పదకొండో డివిజన్ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
విజయవాడ: పదకొండో డివిజన్ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన స్థానంలో ఆయన సతీమణి కృష్ణకుమారికి టికెట్ ఖరారైంది. ఈ విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా తెలియజేశారు. పటమటలోని నల్లూరువారి కళ్యాణమండపంలో జరిగిన డాంగే సంతాప సభలో ఆయన పాల్గొన్నారు.
(పటమట)