Consumer Complaint Form
-
ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా?
లక్షలాది మంది భారతీయులకు ఇష్టమైన వంటకం బిర్యానీ. సందర్భం ఏదైనా బిర్యానీ ఒక ఎమోషన్. అయితే ఒక ప్లేట్ బిర్యానీ చివరకు కోర్టు కేసు వరకు వెళ్తుందని ఎవరైనా ఊహిస్తారా? దీనికి సంబంధించి పుదుచ్చేరిలో జరిగిన ఒక విచిత్రమైన విషయం నెట్టింట సందడిగా మారింది.‘లైవ్‌లా’ (LiveLaw) నివేదిక ప్రకారం. స్థానిక రెస్టారెంట్లో పి. సుందరకుమార మణికందన్ అనే వినియోగ దారుడు తన స్నేహితుడు మహమ్మద్ నియాజుద్దీన్‌తో పుదుచ్చేరి ఎంజీ రోడ్డులోని ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ చేసి తింటూ ఉండగా, బిర్యానీలో చనిపోయిన పురుగు కనిపించింది. దీని తీవ్రతను గమనించిన అతను వీడియోలు, ఫోటోలు తీశారు. రెస్టారెంట్లో పరిశుభ్రత లోపించిందని, దీనివల్ల తనకు మానసిక ఆందోళన కలగడమే కాకుండా, ఆరోగ్యం పాడవుతుందనే భయం, హోటళ్లపై నమ్మకం పోయిందని ఆరోపించాడు. ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ఆ తర్వాత, మణికందన్ ఆ రెస్టారెంట్‌కు లీగల్ నోటీసు జారీ చేశారు. నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన , న్యాయపరమైన ఖర్చులను పేర్కొంటూ, అతను రూ. 1.3 లక్షల పరిహారం కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో పుదుచ్చేరిలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్ విఫలమైందని, ఇది ‘వినియోగదారుల రక్షణ చట్టం, 2019’ కింద సేవా లోపమేనని ఫిర్యాదు చేశారు.ఈ కేసులో రెస్టారెంట్ చేసిన ఒక పెద్ద తప్పు వారికి మైనస్ అయింది. కోర్టు నుంచి నోటీసులు అందినప్పటికీ 'బిర్యానీ అండ్ కో' ప్రతినిధులు కమిషన్ ముందు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును కోర్టు ఏకపక్షంగా విచారించింది. కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అంత స్పష్టంగా లేకపోయినా, వీడియో ఫుటేజీని కమిషన్ నిశితంగా పరిశీలించింది. ఆ వీడియోలో బిర్యానీలో చనిపోయిన ఈగ లాంటి పురుగు స్పష్టంగా కనిపించింది. అలాగే గూగుల్ రివ్యూలో కస్టమర్ పెట్టిన పోస్టుకు రెస్టారెంట్ మొదట స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పి, ఇలాంటివి మళ్లీ జరగవని పేర్కొంది. కానీ లీగల్ నోటీసుకు ఇచ్చిన రిప్లైలో మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించింది. ఈ పరస్పర విరుద్ధమైన సమాధానాల వల్ల రెస్టారెంట్ నమ్మకాన్ని కోల్పోయిందని కమిషన్ అభిప్రాయపడింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తవినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటళ్లకు ఉందని స్పష్టం చేసింది. కస్టమర్‌కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకపోయినప్పటికీ, ఈ ఘటన వల్ల ఆయన మానసిక వేదనకు, ఇబ్బందులకు గురయ్యారని కోర్టు అంగీకరించింది. దీని ప్రకారం వినియోగదారుడి మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులకుగానూ కస్టమర్‌కు 10వేల రూపాయలు,కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ. 3,000 ఇవ్వాలని చెల్లించాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది.అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన విషయం మరొకటి ఉంది. ఈ నగదు పరిహారంతో పాటు, ఫిర్యాదు దారుడికి 10 ప్లేట్ల హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలంటూ వినూత్న ఆదేశాలు జారీ చేసింది. ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున ఈ బిర్యానీని అందించాలని, అది కూడా పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉచిత బిర్యానీ పంపిణీ కోర్డు ఆర్డర్ అందిన రెండు వారాల్లోగా ప్రారంభం కావాలని ఆదేశించింది.ఇదీ చదవండి: హాట్ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
2.75 లక్షల యూజర్లు.. 1.3 లక్షల ఫిర్యాదులు
వినియోగదారులు ఆన్లైన్లో ఫిర్యాదులు దాఖలు చేసేందుకు తీసుకొచ్చిన ఈ–జాగృతి ప్లాట్‌ఫామ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. జనవరి 1న దీన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 2.75 లక్షల మంది ఈ ప్లాట్‌ఫామ్‌పై తమ పేర్లను నమోదు (రిజిస్టర్డ్ యూజర్లు) చేసుకున్నారు. ఇందులో 1,388 మంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు.ఫిర్యాదుల కోసం ఓసీఎంఎస్, ఈ–దాఖిల్, ఎన్సీడీఆర్సీ సీఎంఎస్, కాన్ఫోనెంట్ పోర్టళ్లు అందుబాటులో ఉండగా, వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ ఇ–జాగృతి ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకురావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వినియోగదారులు ఫిర్యాదులు దాఖలు చేసేందుకు, అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు.నవంబర్ 13 నాటికి 1,30,550 ఫిర్యాదులు దాఖలైనట్టు.. ఇందులో 1,27,058 ఫిర్యాదులకు పరిష్కారం చూపించినట్టు వినియోగ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఎన్ఆర్ఐలు విదేశాల నుంచే తమ వినియోగ హక్కులను ఈ ప్లాట్పామ్ ద్వారా కాపాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్లాట్‌ఫామ్‌తో భౌగోళిక పరమైన అవరోధాలు వారికి తొలగినట్టయిందని తెలిపింది. మీరూ ఫిర్యాదు చేస్తారా?మొదట ఇ-జాగృతి అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండితొలిసారి యూజర్ అయితే, మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్, మీరు వినియోగదారా లేక ఇతరులా అన్న వివరాలు నమోదు చేయండి.ఇప్పుడు వెరిఫికేషన్ ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంచుకోండి. చిరునామా, గుర్తింపు రుజువు వివరాలు ఇచ్చి రిజిస్టర్ పూర్తి చేయండికొత్త కంప్లయింట్ ఇలా..లాగిన్ అయిన తరువాత, మీ డ్యాష్ బోర్డ్ మీద "ఫైల్ న్యూ కేస్" ఎంచుకోండి. తర్వాత కేసు టైప్‌ను ఎంచుకుని ‘కన్స్యూమర్ కంప్లయింట్’పై క్లిక్ చేయండి.ఇప్పుడు ఫిర్యాదు అవసరమైన డాక్యుమెంట్లు, రుసుము వివరాలు కనిపిస్తాయి.వస్తువులు లేదా సేవల కోసం మీరు చెల్లించిన మొత్తం, ఇప్పుడు ఎంత పరిహారం కోరుకుంటున్నారు, తేదీ, మీ రాష్ట్రం, జిల్లా, కేటగిరీ, సబ్ కేటగిరి తదితర వివరాలు నమోదు చేయండి.కొనుగోలు రసీదులు, వారితో లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.చివరగా మొత్తం వివరాలను ఒకసారి సరిచూసుకుని సంబంధిత రుసుము చెల్లించి సబ్మిట్ చేయండి. -
ఈ–కామర్స్ కంపెనీలకు షాక్! రూ.42 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: ఉత్పత్తి తయారైన దేశం గురించిన వివరాలను సరిగ్గా పేర్కొనకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ–కామర్స్ కంపెనీలకు గడిచిన ఏడాది కాలంలో 202 నోటీసులు పంపినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. నిర్లక్ష్యం ఇక్కడే ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఉపకరణలు, దుస్తులు మొదలైన ఉత్పత్తుల విషయంలో ఇలాంటి ఉల్లంఘనలు నమోదైనట్లు పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన విషయంలో మొత్తం 217 నోటీసులు జారీ కాగా వీటిలో 15 నోటీసులు.. ఎక్స్పైరీ తేదీ, తయారీదారు .. దిగుమతిదారు చిరునామాలను సరిగ్గా పేర్కొనకపోవడం వంటి అంశాలకు సంబంధించినవి. మిగతా నోటీసులు.. ఆయా ఉత్పత్తులు ఏ దేశం నుంచి వచ్చినవో ఈ–కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫాంలలో సరిగ్గా చూపకపోవడం వల్ల జారీ చేసినవి. అయితే, ఏయే కంపెనీలకు నోటీసులు జారీ చేసినది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. భారీ జరిమానా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో కంపెనీలు చట్టబద్ధంగా నడుచుకోవాలని, వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి లీనా నందన్ తెలిపారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 76 కంపెనీల నుంచి రూ. 42,85,400 జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. ఈ దాఖిల్ జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్) ద్వారా వచ్చిన పలు ఫిర్యాదులను గడిచిన కొన్ని నెలల్లో పరిష్కరించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ–దాఖిల్ ద్వారా ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని లీనా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి ఒక వినియోగదారుడు రూ. 127.46 మొత్తానికి సంబంధించి ఒక రెస్టారెంటుపై ఇదే విధంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్...! -
ఫర్నిచర్ కొన్నాక వెంటనే ఇవ్వకపోవడమూ నిర్లక్ష్యమే
సాక్షి, హైదరాబాద్: ఫర్నిచర్ కొన్నాక అవి పాడైనా దెబ్బతిన్నా వాటికి బదులుగా కొత్తవి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన వ్యాపార సంస్థకు రూ.25 వేలు జరిమానా విధిస్తూ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కొత్త ఫర్నిచర్ ఇవ్వడానికి తీరని జాప్యం చేసిన సికింద్రాబాద్‌లోని గోద్రేజ్ అండ్ బోయ్‌సీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా జిల్లా ఫోరం విధించిన రూ.50 వేల జరిమానాను సగానికి తగ్గిస్తూ రాష్ట్ర కమిషన్ తీర్పు చెప్పింది. వినియోగదారుడికి ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని మాత్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ బి.ఎన్.రావు నల్లా, సభ్యులు పాటిల్ విఠల్‌రావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన కె.చంద్రశేఖర్ రూ.3.49 లక్షలను వెచ్చించి 2015లో ఫర్నిచర్ కొనుగోలు చేశారు. అందులో రూ.41 వేల విలువైన సోఫాలో కొన్నింటిని ఇవ్వలేదు. రూ.12 వేల విలువైన టీపాయ్ కూడా ఇవ్వలేదు. వాటిని గోద్రేజ్ సంస్థ నెలలోగా ఇస్తామని చెప్పి నెలల సమయాన్ని తీసుకుంది. దాంతో జిల్లా వినియోగదారుల ఫోరంలో చంద్రశేఖర్ కేసు వేశారు. రూ.5 లక్షలు పరిహారం కోరారు. దీనిపై రూ.50 వేలు పరిహారంగాను, రూ.5 వేలు ఖర్చులకు ఇవ్వాలని జిల్లా ఫోరం తీర్పు చెప్పింది. దీనిని గోద్రేజ్ సంస్థ రాష్ట్ర కమిషన్‌లో అప్పీల్ చేసింది. 2016 మార్చిలో వినియోగదారునికి కొత్త సామాన్లు ఇచ్చామని చెప్పింది. తీవ్ర జాప్యం చేయడం, ఇ–మెయిల్స్‌కు స్పందించకపోవడాన్ని రాష్ట్ర కమిషన్ కూడా తప్పుపట్టింది. ఇలాంటి వ్యాపారం అనైతికమని కమిషన్ అభిప్రాయపడింది. -
స్పాంజ్ వదిలివేసినందుకు 18 లక్షలు.....
న్యూఢిల్లీ : సర్జరీ సమయంలో కడుపులో కత్తులు వదిలేయడం, డాక్టర్లు ఫోన్లు మర్చిపోవడం.. వంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అది నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ నిజజీవితంలో బాధితుల ప్రాణాలు పోయేంత పని అవుతాయి. వివరాల్లోకి వెళితే ప్రసవం కోసం వెళ్తే కడుపులో స్పాంజ్‌ను ఉంచి... ఆమె ప్రాణాలపైకి తెచ్చిన డాక్టర్లు ఉన్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. మహిళకు శస్త్ర చికిత్స చేసి, కడుపులో స్పాంజ్ వదిలివేసినందుకు 18 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సర్జరీ చేసిన వైద్యులు, నర్సింగ్‌హోమ్‌ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఢిల్లీలోని కైలాష్ నగర్‌కు చెందిన స్వేతా ఖండేల్వాల్ ప్రసవం కోసం 2012లో రిషబ్ మెడికల్ సెంటర్‌కు వెళ్లింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 13న శస్త్రచికిత్స చేసిన వైద్యులు శిశువును తీసి ఆమె కడుపులో స్పాంజ్‌ను వదిలేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత స్వేతా ఖండేల్వాల్కు పలుమార్లు కడుపునొప్పి రావడంతో ఆమె మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లింది. అయితే డాక్టర్లు ఆమెకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తుండటంతో మరో ఆస్పత్రిలో చేరింది. పరీక్ష చేసిన అక్కడి వైద్యుల ఇన్పెక్షన్ కారణంగా కడుపులో చీము ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి అందుకు కారణమైన స్పాంజ్ ముక్కలను బయటకు తీశారు. బాధితురాలు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. దాంతో ఆమెకు కలిగించిన నష్టానికిగానూ 18 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రిషబ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.కె.జైన్, డాక్టర్ ఉషా జైన్లను ఫోరం ఆదేశించింది.


