breaking news
code released
-
పకడ్బందీగా..!
సాక్షి, నల్లగొండ : ఎన్నికల మోడల్ కోడ్‌ను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. శనివారం ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రజలను ఆకర్షించే పథకాలను అమలు చేయొద్దని కమిషన్ సూచిం చింది. దీంతో అధికారులు నిబంధలన ప్రకారం చేపట్టాల్సిన చర్యలను గట్టిగా అమలు చేస్తున్నారు. రాత్రికిరాత్రే కోడ్ అమలు.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మోడల్ కోడ్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రాత్రికిరాత్రే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న రాజకీయ పార్టీల హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లను సిబ్బంది చేత తొలగింపజేశారు. నల్లగొండ, చిట్యాల, మిర్యాగూడ, హాలియా, దేవరకొండ, చండూరు పట్టణాల్లో పార్టీలకు సంబంధించిన బ్యానర్లను తొలగించారు. గ్రామపంచాయతీల్లోనూ మోడల్ కోడ్ అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఉప్పల్ డీపీఓకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో పార్టీల బ్యానర్లు ఇతర రాతలను తొలగించాలని సూచించారు. రాజకీయపార్టీల కదలికపై కన్ను.. మోడల్ కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పా ర్టీలు ఓటర్లను ఆకట్టుకునే, మభ్యపెట్టే ప్రకటనలపై నిఘా పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో.. మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా..? అనే దానిపై నిఘా పెంచారు. ఎన్నికల్లో అభ్యర్థులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తారు. అందుకు సంబంధించి ఇప్పటికే కమిటీ కూడా వేసింది. బదిలీలు నిషేధం.. రాజకీయ నేతలకు ప్రభుత్వ ఆధీనంలోని గెస్ట్ హౌజ్‌లు, కార్యాలయాలు ఇవ్వవద్దని ఎన్నికల కమిష న్ సూచించింది. అధికారులు కూడా ప్రైవేట్ పను ల కోసం మంత్రులను కలవద్దని ఆదేశించింది. పోలీస్, తదితర శాఖల్లో బదిలీలు నిషేధించింది. పోస్టింగులు ఇవ్వొద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఆదేశించింది. ఎంసీఎంసీ కమిటీ నియామకం.. ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులు టీవీ, పత్రికల్లో ఎలాంటి ప్రకటనలు ఇవ్వాలన్నా.. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కమిటీని నియమించారు. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా డీఆర్వో, పౌరసంబంధాల అధికారి ఉంటారు. ఈ కమిటీకి తెలియకుండా మీడియాలో ఎలాంటి ప్రకటనలు ఇచ్చేందుకు వీల్లేదు. ఎన్నికల సంఘం ఆదేశానుసారం తొలగిస్తున్నాం ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారమే రాజకీయ నేత ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగిస్తున్నాం. మోడల్ కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల అధకారి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు .దాంతో అన్ని పార్టీల నేతల ఫ్లెక్సీలు తొలగిస్తున్నాం. – దేవ్ సింగ్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ -
‘కోడ్’ఉంది జాగ్రత్త..!
సాక్షి, నిర్మల్ (ఆదిలాబబాద్): శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించగానే పూర్తిస్థాయిలో కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సైతం పకడ్బందీగా అమలుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఆదివారం రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడకుండా చూడాలని చెప్పారు. అధికారులు, ఉద్యోగులు సైతం రాజకీయాలకు దూరంగా ఉండాలని, పార్టీలకు, అభ్యర్థులకు అంటకాగడం చేయొ ద్దని ఈసీ ఆదేశాల మేరకు హెచ్చరించారు. ఇక నుంచి అభ్యర్థులు, పార్టీలు చేసే ప్రతీ ఖర్చు ప్రభుత్వానికి చెప్పాల్సిందే. చేసే ప్రచారానికీ అనుమతి తీసుకోవాల్సిందే. నిన్నటి నుంచే ‘కోడ్.. ఉంది జాగ్రత్త..’ అంటూ తమ నాయకులు, కార్యకర్తలకు పార్టీలు హెచ్చరిస్తున్నాయి. రంగంలోకి అధికారులు.. రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడ్డారు. ఇక ఇప్పుడంతా అధికారుల చేతుల్లోనే. విధులతో పా టు పాలననూ వారే అజమాయిషీ చేస్తారు. ఎన్ని కల కోడ్ పూర్తిస్థాయిలో అమలులోకి రావడం తోనే తాజామాజీ ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వ సిబ్బంది సైతం వెనక్కి వచ్చేశారు. ఇప్పటికే ప్ర భుత్వ పీఏలు తమ సొంతశాఖల్లోకి వెళ్లిపోయా రు. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే అదేరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీల సారథ్యంలో రెవెన్యూ, పోలీస్ తదితరశాఖలతో సమావేశం నిర్వహించారు. ఇక నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏంచేయాలి.. ఎలాచేయాలి.. అనే దానిపై ఆదేశాలు జారీ చేశా రు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పనులను సైతం బృందాల వారీగా వర్గీకరించారు. ఏ అధి కారి ఏఏ పనులు చూడాలన్నది నిర్ణయించి, బా ధ్యతలనూ అప్పగించారు. సోమవారం నుంచి ఆయా బృందాలుపనుల్లో నిమగ్నం కానున్నాయి. పార్టీలు, అభ్యర్థులపై నిఘా.. షెడ్యూల్ వచ్చే వరకు కేవలం కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఒక 7వభాగం మాత్రమే అమలైంది. శనివారం షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. దీంతో పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచారం సైతం అధికారుల పరిశీలన పరిధిలోకి వచ్చేసింది. వారు చేసే ప్రచారం, సభలు, సమావేశాలు అన్నీ అధికారుల అనుమతితోనే జరగాల్సి ఉంటుంది. ముందస్తుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ముందుగు సాగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆయా సభలు, ప్రచార కార్యక్రమాల్లోనూ ప్రసంగాలను రికార్డు చేసే వీడియో టీమ్‌లు సైతం రంగంలోకి దిగుతున్నాయి. వీటితో పాటు సీసీ కెమెరాల నిఘానూ పెంచనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ప్రతి ఖర్చుకూ లెక్క చెప్పాల్సిందే.. ఎన్నికలంటేనే లెక్కలేనంత ఖర్చు అన్నది సామాన్యుడు సైతం చెప్పేమాట. కానీ.. అధికారికంగా పార్టీలు, అభ్యర్థులు మాత్రం తాము చేసే ప్రతీ ఖర్చుకు ఎన్నికల సంఘానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. కరపత్రాలను, ఫ్లెక్సీలను ప్రింట్ చేయించినా.. ఎన్ని ప్రింట్ చేయించారు, ఎక్కడ చేయించారు, ఎవరు చేశారు, వారికి సంబంధించిన అడ్రస్.. ఇలా ప్రతీది తెలియ జేయాల్సి ఉంటుంది. ప్రచారంలో పాల్గొనేవాహనాలు ఎన్నో చెప్పాలి. వాటికి ముందుగానే అనుమతి తీసుకోవాలి. సభలు, సమావేశాలకూ ఇదే పద్ధతిలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాత పద్ధతిలో సభలు, సమావేశాలకు అనుమతి తీసుకోవడం ఆలస్యమవుతుండటంతో పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈనేపథ్యంలో ‘సువిధ’ పేరిట ఎన్నికల సంఘం త్వరలో సింగిల్‌విండో పద్ధతిన అనుమతి కోసం కొత్త ఆన్లైన్ పోర్టల్‌ను తీసుకురానున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఖర్చుల లెక్కలను చూసేందుకు ఇన్‌కంటాక్స్ అధికారి అనితను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. సార్లు..రాజకీయాలు చేయొద్దు.. ప్రభుత్వం ఉన్ననాళ్లు ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నేతలతో పెనవేసుకుని తిరిగిన అధికారులు, ఉద్యోగులనూ ఎన్నికల సంఘం హెచ్చరించింది. కోడ్ ప్రకారం అధికారులు, ఉద్యోగులు రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పింది. విధులు నిర్వర్తించేవారు పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం, అభ్యర్థులను కలువడం చేయొద్దని స్పష్టంచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనకుండా చూడాలని స్పష్టంచేసింది. అభ్యర్థులు, పార్టీలకు మద్దతుగా ప్రచారం చేయడం, చెప్పడం కూడా చేయొద్దు. భర్త లేదా భార్య ఎన్నికల బరిలో ఉంటే ముందస్తుగా సెలవు పెట్టిన తర్వాతే ప్రచారం పాల్గొనాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారులు బిజీ బిజీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు అధికారులంతా బిజీబిజీగా ఉండనున్నారు. గత నెలరోజుల నుంచే జిల్లా అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ పూర్తికాగానే, ఈవీఎంలు, వీవీప్యాట్లపైన అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు షెడ్యూల్‌తో పాటు పూర్తిస్థాయి కోడ్ రావడంతో మరింత పని పెరిగింది. ఓవైపు రోజువారీ శాఖాపరమైన విధులను చూడటంతో పాటు ఎన్నికల బాధ్యతలనూ చూసుకోవాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో కలెక్టర్ సైతం సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అత్యవసర ఫిర్యాదులు ఉన్నవారు నేరుగా కలెక్టరేట్ వచ్చి కలవచ్చని సూచించారు. కోడ్ అమలులోకి వచ్చినందున పార్టీల ప్రచారాలను తొలగిస్తున్నారు. 24గంటల్లోపు ప్రభుత్వ కార్యాలయాలలో, 72గంటల్లోపు ప్రైవేటు ఆస్తులపై గల ప్రచారఫ్లెక్సీలు, రాతలను, ఫొటోలను తొలగిస్తున్నారు. -
ప్రారంభమైన ఎంసెట్-2 ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్ష శనివారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి 38,245 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది (31.93 శాతం) విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. ఇక ఏపీ విద్యార్థుల కోసం 28 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించారు. కాగా ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులకు అధికారులు ముందు నుంచి సూచించినప్పటికీ పలు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని లోనికి అనుమతించకపోవటంతో గేటు వద్ద నుంచే వెనుదిరిగారు. కాగా ప్రాథకమిక కీని ఈరోజు సాయంత్రం, ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. కాగా ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సెట్ కోడ్ 'ఆర్'ను ఎంపిక చేశారు. -
ఎంసెట్-2కు ‘ఆర్’ ప్రశ్నాపత్రం ఎంపిక
-
ఎంసెట్-2కు ‘ఆర్’ ప్రశ్నాపత్రం ఎంపిక
హైదరాబాద్: తెలంగాణలో శనివారం జరగనున్న ఎంసెట్-2 ప్రశ్నాపత్రం కోడ్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి రెడ్డి విడుదల చేశారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం పేపరు కోడ్‌గా ‘ఆర్’ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్ష నిర్వాహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 63 కేంద్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎంసెట్ కన్వినర్ చెప్పడంతో.. బయోమెట్రిక్ కోసం విద్యార్థులను గంట ముందునుంచే పరీక్షా కేంద్రాలలోకి అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.