breaking news
considers
-
TS: చేతికే చెక్ పెట్టాలి!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం తన సన్నద్ధతను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వేగవంతం చేసింది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత జాతీయ, రాష్ట్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఆ పార్టీ.. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎదురయ్యే పోటీపై లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల గణాంకాలు, వివిధ రూపాల్లో అందిన నివేదికల ఆధారంగా తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనన్న అంచనాకొచ్చింది. ఆ పార్టీ అనుసరించే వ్యూహాలు, ఎత్తుగడలు, ఇస్తున్న హామీలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తీరుతెన్నుల వంటి అంశాలపై లోతుగా దృష్టి సారించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు వరుస సభలు, సమావేశాలతో క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆతీ్మయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల పేరిట పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అక్కడి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీల పనితీరుపై కూడా కేసీఆర్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్సే.. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 2014లో 21 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, మరో 50 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 19 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ మరో 68 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఇక 2014లో ఐదు స్థానాల్లో, 2018లో కేవలం ఒకే చోట బీజేపీ అభ్యర్థులు గెలిచారు. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ పది నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలవగా, ఇందులో సగం వరకు హైదరాబాద్ నగరంలోనే ఉండటం గమనార్హం. ఈ గణాంకాలతో పాటు, ప్రస్తుతం వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వేలు, నిఘా సంస్థల నివేదికల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ప్రధాన పోటీ ఉంటుందో బీఆర్ఎస్ అధినేత విశ్లేషిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కొంత పుంజుకున్నట్లు కనిపించినా, కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా తగ్గినట్లు అధికార పార్టీ అంచనా వేస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కొంత మెరుగయ్యే అవకాశమున్నా ప్రధాన ప్రత్యరి్థగా మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఉంటుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సుమారు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు కాంగ్రెస్‌తోనే ప్రధానంగా పోటీ ఉంటుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. చేరికలతో బలోపేతం రాష్ట్ర అవతరణ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ 2014 ఎన్నికల తర్వాత 25 మంది ఇతర పారీ్టల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు ఉన్నారు. టీడీపీ నిరీ్వర్యమైనా, 2018 ఎన్నికల్లో మొత్తం మీద 87 స్థానాల్లో కాంగ్రెస్ తన పట్టు ప్రదర్శించింది. 2018 తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించిన హుజూర్నగర్, మునుగోడు స్థానాలను ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో వివిధ పారీ్టల నుంచి చేరిన 25 మంది ఎమ్మెల్యేలకు తిరిగి 2018లో బీఆర్ఎస్ టికెట్లు దక్కగా, తీగల కృష్ణారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్‌లాల్ ఓటమి పాలయ్యారు. అయితే వీరిపై గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తర్వాతి పరిణామాల్లో బీఆర్ఎస్ గూటికే చేరుకోవడం గమనార్హం. ఈ విధంగా కాంగ్రెస్ కుదేలైనట్లు కనిపిస్తున్నా పొంగులేటి, జూపల్లి వంటి నేతలు ఆ పారీ్టలో చేరితే ఆ పార్టీయే తమ ప్రధాన ప్రత్యరి్థగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు పార్టీ 2014 2018 కాంగ్రెస్ 07 12 టీడీపీ 12 02 వైఎస్సార్సీపీ 03 – బీఎస్పీ 02 – సీపీఐ 01 – ఇతరులు – 02 మొత్తం 25 16 -
చైనా మూలాలను చెరిపేస్తున్న టిక్‌టాక్
బీజింగ్: టిక్‌టాక్ చైనా మూలాలపై అమెరికాలో రోజురోజుకీ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ టిక్‌టాక్ సమూలమైన సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన యాజమాన్య బోర్డు, చైనా వెలుపల ప్రత్యేక ప్రధాన కార్యాలయం లాంటి మార్పులను టిక్‌టాక్ ప్రతినిధులు సన్నద్ధమైనట్లు సమాచారం. టిక్‌టాక్ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్‌కి చైనాలో తప్ప విడిగా ప్రధాన కార్యాలయం లేదు. అంతర్జాతీయ కార్యాలయం కోసం టిక్‌టాక్ అనేక ప్రదేశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే లాస్ ఏంజెలిస్, న్యూయార్క్, లండన్, డబ్లిన్, సింగపూర్లలో టిక్‌టాక్ ఐదు అతిపెద్ద కార్యాలయాలు ఉన్నాయి. తమ దేశంలో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ ఈ యాప్‌ని నిషేధించిన విషయం తెలిసిందే. చైనా కఠిన ఆంక్షలు విధించడంతో, టిక్‌టాక్ హాంకాంగ్‌లో కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అంతేకాకుండా, అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనాకు చెందిన టిక్‌టాక్ మాజీ చీఫ్ అలెక్స్ జూ, లాస్ఏంజెల్స్ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈఓ కెవిన్ మేయర్‌కి బాధ్యతలను అప్పగించారు. -
వెనక్కి తగ్గిన ట్రంప్:కొత్త ఆదేశాలు త్వరలో
వాషింగ్టన్: ట్రావెల్ బ్యాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. ఏడు ముస్లిం దేశాల ముస్లిం ప్రజలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటీవల జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన పునరాలోచనలో పడ్డారు. ముఖ్యంగా అమెరికా కోర్టులు ట్రంప్‌కు షాకిచ్చిన నేపథ్యంలో దిగి వచ్చిన ట్రంప్ త్వరలోనే కొత్త ఆదేశాలను జారీ చేయనున్నట్టు స్వయంగా ప్రకటించారు. దేశ భద్రత రీత్యా అంటూ డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు కోర్టులు, ఇతర వర్గాల తీవ్ర వ్యతిరేకత రావడంతో కొత్త కార్యనిర్వాహక ఆదేశాలపై దృష్టి పెట్టక తప్పలేదు. స్వల్పమార్పులతో "బ్రాండ్ న్యూ ఆర్డర్" ను త్వరలోనే జారీ చేయనున్నట్టు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విలేకరులతో చెప్పారు. సోమవారం లేదా మంగళవారం గానీ ఈ కొత్త ఆదేశాలు రానున్నట్టు ఆయన చెప్పారు. జాతీయ భద్రతా కారణాల రీత్యా ఇమ్మిగ్రేషన్ బ్యాన్ ఆర్డర్ చాలా కీలకమైనదనీ, దీనిపై చర్యను "చాలా వేగంగా" తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కోర్టు నిర్ణయం నేపథ్యంలో "అదనపు భద్రత" అవసరమని ట్రంప్ పునరుద్ఘాటించడం గమనార్హం. అయితే ఈ కొత్త ఆదేశాలు ఎలా ఉండనున్నాయి?ముఖ్యంగా ముస్లిం ప్రజలపై బ్యాన్ ను పూర్తిగా ఉపసంహరించుకుంటారా లేక కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నారా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. కాగా ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్ దేశాల ముస్లిం వీసా హోల్డర్లు తాత్కాలిక నిషేదానికి గురికావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు ఇమ్మిగ్రేషన్ బ్యాన్పై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికి దిగాయి. దీంతో ఈ పిటిషన్లను విచారించిన శాన్ఫ్రాన్సిస్కో కోర్టు ట్రంప్ ఆదేశాలను నిలిపి వేసింది. అంతకుముందు సియిటెల్ కోర్టుకూడా ఈ ఆదేశాలను తాత్కాలింగా నిలిపివేసింది.