే రీతిలో వ్యవహరిస్తున్న నేతలపై ఇక నుంచి అయినా నిఘా ఉంచి నియంత్రించాల్సి ఉంది. రాజకీయ పైరవీలు సతీష్‌కుమార్‌రెడ్డి హత్య కేసులో తనపాత్ర లేదని, తెలిసిన వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయమని చెప్పానని.. ఈ వ్యవహారంలో తనను గట్టెక్కించండని బాలకృష్ణ యాదవ్ ప్రభుత్వ పెద్దల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సతీష్‌కుమార్‌రెడ్డి హత్యోదంతం తెరపైకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన తన సామాజిక వర్గానికి చెందిన నాయకుని ద్వారా ప్రభుత్వ పెద్దల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పోలీసులపై కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. అమానుషంగా సతీష్‌కుమార్‌రెడ్డిని హింసించి చంపిన వారిని కఠినంగా శిక్షించాలన్న బాధితుల డిమాండ్ ఓ వైపు, అధికార పార్టీ నేతల ఒత్తిడి మరో వైపు ఉండగా పోలీసుల తీరు ఎలా ఉంటుందోన న్న చర్చ సాగుతోంది. -
పురపాలకులకు పెంచిన వేతనాలు ఏప్రిల్ నుంచే..
సాక్షి, హైదరాబాద్: నగర/పుర పాలక సంస్థల పాలకవర్గ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యుల గౌరవ వేతనాల పెంపు వచ్చేనెల(ఏప్రిల్) నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలికల స్థాయి ఆధారంగా ఆయా పాలకవర్గాలకు కొత్త వేతనాలను ఈ ఉత్తర్వుల్లో ప్రకటించారు. కొత్త వేతనాలు ఇలా ఉన్నాయి. హోదా గౌరవ వేతనం కేటగిరీ-1: మునిసిపల్ కార్పొరేషన్లు మేయర్ 50,000 డిప్యుటీ మేయర్ 25,000 కార్పొరేటర్ 6,000 కేటగిరీ-2: సెలక్షన్, స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీలు చైర్మన్ 15,000 వైస్ చైర్మన్ 7,500 వార్డు మెంబర్లు 3,500 కేటగిరీ-3: ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు చైర్మన్ 12,000 వైస్ చైర్మన్ 5,000 వార్డు మెంబర్లు 2,500 -
డాంగే సతీమణికే కార్పొరేటర్ టికెట్
విజయవాడ: పదకొండో డివిజన్ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన స్థానంలో ఆయన సతీమణి కృష్ణకుమారికి టికెట్ ఖరారైంది. ఈ విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా తెలియజేశారు. పటమటలోని నల్లూరువారి కళ్యాణమండపంలో జరిగిన డాంగే సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. (పటమట) -
వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్‌పై టీడీపీ వర్గీయుల దాడి
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రోజూ కూర్చునే సీట్లలో టీడీపీ కార్పొరేటర్లు కూర్చున్న విషయంలో వివాదం మొదలైంది. దీనిపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్‌పై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఇదే సమయంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ వర్గీయులు పరస్పరం కుర్చీలతో కొట్టుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. -
ముదురుతున్న ఎర్రబుగ్గ వివాదం
సాక్షి, ముంబై: స్నేహల్ ఆంబేకర్ ముంబై మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగు రోజులైనా కాలేదు కానీ వివాదాలు మాత్రం ఆమెను ముసురుకుంటున్నాయి. తన కారుపై ఎర్ర బుగ్గ (బీకన్) తొలగించకుండా అలాగే ఉంచాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. మేయర్ వాహనానికి ఎర్రబుగ్గ అమర్చడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కోర్టును ఆశ్రయిస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. దీంతో స్నేహల్ కొత్త వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు మినహా ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవుల్లో ఉన్న వారు ఎర్రబుగ్గ వాహనాలను వినియోగించకూడదు. ఇది మేయర్ కూడా వర్తిస్తుంది. అంబేకర్ మాత్రం తన వాహనంపై కచ్చితంగా ఎర్రబుగ్గ ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో ఈ వివాదం మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించడమంటే న్యాయస్థానాన్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఒకవేళ ఆమె తన వాహనంపై ఎర్రబుగ్గ అమర్చుకుంటే, తప్పకుండా కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని విపక్ష నాయకులు హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేయర్లంతా తమ వాహనాలపై ఎర్రబుగ్గ తొలగించుకోవాల్సిందేనని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు మేయర్‌గా పనిచేసిన సునీల్ ప్రభు మాత్రం ఎర్రబుగ్గను యథావిధిగా కొనసాగించారు. కొత్త మేయర్ స్నేహల్ ఆంబేకర్ కూడా దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీవీఐపీలు మాత్రమే ఎర్రబుగ్గలను వాహనాలకు అమర్చుకోవాలి. అంతగా అవసరమనుకుంటే అంబేకర్ పసుపు రంగు బుగ్గ అమర్చుకోవాలి. వీఐపీలకు కేటాయించిన ఎర్రబుగ్గను మేయర్ అమర్చుకోవడం సరికాదు’ అని దేవేంద్ర స్పష్టం చేశారు. దీనిపై స్నేహల్ ఆంబేకర్ వివరణ ఇస్తూ కారుపై ఎర్రబుగ్గ అమర్చుకోవడంపై తనకు పెద్దగా ఆసక్తి లేదన్నారు. ఇతరుల మాదిరిగా తను గొప్పలకు పోవడం లేదని చెప్పారు. ‘దేశ, విదేశాల నుంచి ముంైబె కి వచ్చే వీఐపీలకు స్వాగతం పలకాల్సిన బాధ్యత మేయర్‌ది. ఇలాంటి సందర్భాల్లో వాహనంపై ఎర్రబుగ్గ ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది. దీనిపై సీనియర్ నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాను’ అని ఆమె స్పష్టం చేశారు. అంబేకర్ మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిరోజు బాధ్యతలేంటో అడిగి తెలుసుకోకుండా తన చాంబర్ అలంకరణపై దృష్టి పెట్టారని విమర్శలు వచ్చాయి. తన క్యాబిన్‌ను ఎలా అలంకరించాలో కిందిస్థాయి అధికారులకు సూచనలిస్తూ ఆమె చాలా సేపు గడిపారు. ఉద్యోగులతో పరిచయాలు అయ్యాక, కొన్ని పత్రాలపై సంతకాలుచేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు ఆదరాబాదరగా వెళ్లిపోయారు. -
భగ్గుమన్న వర్గపోరు
అర్ధంతరంగా నిలిచిన పాలికె సౌధ ప్రారంభోత్సవం పోలీసుల అదుపులో బీబీఎంపీ కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి నాగరబావిలో 144 సెక్షన్ అమలు బెంగళూరు : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఆదివారం భగ్గుమన్నాయి. ఫలితంగా ప్రజాసౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉద్యానవనం, పాలికె సౌధ ప్రారంభం వాయిదా పడింది. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటన స్థలాన్ని బెంగళూరు నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్, డీసీపీ లాబూరామ్ పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. వివరాల్లోకి వెళితే... గోవిందరాజనగర నియోజవర్గంలో చంద్రగిరి ఉద్యానవనం, పాలికె సౌధను బీబీఎంపీ నిధులతో నాగవార పాలికె వార్డు కార్పొరేటర్ ఉమేష్ శెట్టి నిర్మించారు. అత్యంత సుందరంగా రూపొందిన ఈ పార్క్‌ను ఆగష్టు 16, 24 తేదీలలో ప్రారంభించాలని అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వేడుకలు వాయిదా పడ్డాయి. ఆదివారం పాలికె సౌధతో పాటు పార్క్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, దినేష్ గుండూరావుతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్, స్థానిక ఎమ్మెల్యే ప్రియాకృష్ణను కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సభా ఏర్పాట్లను ఉమేష్‌శెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు పోలీసులు, ఎమ్మెల్యే ప్రియాకృష్ణ(కాంగ్రెస్) అనుచరులు చేరుకున్నారు. ఉమేష్శెట్టితో ఎమ్మెల్యే అనుచరులు వాదనకు దిగారు. గొడవ ఎక్కువ కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఉమేష్శెట్టిని అదుపులోకి తీసుకుని కేఎస్ఆర్పీ మైదానంలోకి తీసుకెళ్లారు. తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు : బీబీఎంపీ నిధులతో అభివృద్ది చేసిన చంద్రగిరి పార్క్, పాలికె సౌధల ప్రారంభోత్సవాల వేడుకలను స్థానిక నాగరబావి కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని స్థానిక శాసన సభ్యుడు ప్రియాకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలికె నిధులతో ఏర్పాటు చేస్తే బీజేపీ నాయకులను పిలిపించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కనీసం తనను ఈ కార్యక్ర మానికి ఆహ్వానించలేదని మండిపడ్డారు. నాగరబావి వార్డు కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి మాట్లాడుతూ ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. నాగరబావి వార్డు అభివృద్ది చెందడం స్థానిక శాసన సభ్యుడు ప్రియాకృష్ణకు ఇష్టం లేదని మండిపడ్డారు. -
లెక్కా పత్రం లేదు
మొక్కుబడిగా సమీక్ష వివరాలివ్వని జీహెచ్ఎంసీ అధికారులు సమీక్ష సోమవారానికి వాయిదా సాక్షి, సిటీబ్యూరో: పేరుకే అది సమీక్ష. ఏ పనులపై సమీక్ష అని ప్రకటించారో ఆ పనులకు సంబంధించి సరైన సమాచారం లేదు. వాటిల్లో ఎన్ని పూర్తయ్యాయో.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో .. పనులు ఏ దశలో ఉన్నాయో వివరాలు లేవు.. జీహెచ్ఎంసీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సోమవారం మేయర్ మాజిద్ హుస్సేన్ నేతృత్వంలో సమీక్ష తీరూ..తెన్నూ. జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులకు సంబంధించి రెండేళ్లుగా పాలకమండలి, స్టాడింగ్ కమిటీ చేసిన తీర్మానాలపై సోమవారం మేయర్ మాజిద్ హుస్సేన్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. సమీక్షలో అధికారులు మొక్కుబడిగా వివరాలను అందించారు. రెండేళ్లుగా ఎన్ని తీర్మానాలు చేశారు. వాటిల్లో ఎన్ని పూర్తయ్యాయి..అవి ఏ దశల్లో ఉన్నాయో సమాచారం లేదు. కనీసం ఇచ్చిన అంశాలు.. పనులైనా వరుసక్రమంలో ఉన్నాయా అంటే అదీ లేదు. ఇంజినీరింగ్ విభాగం నుంచి అందిన కొన్ని పనుల చిట్టాను తీసుకొచ్చి వాటినే సభ్యులకు అందజేశారు. సమావేశంలో ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లు దిడ్డిరాంబాబు(కాంగ్రెస్), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ) , నజీరుద్దీన్(ఎంఐఎం), స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హడావుడిగా ఇచ్చిన కాగితాల్లోని అంశాలను చూడటానికే వారికి సమయం సరిపోలేదు. కనీసం ఒకరోజు ముందుగా వివరాలందజేస్తే.. వాటిని పరిశీలించేందుకు వీలుండేదని ఫ్లోర్‌లీడర్లు వాపోయారు. సమీక్ష అంశాన్ని పక్కనబె ట్టి కార్పొరేటర్లకు నిధులు పెంచాలని, జోనల్‌స్థాయిలో మంజూరును రూ. 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. పనులను పెద్ద ప్రాజెక్టులుగా చేపట్టాలని.. కనీసం రూ. ఒక్కో ప్రాజెక్టు విలువరూ. 50 కోట్లకు తగ్గకుండా ఉండాలనే కమిషనర్ సోమేశ్‌కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒక్కో కార్పొరేటర్‌కు 5వేల మొక్కలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ల పనుల్ని అధికారులు పట్టించుకోవడం లేరని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు సమీక్షించాల్సిన అంశాల్ని విస్మరించారు. కార్పొరేటర్ల బడ్జెట్ నిధుల విడుదలలో ఏయే పనులకు ఎంతమేర నిధులో మార్గదర్శకాలు అవసరం లేదని, కార్పొరేటర్లు ఏ పనులు కావాలంటే అవి చేపట్టాలని పట్టుబట్టారు. తమ బడ్జెట్ నిధుల వినియోగంలో తమకే పూర్తిస్వేచ్ఛ కావాలని డిమాండ్ చేశారు. డంపర్బిన్లు, చెత్త రిక్షాలు తగినన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పనుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు సీఈ, ఎస్ఈలనే జోన్లకు పంపించాలని కోరారు. పనులకు సంబంధించి సరైన నివేదిక లేకపోవడం.. ఆయా డిమాండ్లపై గందరగోళం.. నేపథ్యంలో తీర్మానాల అమలు సమీక్షను మేయర్ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. అధికారులు పూర్తి చేశామని చెబుతున్న పనులకు సంబంధించి నమూనాగా కొన్నింటిని తనిఖీ చేద్దామన్న మేయర్ సవాల్‌కు అధికారుల నుంచి మౌనమే సమాధానమైనట్లు తెలిసింది. అన్ని ప్రాంతాల్లో లిట్టర్ ఫ్రీ .. స్టాండింగ్ కమిటీకి తెలియకుండా లిట్టర్ఫ్రీని ప్రారంభించారని అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిట్టర్‌ఫ్రీ విధానాన్ని అన్ని జోన్లలో ప్రవేశపెట్టాలని, కేవలం 23 కి.మీ.లలో కాకుండా దాదాపు 300 కి.మీ.ల మేర చేపట్టాలని అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లు కోరారు. వారం రోజుల్లోగా ఈ పనులు చేపట్టాలనడం కోరారు. గ్రేటర్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. సమగ్ర రహదారుల అభివృద్ధిపనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రూ. 5 కోట్లకు పైబడిన పనులు చాలా కాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని మేయర్ ప్రస్తావించగా, వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్, స్పెషల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
కార్పొరేటర్ పదవి రద్దు
సాక్షి, ముంబై: తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించినందుకుగాను ఎమ్మెన్నెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక శృంగారే కార్పొరేటర్ పదవిని ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలని ప్రియాంక నిర్ణయించుకున్నారు. 2012 ఫిబ్రవరిలో జరిగిన నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో విఖ్రోలిలోని కన్నంవార్ నగర్ వార్డు నంబరు 112 నుంచి ఎమ్మెన్నెస్ టికెట్పైప ఎస్సీ రిజర్వేషన్ కోటా కింద ప్రియాంక శృం గారే పోటీ చేశారు. అప్పట్లో నామినేషన్ పత్రాలతో ఆమె కులధ్రువీకరణ పత్రం సమర్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించారని ఆరోపిస్తూ రెండో స్థానంలో నిలిచిన శివసేనకు చెందిన అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాస్తవాలను పరిశీలించిన కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ సదరు పత్రం సరైనది కాదంటూతేల్చి చెప్పిం ది. దీంతో ఆమె కార్పొరేటర్ పదవిని రద్దు చేస్తున్నట్లు మేయర్ సునీల్‌ప్రభు ప్రకటించారు. అంతేగాకుండా 2012 ఏప్రిల్ 17 నుంచి ఆమె బీఎంసీ ద్వారా పొం దిన గౌరవ వేతనం, ఇతర భత్యాలు, ఫలాలు తిరిగి తీసుకుంటామన్నారు. అంతటితో ఊరుకోకుండా ఆమెకు బీఎంసీ పరిపాలనా విభాగం అందజేసిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఫోన్ బిల్లుల తాలూకు సొమ్మును తిరిగి వసూలు చేసుకుంటామన్నారు.అయితే ప్రియాంక శృంగారే కార్పొరేటర్ పదవి రద్దు కావడంతో ఈ వార్డులో ఉప ఎన్నిక నిర్వహిస్తారా? లేక రెండో స్థానంలో నిలిచిన శివసేనకు చెందిన శ్రద్ధా రుకేకు కట్టబెడతారా? అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుం టామని మేయర్ సునీల్ ప్రభు చెప్పారు.