బాలికపై కార్పొరేటర్‌ ఘాతుకం | Corporator Held For Raping Minor In MP | Sakshi
Sakshi News home page

మనవరాలి వయసున్న బాలికపై కార్పొరేటర్‌ ఘాతుకం

Jul 2 2019 3:11 PM | Updated on Jul 2 2019 3:41 PM

Corporator Held For Raping Minor In MP - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మైనర్‌ బాలికపై కార్పొరేటర్‌ వికృత చర్య

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ నగర ఇండిపెండెంట్‌ కార్పొరేటర్‌ను 11 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏడాదికి పైగా ఈ దారుణం కొనసాగుతోందని బాధిత బాలిక వెల్లడించిందని బెతుల్‌గంజ్‌ ఏఎస్‌ఐ జుగల్‌ కిషోర్‌ తెలిపారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేశామని, కార్పొరేటర్‌ రాజేంద్ర సింగ్‌ చౌహాన్‌ (59) భార్య, కుమారుడిని ప్రశ్నించిన అనంతరం నిందితుడు చౌహాన్‌ లొంగిపోయారని వెల్లడించారు.

కార్పొరేటర్‌పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కార్పొరేటర్‌ పెద్దసంఖ్యలో సామూహిక రక్షా భందన్‌ కార్యక్రమాలు నిర్వహించేవాడని, ఈ క్రమంలో వందల మంది మహిళలు, బాలికలు ఆయనకు రాఖీకట్టేవారని పోలీసులు చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement