breaking news
convertible cars
-
కొత్త కారు: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్
లగ్జరీ కార్ల విభాగంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మిని (MINI) భారత మార్కెట్లో మరో ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్ డస్ట్ ఎడిషన్ (MINI Cooper Convertible Stardust Edition) పేరుతో విడుదలైన ఈ ఓపెన్‌టాప్ కారు ధరను రూ.62.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత్‌కు దిగుమతి చేసే సీబీయూ మోడల్‌గా ఇది అందుబాటులో ఉంటుంది. మినీ ఇండియా వెబ్సైట్ ద్వారా ప్రత్యేకంగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించగా, డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది.ఆకట్టుకునే ఎక్స్టీరియర్స్టార్ డస్ట్ ఎడిషన్ సాధారణ కూపర్ కన్వర్టిబుల్తో పోలిస్తే మరింత ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తుంది. ఇందులో స్పార్క్లింగ్ కాపర్ గ్రే మెటాలిక్ పెయింట్‌ను ఉపయోగించారు. దీనికి కాంట్రాస్ట్‌గా సిల్వర్ మిర్రర్ క్యాప్స్, 18 అంగుళాల జేసీడబ్ల్యూ ర్యాలీ స్పోక్ అల్లాయ్ వీల్స్ అందించారు. బ్లాక్ కలర్ ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మినీ యువర్స్ సాఫ్ట్ టాప్కు ప్రత్యేకమైన వోనెన్ యూనియన్ జాక్ గ్రాఫిక్ ఉండటం ఈ ఎడిషన్‌కు మరింత బ్రిటిష్ టచ్‌ను ఇస్తుంది.కన్వర్టిబుల్ సాఫ్ట్ టాప్‌ను డ్రైవింగ్‌లోనే ఆపరేట్ చేయవచ్చు. మినీ అధికారిక వివరాల ప్రకారం, ఎలక్ట్రిక్ Z-ఫోల్టిండ్ రూఫ్‌ను గంటకు 30 కిలోమీటర్ల వేగం వరకు తెరవడం లేదా మూసివేయడం సాధ్యమవుతుంది. అలాగే 40 సెంటీమీటర్ల వరకు తెరుచుకునే సన్‌రూఫ్ మోడ్ కూడా ఉంటుంది.ప్రీమియం క్యాబిన్క్యాబిన్లో మినీ ప్రత్యేకమైన డిజిటల్ అనుభూతిని అందిస్తోంది. మినీ ఆపరేటింగ్ సిస్టమ్ 9తో పనిచేసే వృత్తాకార హై-రిజల్యూషన్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రీసైకిల్ చేసిన మెటీరియల్స్‌తో రూపొందించిన వెస్సిన్ స్పోర్ట్స్ సీట్లు, హెడ్-అప్ డిస్ప్లే, హర్మన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రీమియం అనుభూతిని పెంచుతాయి. కొత్త తరం మినీ కన్వర్టిబుల్‌లో వెస్సిన్ అప్హోల్స్టరీ, డిజిటల్ ఇంటీరియర్ వంటి అంశాలను బీఎండబ్ల్యూ గ్రూప్ కూడా ధ్రువీకరించింది.మినీ కూపర్ కన్వర్టిబుల్ నలుగురు ప్రయాణికులకు అనువుగా ఉంటుంది. రూఫ్‌ను మడిచినప్పుడు బూట్ సామర్థ్యం తగ్గినా, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే స్థలం లభిస్తుంది. మినీ అధికారిక సమాచారంలోనూ నాలుగు సీట్ల కాన్ఫిగరేషన్‌ను ధ్రువీకరించింది.204 హెచ్‌పీ పవర్.. 6.9 సెకన్లలో 100 కిమీ వేగంపనితీరు విషయంలోనూ ఈ కన్వర్టిబుల్ ఏమాత్రం తగ్గదు. ఇందులో 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల మినీ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 204 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ను 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ స్టెప్‌ట్రోనిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.ఈ కారు గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.9 సెకన్లలో అందుకుంటుంది. మినీ ఇండియా ప్రస్తుత అధికారిక స్పెసిఫికేషన్లలో ఇదే 6.9 సెకన్ల యాక్సిలరేషన్‌ను పేర్కొంటోంది. -
బీఎండబ్ల్యూ కొత్త హ్యాచ్, కన్వర్టబుల్ కార్లు
గుర్గావ్ : జర్మనీ లగ్జరీ కారు తయారీదారు బీఎండబ్ల్యూ మినీ హ్యాచ్, కన్వర్టబుల్లో అప్డేటెడ్ వెర్షన్లను నేడు భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త మినీ 3-డోర్ కూపర్ ఎస్, మినీ 3-డోర్ కూపర్ డీ, మినీ 5-డోర్ కూపర్ డీ, కొత్త మినీ కన్వర్టబుల్ కూపర్ ఎస్ వెర్షన్లలో నేటి నుంచి అన్ని మినీ డీలర్‌షిప్‌ల వద్ద 2018 జూన్ నుంచి అందుబాటులో ఉండనున్నాయని బీఎండబ్ల్యూ చెప్పింది. ఎక్స్‌షోరూంలో వీటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.... మినీ 3-డోర్ కూపర్ డీ (డీజిల్) : రూ.29,70,000 మినీ 3-డోర్ కూపర్ ఎస్ (పెట్రోల్) : రూ.33,20,000 మినీ 3-డోర్ కూపర్ డీ (డీజిల్) : రూ.35,00,000 మినీ కన్వర్టబుల్ కూపర్ ఎస్(పెట్రోల్) : రూ.37,10,000 భారత్‌లో ప్రీమియం మినీ కారు సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్త మినీ హ్యాచ్, కొత్త మినీ కన్వర్టబుల్ లాంచ్ చేసినట్టు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పా చెప్పారు. ఈ కొత్త కార్లపై కొత్త మినీ లోగో, టెయిల్‌గేట్, స్టీరింగ్ వీల్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, రిమోట్ కంట్రోల్, సర్క్యూట్ రింగ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. టైయిల్ల్యాంప్స్ యూనిక్ జాక్ డిజైన్‌తో రూపొందాయి. ఇంటీరియర్ ఫీచర్లు... మల్లి ఫంక్షనింగ్ స్టీరింగ్, 6.50 అంగుళాల కలర్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే విత్ బ్లూటూత్ ఆప్షనల్ 6.5 టచ్‌స్క్రీన్ సిస్టమ్ విత్ మినీ రేడియో విజ్యువల్ బూస్ట్ మినీ వైర్డ్ ప్యాకేజ్ దీనిలో 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ విత్ టచ్‌ప్యాడ్ కంట్రోలర్, మినీ ఫైండ్ మేట్, నేవిగేషన్ సిస్టమ్ ప్రొఫెషినల్, మినీ కనెక్టెడ్ ఎక్స్ఎల్, టెలిఫోనీ విత్ వైర్లెస్ ఛార్జింగ్, సెకండ్ యూఎస్బీ ఇంటర్ఫేస్, 20జీబీ ఇంటర్నల్ హార్డ్‌డ్రైవ్ ఉన్నాయి. ఇంజిన్, పనితీరు 3-డోర్ కూపర్ ఎస్, కన్వర్టబుల్ వెర్షన్లు 2.0 లీటర్, 4 సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉన్నాయి. 3-డోర్ కూపర్ ఎస్ టాప్ స్పీడు 235 కేఎంపీహెచ్, కేవలం 6.7 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్ చేరుకోనుంది 3-డోర్ కూపర్ డీ, 5-డోర్ కూపర్ డీ వెర్షన్లు 1.5 లీటర్ 3 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. పెట్రోల్ మాదిరిగా కాకుండా ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సమిషన్తో రూపొందింది. 3, 5 డోర్ కూపర్ డీ టాప్ స్పీడ్ 205 కేఎంపీహెచ్, ఇది 9.2 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్‌ను అందుకోగలదు. మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని పొందడానికి, మినీ ఆటో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌ను కలిగి ఉంది. ఈ వాహనాల్లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నింగ్ బ్రేక్ కంట్రోల్, రన్ ఫ్లాట్ టైర్లు ఉన్నాయి. -
మెర్సిడెజ్ నుంచి 2 కొత్త కన్వర్టబుల్ కార్లు
ధర శ్రేణి రూ.60 లక్షలు- రూ.2.25 కోట్లు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెజ్ బెంజ్’ నుంచి మరో రెండు టాప్‌లెస్ బ్యూటీ కార్లు మార్కెట్లోకి వచ్చారుు. కంపెనీ తాజాగా రెండు కొత్త కన్వర్టబుల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘సి-300 క్యాబ్రియోలెట్’, ‘ఎస్-500 క్యాబ్రియోలెట్’ అనే ఈ కార్ల ధరలు వరుసగా రూ.60 లక్షలుగా, రూ.2.25 కోట్లుగా (ఎక్స్‌షోరూమ్ న్యూఢిల్లీ) ఉన్నారుు. తమ ‘టాప్ ఆఫ్ పిరమిడ్’ వ్యూహంలో భాగంగా అంతర్జాతీయ పోర్ట్‌ఫోలియోలోని అత్యుత్తమ ప్రొడక్ట్‌లను భారతీయుల కోసం ఇక్కడి మార్కెట్లోకి తీసుకువచ్చామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో రొనాల్డ్ ఫాల్గర్ తెలిపారు. తాజా కార్ల ఆవిష్కరణతో భారత్‌లోని ప్రీమియం కార్ల విభాగంలో తమ స్థానం మరింత పదిలమౌతుందని ధీమావ్యక్తం చేశారు. ఇక ఈ కొత్త కార్లతో భారత్‌లో అతిపెద్ద కన్వర్టబుల్ పోర్ట్‌ఫోలియోను కలిగిన వాహన కంపెనీగా అవతరించామని పేర్కొన్నారు. సి-300: ఇందులో 2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగా న్ని 6.4 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. ఇందులోని ఫ్యాబ్రిక్ రూఫ్ 20 సెకన్లలో ఫోల్డ్ అవుతుందని పేర్కొంది. ఈ కారులో 9 స్పీడ్ ట్రాన్సమిషన్ను పొందుపరిచినట్లు తెలిపింది. ఎస్-500: ఈ కారులో 4.7 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.6 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. ఇందులోని ఫ్యాబ్రిక్ రూఫ్ 20 సెకన్లలో ఫోల్డ్ అవుతుందని పేర్కొంది. ఈ కారులో 9 స్పీడ్ ట్రాన్సమిషన్ను పొందుపరిచినట్లు తెలిపింది.


