breaking news
cockfight betting
-
కోడిపందేలు నిషేధం: డీఎస్పీ
క్రోసూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడిపందేలు నిర్వహించడం, కోడి కత్తులు విక్రయించడం, పేకాట తదితర జూదాలపై నిషేధం ఉన్నట్లు సత్తెనపల్లి డీఎస్పీ ఆర్.విజయభాస్కరరెడ్డి తెలిపారు. శనివారం క్రోసూరు రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎస్పీ పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. కోడి పందేలు నిర్వహించేవారిపై అవసరమైతే సస్పెక్ట్ షీట్ తెరుస్తామని చెప్పారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి రూరల్ సీఐ ఆర్.ఉమేష్, ఎస్ఐ ఎం.నారాయణ పాల్గొన్నారు. అచ్చంపేట: అచ్చంపేటలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని శనివారం సత్తెనపల్లి డీఎస్పీ ఆర్.విజయభాస్కరరెడ్డి సందర్శించారు. కోడిపందేల నిషేధంలో భాగంగా 12 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయన వెంట సత్తెనపల్లి సీఐ ఆర్.ఉమేష్, అచ్చంపేట ఎస్ఐ సీహెచ్ మణికృష్ణ పాల్గొన్నారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు ముప్పాళ్ళ: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడిపందేలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఎం.పట్టాభిరామయ్య చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కోడిపందేల నిర్వాహకులను శనివారం బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇంట్లోనే పండుగను జరుపుకోవడం మంచిదన్నారు. ఆరుగురిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. జూదాలు నిర్వహిస్తే శిక్ష తప్పదు సత్తెనపల్లి: కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ ఆవుల బాలకృష్ణ హెచ్చరించారు. శనివారం ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో మండలంలో కోడిపందేలు నిర్వహించిన వ్యక్తులకు రూరల్ పోలీసు స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: గాల్లోకి ఎగిరి.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. వివాహిత మృతి! -
చంద్రబాబూ.. ఇలాగేనా వ్యవహరించేది?
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల కనుసన్నల్లో కోడి పందాలు జరుపుతూ.. వేల కోట్లు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడి పందాలు, వేలకోట్ల బెట్టింగ్‌లు జరుగుతుంటే హోంమంత్రి పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలిగేలా టీడీపీ నేతల పాలన ఉందని విమర్శించారు. మాజీ సీఎం కూతురు, ప్రతిపక్ష నేత చెల్లెలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఆమె రాజకీయం చేస్తుందని చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. షర్మిల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మహిళగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి షర్మిల ఫిర్యాదు చేశారంటే ఆమె ఎంత బాధపడిఉంటుందో అర్థమవుతుందన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. షర్మిల వ్యవహారంలో ఇలానేనా వ్యవహరించేదని విమర్శించారు. -
కోడి పందాలు నిర్వహిస్తున్న 23 మంది అరెస్ట్
మచిలీపట్నం: కోడిపందాలు నిర్వహిస్తున్న 23 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4.30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. కోడి పందాలను నిర్వహించకుండా కృష్ణా జిల్లాలో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి తనఖీలను చేపట్టామని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా కైకలూరు చెక్ పోస్ట్ వద్ద 23 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4.30 లక్షల్ని, 19 కోళ్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ జె ప్రభాకర రావు తెలిపారు. జిల్లాలో కోడి పందాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభాకర్ రావు హెచ్చరించారు.