breaking news
comments on modi - amith shah
-
ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై కక్షగట్టారు
రాయచోటి అర్బన్ : విభజన హామీలను అమలుపర్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రప్రభుత్వంపై కక్ష గట్టారని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డి ఆరోపిం చారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణంలో 1, 2, 31 వార్డుల్లో 4వ విడత నవనిర్మాణదీక్ష సభను నిర్వహించారు. గతంలో జరిగిన తిరుపతి సభలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా విభజన హామీలన్ని నెరవేరుస్తానంటూ ప్రధాని ప్రమాణం చేశారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్‌బాష, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర మురళి, ప్రభుత్వ న్యాయవాది జక్రియాబాష, కమిషనర్ శ్రీనివాసులు, డీఈఈ సుబ్రమణ్యం, హౌసింగ్ ఏఈ హరి పాల్గొన్నారు. రామాపురం : నవనిర్మాణ దీక్షల నిర్వహణ సమయాల్లో మార్పుచేసినట్టు మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నవనిర్మాణ దీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ అనూరాధ, ఎంపీడీఓ విజయరావు, ఎంపీడీఓ సూపరింటెండెంట్ అబ్దుల్‌రహీం పాల్గొన్నారు. నవనిర్మాణ దీక్షా.. పింఛన్ల పంపిణీనా ? సంబేపల్లె : నవనిర్మాణ దీక్షా.. పింఛన్లు పంపిణీ కార్యక్రమా అని పింఛన్‌దారులు వాపోతున్నారు. దీక్షలకు జనాలు రాక పోవడంతో కొత్తగా పింఛన్లు ఇస్తామంటూ అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. శనివారం నాల్గో విడత నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్కిరెడ్డిపల్లె: నవనిర్మాణ దీక్షలో అందరూ భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ రవికుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీరాములు నాయక్, సూపరింటెండెంట్ హైదర్ వల్లీ పాల్గొన్నారు. -
'ఆ వీడియోలో వాయిస్ నాది కాదు'
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేసిన పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజ్ పురోహిత్‌కు మహారాష్ట్ర బీజేపీ శనివారం నోటీసులు జారీచేసింది. దీనిపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆ వీడియోలో వాయిస్ తనది కాదని, అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాలని ఆయన బదులిచ్చారు. మోదీతో పాటు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై పురోహిత్ వ్యాఖ్యలు చేసినట్లుగా బీజేపీ అధిష్టానం వద్ద వీడియో ఉంది. క్రమశిక్షణ ఉల్లంఘణ చర్యలు చేపట్టాలని భావించి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రావ్ సాహెబ్ దాన్వేకు మూడు రోజుల్లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యే పురోహిత్, ప్రధాని మోదీ, అమిత్ షా లపై, బీజేపీపై వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వీడియో కొన్ని ఛానళ్లతో పాటు వెబ్సైట్లలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నప్పటికీ తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన అన్నట్లు వీడియోలో ఉంది. కేంద్రంలో చాలా మంచి పనులు చేస్తున్నప్పటికీ మోదీ కొన్ని తప్పులు చేస్తున్నారని, రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒత్తిడిలో పనిచేయలేరని, కేంద్రలో సమీకృత విధానం లేదని తప్పపట్టడం వంటి వ్యాఖ్యలతో ఆగ్రహించిన పార్టీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.