breaking news
Control of the police
-
ఆరేళ్ల బాలికపై అత్యాచారం
ఆలస్యం వెలుగులోకి వచ్చిన వైనం పోలీసుల అదుపులో నిందితుడు శ్రీకాళహస్తి: ఓ వుృగాడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన శ్రీ కాళహస్తి వుండలంలో గురువారం ఆల స్యంగా వెలుగు చూసింది. సీఐ చిన్నగౌష్ కథనం మేరకు... తొట్టంబేడు వుం డలం, విరూపాక్షపురం దళితవాడకు చెందిన తొండు రాజ్‌కుమార్(25) శ్రీకాళహస్తి వుండలం, రాచగున్నేరి సమీపం లో ఉన్న ఓ ప్రైవేటు కర్మాగారంలో దినకూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు రాచగున్నేరి పంచాయుతీ పరిధిలోని ఛటర్జీనగర్ కోళ్లఫారం వద్ద నివాసం ఉంటూ కర్మాగారానికి వెళుతున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆరేళ్ల బాలిక వుంగళవారం సాయుంత్రం తన ఇంటి సమీపంలోని ఇసుకలో ఆడుకుంటుండగా రాజ్‌కువూర్ ఆమెకు వూయు వూటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. బాలిక పై అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక ఏ డుస్తూ వచ్చి తన తల్లికి ఆ విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు రాజ్కువూర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటను గురువారం మీడియాకు తెలిపారు. -
శిల్పను చంపేశారు!
భర్తే ప్రధాన నిందితుడు భరణం చెల్లించలేకే హత్య పోలీసుల అదుపులో నిందితులు పలమనేరు: నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె మండ లం కమ్మనపల్లె పంచాయతీ ఎర్రకదిరే పల్లెకు చెందిన వివాహి త శిల్ప దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మూడున్నర నెలల క్రితం పలమనేరు కోర్టుకు వాయిదాకు హాజరైన శిల్ప ఆ తర్వాత అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్ప హత్యకు గురైనట్లు గంగవరం ఐడీ పోలీసులు ఓ నిర్ధారణకొచ్చారు. పలువురు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... అదే గ్రామానికి చెందిన కుమార్‌రాజా, శిల్ప భార్యాభర్తలు. పిల్లలు లేరనే సాకు తో శిల్పను అత్తమామలు వేధించేవారు. దీనిపై బాధితురాలు భర్తతో పాటు అత్తమామలపై పలమనేరు కోర్టులో కేసు వేసిం ది. తీర్పు వెలువడ్డాక ప్రతినెలా బాధితురాలికి భరణం చెల్లిం చాల్సి వస్తుందని కుమార్‌రాజా బెంగపెట్టుకున్నాడు. ఎలాగైనా భార్యను మట్టుబెట్టాలని తన అక్క సుజాత స్నేహితుడైన పాతపేట టైలర్ మౌలాతో కలసి వ్యూహ రచన చేశాడు. మూడు నెలల క్రితం కోర్టు వాయిదాకొచ్చిన శిల్పతో కుమార్‌రాజా ప్రేమగా మాట్లాడి కేసు రాజీ చేసుకుందామని, ఇక తన తల్లిదండ్రులతో ఎటువంటి ఇబ్బందులూ ఉండవని, బెంగళూరులో కాపురం పెడదామని మాయమాటలు చెప్పాడు. రెండ్రోజుల్లో తాను చెప్పిన ప్రదేశానికి రావాలన్నాడు. భర్త మాటలు గుడ్డిగా న మ్మిన శిల్ప ఎర్రకదిరేపల్లె సమీపంలోని ఓ చింత తోపు వద్దకు వెళ్లింది. ఇరువురూ కలసి మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టైల ర్ మౌల శిల్ప మెడకు తాడు బిగించి చంపేశారు. అనంతరం కుమార్‌రాజా తన తల్లిదండ్రులతో కలసి మృతదేహాన్ని గ్రామ సమీపంలోని ఓ చెరువులో పూడ్చిపెట్టేశారు. మృతదేహం బయటపడుతుందేమోనన్న భయంతో మళ్లీ దాన్ని తీసుకొచ్చి తమ పొలంలోని చెరకు తోటలో పెట్రోల్ పోసి పూర్తిగా తగులబెట్టేశా రు. బాధితురాలి దుస్తులను జాగ్రత్తపరిచారు. మృతదేహం కాలిపోయిన తర్వాత కొన్ని ఎముకలను తీసుకొని కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ చెరువులో పూడ్చిపెట్టారు. పోలీసులు జరిపిన విచారణలో హత్య జరిగిన రోజు భర్త, టైలర్ మౌల, మరికొందరు ఒకే టవర్ లొకేషన్లో ఉండడంతో ఈ కేసు బయటపడినట్లు తెలిసింది. ప్రస్తుతం గంగవరం పోలీసులు నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో అధికారికంగా ఈ వివరాలను వారు వెల్లడించే అవకాశం ఉంది.