breaking news
conductor posts
-
కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కారుణ్య నియామక ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. విధి నిర్వహణ లో మరణించిన సిబ్బంది వారసులకోసం కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చే యాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 1,600 కుటుంబాలు ఈ పథకంకోసం ఎదురు చూస్తున్నాయి. వాటిల్లో 813 దరఖాస్తులను మాత్రమే డిపో అధికారులు బస్ భవన్‌కు ఫార్వర్డ్ చేశారు. ఇప్పట్లో ఈ నియామకాలు వద్దని గతంలో ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించటంతో మిగతా దరఖాస్తులు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా 813 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. కాగా, కారుణ్య నియామకాలపై ఎన్ఎంయూ నేత నరేందర్, టీజేఎంయూ నేత హన్మంతు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ధన్యవాదాలు తెలిపారు. అయితే నియామకాలు తాత్కాలిక పద్ధతిలో కాకుండా రెగ్యులర్ బేసిస్‌లో చేపట్టాలని ఓ ప్రకటనలో కోరారు. ఆ కుటుంబాలకు న్యాయం: మంత్రి పొన్నం ‘ఆర్టీసీలో నియామకాలు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కండక్టర్ నియామకాలు చేపట్టాం. దానిలో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు దీంతో న్యాయం జరుగుతుంది’. -
ఐపీ పెట్టిన ఫైనాన్స్ వ్యాపారి
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : గ్రామంలో ఓ వ్యక్తి రూ.50 వేలతో ప్రా రంభించిన ఫైనాన్స్ వ్యాపారం రెండేళ్లకు లక్ష ల టర్నొవర్‌కు చేరింది. ఆ మరుసటి ఏడాదే వ్యాపారి మెడలో బంగారు చైన్.. చేతికి ఉంగ రాలు వచ్చారుు. దీంతో అతడి ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రామస్తులు ముం దుకొచ్చారు. ఇదే అదనుగా సదరు ఫైనాన్షియర్ సుమారు 70 మంది నుంచి సుమారు రూ.కోటి వరకు సేకరించాడు. ఐదేళ్లతో అతడి వ్యాపారం కోట్లకు చేరింది. కాని చివరికి తాను ఫైనాన్స్ వ్యాపారంలో నష్టపోయాయనని అతడు కోర్టును ఆశ్రయించాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన గండు రమేష్ అలియాస్ దుబాయి శ్రీనివాస్ అలియాస్ డాన్ శ్రీనివాస్ గ్రామంలో ఐదేళ్ల క్రితం ఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. వివిధ వర్గాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లు సేకరించాడు. దీంతోపాటు వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు, ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు, హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. సదరు వ్యాపారి విలాసవంతమైన జీవితం గడపడంతో అతడి మాటలను నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చారు. జల్సాలతోనే నష్టం.. వివిధ వర్గాల ద్వారా ఫైనాన్స్ వ్యాపారంలో డబ్బులు సేకరించిన గండు రమేష్ జల్సాలకు అలవాటుపడ్డాడు. వ్యాపారంలో నష్టం రావడంతో ఎవరికీ తెలియకుండా కోర్టును ఆశ్రయించాడు. తన వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాడు. వారం రోజుల క్రితం కోర్టు నుంచి ఐపీ పొందాడు. తనకు ఇల్ల్లు, ఎకరంన్నర వ్యవసాయ పొలం, రెండు సీలింగ్ ఫ్యాన్లు, పది కుర్చీలు ఉన్నట్లు సదరు ఫైనాన్స్ వ్యాపారి కోర్టుకు విన్నవించాడు. ఐపీ పొందిన వెంటనే అతడు పరారయ్యూడు. కోర్టు నుంచి నోటీ సులు అందుకున్న బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కొక్కరు కనీసం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు అతడి వద్ద డబ్బులు దాచుకున్నారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఫైనాన్స్‌లో డబ్బులు దాచుకున్నవారు లబోదిబోమంటున్నారు.