భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌పై కేటీఆర్‌ సీరియస్‌.. డీజీపీకి ఆదేశాలు

KTR Serious On Bholakpur Coporator Behaviour Towards Police - Sakshi

హైదరాబాద్‌: భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ మొహ్మద్ గౌసుద్దీన్ ప్రవర్తనపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు, వాళ్లతో దురుసుగా వ్యవహరించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్‌ బుధవారం కోరారు. 

భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ ‘నెల రోజులు కనిపించొద్దంటూ..’ పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది కూడా. ఈ మేరకు విషయాన్ని ట్విటర్‌లో కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. 

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని పేర్కొన్న కేటీఆర్‌, తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా ఆ వ్యక్తులను వదలొద్దంటూ  డీజీపీకి ఆయన సూచించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి మంగళవారం అంతా ట్విటర్‌లో వైరల్‌ కాగా. మొహ్మద్ గౌసుద్దీన్ ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

చదవండి: కేటీఆర్‌ ట్వీట్‌ హాస్యాస్పదం!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top