breaking news
coal block allocation case
-
జిందాల్‌పై అభియోగాలు నమోదుచేయండి
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన కేసులో పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, మరో నలుగురిపై అభియోగాలు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు సోమవారం దర్యాప్తు సంస్థను ఆదేశించింది. జిందాల్‌తో పాటు మరో నలుగురిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (చీటింగ్), 120–బి (క్రిమినల్ కుట్ర) కింద అభియోగాలు మోపాలని ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాషర్ ఆదేశించారు. జిందాల్‌తోపాటు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ సుశీల్ మరూ, మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గోయల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రాంత్ గుజ్రాల్, కంపెనీ అధీకృత ఉద్యోగి డీఎన్ అబ్రోల్‌పై అభియోగాలు మోపారు. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన విషయాన్ని కోర్టు విచారించింది. నిందితులపై అభియోగాలను అధికారికంగా ప్రకటించేందుకు జూలై 25 వరకు సమయం ఇచ్చింది. -
నాకు ముడుపులిస్తామన్నారు: జడ్జి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితులకు అనుకూలంగా ఉండాలంటూ కొంతమంది న్యాయవాదులు తనను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిందితుడి తరపు న్యాయవాది తనను సంప్రదించాడని, తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు ఇస్తామన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి మభ్యపెట్టే మాటలు మరోసారి నాదృష్టికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న.. జడ్జి వ్యాఖ్యలతో ఖంగుతిన్న న్యాయవాది, కోర్టు హాలులోనే క్షమాపణలు కోరారు. అయితే ఆ న్యాయవాది పేరుని మాత్రం జడ్జి బయటికి చెప్పలేదు.