breaking news
Concern at the Collectorate
-
అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు సరికాదు: మంత్రి సురేష్
-
అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు సరికాదు: మంత్రి సురేష్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారని.. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు. రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. చదవండి: ‘ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దు’ -
జీవీఎంసీ కార్మికుల ధర్నా
28. కలెక్టరేట్ ముందు బైఠాయించిన జీవీఎంసీ కార్మికులు సిరిపురం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ పారిశుధ్యం, పార్కులు, తాగునీరు, వీధిలైట్లు, ఆఫీస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రతి నెలా ఐదో తేదీలోగా వేతనాలు చెల్లించాలని, ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, వారంలో ఒక రోజు సెలవుతోపాటు, ఎనిమిది పండగ దినాలు, 15 క్యాజు వల్ లీవ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు జి.సుబ్బారావు మాట్లాడుతూ వీధులు శు భ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులకు సే ఫ్టీ మాస్క్‌లు, గ్లౌజులు, సబ్బులు, అం దజేయాలన్నారు. కార్మికులు మృతి చెందితే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వెంటనే రూ. 10వేలు ఇవ్వాలని, హైకోర్టు తీర్పు ప్రకారం ప్యాకేజీ కాం ట్రాక్టర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. వినతిపత్రా న్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇ చ్చేందుకు సిద్ధమైన కార్మికులను పో లీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మ ద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ధ ర్నాలో యూనియన్ నగర గౌరవాధ్యక్షు డు జి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి పి.వెంకటరెడ్డి, అధ్యక్షుడుఎం.సూరీడు, పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.