హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. | fire accident in scab godown in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Dec 19 2017 7:34 AM | Updated on Sep 5 2018 9:47 PM

fire accident in scab godown in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బైరామల్‌ గూడాలోని ఓ బిస్కెట్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలంగా మారింది. ఎల్బీ నగర్‌ బైరామల్‌గూడలోని ఓ స్కాబ్‌ గోడౌన్‌లో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఐదు ఫైర్‌ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాం చేశారు.

గోడౌన్‌లో ప్లాస్టిక్‌ పదార్థాలు, సీసాలు ఉండటంతో ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు.  ఈ ఘటనపై కార్పొరేటర్‌ మాట్లాడుతూ.. ఫైర్‌ సిబ్బంది అప్రమత్తంతో ప్రమాదం తప్పిందన్నారు. మూడు గోడౌన్‌లో ఉన్న వస్తువులు పూర్తిగా  కాలిపోయాయని ఆయన చెప్పారు. పెద్ద మొత్తంలో ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించామన్నారు. గోడౌన్‌లో పాత ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో ప్రమాదం సంభవించి ఉంటుందని ఆయన అంచనా వేశారు.  

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement