breaking news
contract bill
-
తెలంగాణ సచివాలయంలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బిల్లులు రాకపోవడంతో విసిగిపోయిన రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి.సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళనకారులు వాపోయారు. తమ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, ఫైనాన్స్ సెక్రటరీని కలిసేందుకు ప్రయత్నిస్తే అధికారులు అనుమతించడం లేదని మండిపడ్డారు. ఎన్నిసార్లు చుట్టూ తిరిగినా భట్టిని కలిసే అవకాశం ఇవ్వడం లేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.భీష్మించుకు కూర్చున్న ఆందోళనకారులుతమకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అపాయింట్మెంట్ ఇప్పించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఛాంబర్ ఎదుట బైఠాయించి భీష్మించుకు కూర్చున్నారు. ప్రభుత్వ తీరుపై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.పోలీసులతో వాగ్వాదంపరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సచివాలయ భద్రతా సిబ్బంది, పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సచివాలయంలో ప్రభుత్వ ప్రతినిధుల ఛాంబర్ వద్దే బాధితులు ఆందోళనకు దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.ఇదీ చదవండి : సీఎంల జీతాలపై ట్యాక్స్‌లు కట్టేది మనమే!! -
గురుకుల ప్రిన్సిపల్ ఇంటిపై ఏసీబీ దాడి
- రూ.15 వేలు స్వాధీనం చిల్లకూరు, న్యూస్‌లైన్ : కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపునకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్, చిల్లకూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుభాషిణి ఇంటిపై, పాఠశాల సీనియర్ అసిస్టెంట్‌పై మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు చేసి రూ.15 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆమె గురుకుల పాఠశాల క్యాంపస్‌లో నివాసం ఉంటున్నారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు..గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సోమనాథ్ ట్రేడర్స్ నిర్వాహకులు పులిపాటి వెంకటేశ్వర్లు, కేవీ లక్ష్మినారాయణ 2013-14కు సంబంధించి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, కప్పులు సరఫరా చేశారు. ఇందుకుగాను వారికి రూ.1.27 లక్షలు చెల్లించాల్సి ఉంది. నగదు చెల్లించాలని సుభాషిణికి వారం కిందట ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. బిల్లులు చెల్లించాలని సోమనాథ్ ట్రేడర్స్ నిర్వాహకులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను కోరగా రూ.20 వేలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. చివరకు రూ.15 వేలు ఇచ్చేలా బేరం కుదిరింది. అనంతరం వారు ఏసీబీ డీఎస్పీ నంజుండప్పను కలిసి విషయాన్ని వివరించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ట్రేడర్స్ నిర్వాహకులు ప్రిన్సిపల్‌కు ఇంటి వద్దరూ.10 వేలు, పాఠశాల సీనియర్ అసిస్టెంట్ రమణయ్యకు పాఠశాలలో రూ.5 వేలు ఇచ్చారు. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఇద్దరిపై దాడులు చేసి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, కృపానందం, హెడ్‌కానిస్టేబుళ్లు రవిచంద్ర, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు రాగబాబు, కుద్దూస్, హరిప్రసాద్, సుధాకర్, సుబ్బారావు, షఫిఅహ్మద్లతో పాటు మహిళా ఏఎస్ఐ ఉమాదేవి, ఆర్అండ్బీ జేఈ పరమేశ్వరి పాల్గొన్నారు. నాకు సంబంధం లేదు సోమనాథ్ ట్రేడర్స్‌కు నగదు చెల్లించేందుకు ఎలాంటి లంచం అడగలేదు. ట్రేడర్స్ నిర్వాహకులు ఇంటి వద్దకు వచ్చి సీనియర్ అసిస్టెంట్ రమణయ్య పాఠశాల తాళాలు తీసుకురమ్మంటున్నారన్నారు. దీంతో గోడకు తగిలించిన తాళాలను తీసుకెళ్లమన్నాను. ఆ సమయంలో వారు కొంత నగదును అక్కడ ఉంచినట్టు అధికారులు చెప్పే వరకు నాకు తెలియదు. లంచం తీసుకోవడంలో నాకు ఏ మాత్రం సంబంధం లేదు. సుభాషిణి, ప్రిన్సిపల్ లంచం అడగడమేగాక వారం రోజులుగా తిప్పుకున్నారు పాఠశాలకు సరఫరా చేసిన వస్తు సామగ్రికి ఈ నెల మొదట్లోనే రూ.1.27 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ నగదును ఇవ్వాలని వారం రోజులుగా అడుగుతున్నాం. అయినప్పటికీ నగదు చెల్లింపుల్లో ఆలస్యం చేయడమేగాక లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ట్రేడర్స్ నిర్వాహకులు


