హైదరాబాద్‌లో సాక్షి ప్రతినిధులపై దాడి

సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి అనుచరులు సాక్షి ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి తమ ప్లాట్‌ను కబ్జా చేశారని నల్లగొండకు చెందిన ఓ కుటుంబం ఆదివారం ధర్నా నిర్వహించింది. ఆయన ప్రచార రథాన్ని బాధిత కుటుంబం అడ్డుకుంది. కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులపై సామ తిరుమల్‌రెడ్డి అనుచరులు దాడి చేశారు. సాక్షి రిపోర్టర్ ఫోన్‌ను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి