పాతబస్తీలో దారుణం.. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడి హత్య

సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లలిత్‌బాగ్ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ కార్యాలయంలో హత్య జరిగింది. లలిత్‌బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ అల్లుడు ముర్తుజా అనస్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అనస్‌ను ఉస్మానియా అసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు.
కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆరుగురు కలిసి అనస్‌పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కార్పొరేటర్ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడినట్లు తెలిపారు.
ఆరుగురు కలిసి కత్తులతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో అనస్ ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: కరీంనగర్‌లో వింతవ్యాధి కలకలం..! ఇప్పటికే కొడుకు, కూతురు, భార్య మృతి